అమెరికా సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఎలాన్ మస్క్‌పై ప్రత్యేక దర్యాప్తునకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు మెజారిటీ సాధించనున్న తరుణంలో రాబోయే సమావేశాల్లో కీలక విచారణలు చేపట్టేందుకు వీలుగా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ యంత్రాంగానికి కీలక డాక్యుమెంట్లు భద్రపరచాలని ఆదేశిస్తూ లెటర్స్ పంపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో 'స్టార్‌షీల్డ్' వ్యవస్థను మస్క్ బ్లాక్ చేయటం, నియంత్రించడంపై ఈ విచారణ కేంద్రంగా ఉండనుంది. ఉక్రెయిన్‌తో ముడిపడిన ఈ వివాదంతో పాటు.. రష్యన్ డీజిల్ ఇంధన సరఫరా ఒప్పందంలో భాగమైన పోర్టులు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా కమిటీ లేఖలు పంపినట్లు డెమొక్రాటిక్ సెనేటర్ సహాయకుడు సీఎన్‌ఎన్‌కు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు, అనుమానాస్పద కార్యకలాపాలలో భాగస్వామ్యం ఉన్నట్లు భావించే వ్యక్తులకు డాక్యుమెంట్లు దాచిపెట్టకుండా కాపాడాలని నోటీసులు పంపడం సాధారణ పార్లమెంటరీ ప్రక్రియ అని స్పష్టం చేశారు. జనవరిలో డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో పూర్తి ఆధిక్యతను చేజిగించుకున్న తర్వాత.. గత రెండేళ్లలో ట్రంప్ పాలనా కాలం నాటి నిర్ణయాలపై కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నాయకత్వ మార్పులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సెనేటర్ జీన్ షాహీన్ రిటైర్మెంట్ కారణంగా.. సెనేటర్ క్రిస్ కూన్స్ తర్వాతి కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మొత్తం పరిణామాల మధ్య ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ నెట్‌వర్క్ సేవలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యూహాత్మక చర్యలు రాజకీయ వేడెక్కింపునకు కారణమయ్యాయి. స్టార్‌షీల్డ్, స్టార్‌లింక్ లాంటి కమ్యూనికేషన్ వ్యవస్థల నిర్వహణపై అమెరికా పార్లమెంట్ ప్రత్యేక దృష్టి సారించడం టెక్ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తులు మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
3
Beranda
› international
› restrict the 'Starshield' system in Ukraine
› science
› technology
› US Senate Foreign Relations Committee Prepares to Investigate Elon Musk
› ఎలాన్ మస్క్‌పై దర్యాప్తునకు సిద్ధమవుతున్న అమెరికా సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ
Subscribe to:
Post Comments (Atom)
