About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label science. Show all posts
Showing posts with label science. Show all posts

స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ను పరిశీలించవలసిందిగా కేంద్రానికి ట్రాయ్ సూచన

ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రతిపాదిస్తున్న మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్ అంశాన్ని పరిశీలించాలని టెలికాం సేవల నియంత్రణ సంస్థ  కేంద్రానికి సూచించింది. ఇప్పటివరకూ ఎయిర్ టెల్, జియో వంటి ఆపరేటర్లు సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఇంటర్నెట్, కాల్ సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు వాటిని నేరుగా శాటిలైట్ కు లింక్ చేయడం ద్వారా అందించాలని కేంద్రానికి ట్రాయ్ సూచించింది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ టెల్, జియో వంటి సంస్థలు సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఇస్తున్న ఇంటర్నెట్ నాణ్యతపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోనే ఇంటర్నెట్ స్పీడ్ లేదన్న ఫిర్యాదులు రోజూ లక్షల్లోనే ఉంటున్నాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఇంటర్నెట్ సంగతి తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు. ఈ నేపథ్యంలోనే నేరుగా శాటిలైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడుకునే, కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని స్టార్ లింక్ ముందుకొచ్చింది. అయితే ఇప్పటివరకూ స్టార్ లింక్ కు కేంద్రం పూర్తి స్ధాయిలో అనుమతులు ఇవ్వలేదు. దీనిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నేరుగా శాటిలైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు వీలుగా ఓ విధానం తయారు చేయాలని ట్రాయ్ ఇవాళ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే స్టార్ లింక్ తో పాటు అమెజాన్ లియో, యూటెల్ శాట్ వన్ వెబ్, టాటా నెల్కో వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అంచనా. అలాగే ఇప్పటికే ఉన్న టెలికాం ఆపరేటర్లు ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి కంపెనీలు కూడా తమ నెట్ వర్క్ కవరేజ్ విస్తరించుకోవచ్చని అంచనా. 

Read More...

స్పైడర్-మ్యాన్ చిత్రంలోని 'గ్రీన్ గోబ్లిన్' పాత్ర స్ఫూర్తి : యాంగ్జీ నదిపై హోవర్‌బోర్డ్‌తో గాల్లో ఎగిరిన చైనా యువకుడు

చైనాకు చెందిన 26 ఏళ్ల సాంగ్ జింగ్‌యు నిజమైన ఫ్లయింగ్ హోవర్‌బోర్డ్‌ను తయారు చేశాడు. సినిమాల్లో కేవలం కల్పన అనుకున్న గాల్లో ప్రయాణించే టెక్నాలజీని ఆచరణ సాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వినూత్న హోవర్‌బోర్డ్ పవర్ కోసం దాదాపు 10 ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ సరికొత్త DIY (Do-It-Yourself) ఆవిష్కరణ కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా.. ఏకంగా పర్వతాల పైన, సువిశాలమైన యాంగ్జీ నదిపై గాల్లో ఎగిరి తన సత్తా చాటింది. ఎలాంటి రెక్కలు లేకుండా, మనిషి నిలబడి గాల్లో ప్రయాణించే ఈ విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

Read More...

ఎలాన్ మస్క్‌పై దర్యాప్తునకు సిద్ధమవుతున్న అమెరికా సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ

అమెరికా సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఎలాన్ మస్క్‌పై ప్రత్యేక దర్యాప్తునకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు మెజారిటీ సాధించనున్న తరుణంలో రాబోయే సమావేశాల్లో కీలక విచారణలు చేపట్టేందుకు వీలుగా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ యంత్రాంగానికి కీలక డాక్యుమెంట్లు భద్రపరచాలని ఆదేశిస్తూ లెటర్స్ పంపారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో 'స్టార్‌షీల్డ్' వ్యవస్థను మస్క్ బ్లాక్ చేయటం, నియంత్రించడంపై ఈ విచారణ కేంద్రంగా ఉండనుంది. ఉక్రెయిన్‌తో ముడిపడిన ఈ వివాదంతో పాటు.. రష్యన్ డీజిల్ ఇంధన సరఫరా ఒప్పందంలో భాగమైన పోర్టులు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా కమిటీ లేఖలు పంపినట్లు డెమొక్రాటిక్ సెనేటర్ సహాయకుడు సీఎన్‌ఎన్‌కు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు, అనుమానాస్పద కార్యకలాపాలలో భాగస్వామ్యం ఉన్నట్లు భావించే వ్యక్తులకు డాక్యుమెంట్లు దాచిపెట్టకుండా కాపాడాలని నోటీసులు పంపడం సాధారణ పార్లమెంటరీ ప్రక్రియ అని స్పష్టం చేశారు. జనవరిలో డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో పూర్తి ఆధిక్యతను చేజిగించుకున్న తర్వాత.. గత రెండేళ్లలో ట్రంప్ పాలనా కాలం నాటి నిర్ణయాలపై కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నాయకత్వ మార్పులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సెనేటర్ జీన్ షాహీన్ రిటైర్మెంట్ కారణంగా.. సెనేటర్ క్రిస్ కూన్స్ తర్వాతి కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మొత్తం పరిణామాల మధ్య ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ నెట్‌వర్క్ సేవలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యూహాత్మక చర్యలు రాజకీయ వేడెక్కింపునకు కారణమయ్యాయి. స్టార్‌షీల్డ్, స్టార్‌లింక్ లాంటి కమ్యూనికేషన్ వ్యవస్థల నిర్వహణపై అమెరికా పార్లమెంట్ ప్రత్యేక దృష్టి సారించడం టెక్ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ దర్యాప్తులు మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. 

Read More...

సంచలనంగా మారిన చైనా అంతరిక్ష విమానం ''షెన్ లాంగ్''

చైనా అత్యంత రహస్యమైన అంతరిక్ష విమానం ''షెన్ లాంగ్''కు చెందిన ఒక ఫోటో సంచలనంగా మారింది. అమెరికా నిఘా సంస్థ విడుదల చేసని రక్షణ ముప్పు అంచనా నివేదికలో దీని గురించి ఉంది. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న ఈ రోబోటిక్ అంతరిక్ష విమానం గతంలో అంతరిక్షంలో గుర్తుతెలియని వస్తువును విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. గత ఆరేళ్లుగా ఇది అంతరిక్షంలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. లో ఎర్త్ ఆర్బిట్ లో గుర్తుతెలియని వస్తువులను విడుదల చేసినట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. దీనిపై వార్తలు రావడంతో పలు సంస్థలు, వ్యక్తులు భూమిపై ఉన్న రాడార్లు, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో దీనిని ట్రాక్ చేస్తున్నారు. తాజాగా వెలువడిన ఫోటోలను 2024లో మ్యాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ తీసింది. సుమారు 90 కిలోమీటర్ల దూరం నుంచి దీనిని ఫోటో తీసింది. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రూపొందించిన థ్రెట్ అసెస్మెంట్ నివేదికలో ఈ చిత్రం ఉంది. అంతరిక్షంలోకి వెళ్లిన వస్తువుల్ని కక్ష్యలో ప్రవేశపెట్టడం, వాటిపై ప్రయోగాలు నిర్వహించడం, తిరిగి భూమిని చేరుకునే సామర్థ్యాలు ఈ అంతరిక్ష విమానానికి ఉన్నాయని నివేదిక పేర్కొంది. అంతరిక్షంలో మరో ఉపగ్రహానికి ఈ విమానం అనుసంధానమై ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. దీని సోలార్ ప్యానెల్స్ విస్తరించి ఉన్నాయి. విమానం వెనక భాగంలో పేలోడ్ తలుపు కూడా తెరిచి ఉన్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. షెన్‌లాంగ్ రపునర్వినియోగించగల అంతరిక్ష విమానం. ఇది అమెరికాకు చెందిన బోయింగ్ నిర్మిత X-37B అంతరిక్ష విమానాన్ని పోలి ఉంటుంది. రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన తర్వాత కక్ష్యలోకి చేరుకుని విమానంలా మళ్లీ భూమిపై ల్యాండ్ అవుతుంది. ప్రస్తుతం ఇది నాలుగో మిషన్ కోసం అంతరిక్షంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ -2 ఎఫ్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. షెన్‌లాంగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు చైనా ఎలాంటి ఫోటో విడుదల చేయలేదు. అయితే, ప్రస్తుతం ఫోటోను బట్టి ఈ అంతరిక్ష విమానం పొడవు సుమారు 26 అడుగులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Read More...

నవంబర్ 6న భూమి వాతావరణంలోకి ప్రవేశించనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ

అంతరిక్ష పరిశోధనలో 22 ఏళ్ల పాటు సేవలందించిన నాసా స్విఫ్ట్ అబ్జర్వేటరీ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. నాసా అంచనాల ప్రకారం ఈ శాటిలైట్ నవంబర్ 6న భూమి వాతావరణంలోకి ప్రవేశించనుంది. దీనిని కాపాడేందుకు నాసా చేపట్టిని రెస్క్యూ మిషన్ విషలయమైంది. దీంతో ఇది ఇప్పుడు భూమిపై కూలడం అనివార్యంగా మారింది. 2004లో ప్రయోగించిన స్విస్ట్ అబ్జర్వేటరీ బరువు సుమారు 1.5 టన్నులు. విశ్వంలోని శక్తివంతమైన ఖగోళ సంఘటనల్ని పరిశీలించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ముఖ్యంగా గామా-కిరణ విస్ఫోటనాల అధ్యయనంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు 2,000కు పైగా గామా-కిరణ విస్ఫోటనాలను, దాదాపు 1,400 సూపర్‌నోవాలను గుర్తించింది. దీని ద్వారా విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల అంతం, బ్లాక్ హోల్ వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు కీలకమైన సమాచారం లభించింది. గామా-రే విస్పోటనాల్లో సూర్యుడు తన జీవితాంతం విడుదల చేసే శక్తిని కేవలం కొన్ని సెకన్లలో విడుదల చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా భూమి చుట్టూ తిరిగే శాటిలైట్లు వాతావరణంలోని స్వల్ప ఘర్షణ కారణంగా క్రమేపి తమ కక్ష్యను కోల్పోతుంటాయి. స్విఫ్ట్ కూడా ఇలాంటి ప్రభావానికే గురైంది. అయితే, దాని కక్ష్యను పెంచి మరికొన్నేళ్లు సేవలు అందించేలా చేసేందుకు నాసా శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇందుకోసం క్యాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థతో 30 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ‘లింక్’ అనే రోబోటిక్ అంతరిక్ష నౌకను పంపి, స్విఫ్ట్‌ను సమీపించి పట్టుకుని, దాని కక్ష్యను పెంచాలనేది ప్రణాళిక. అయితే, ఇందులో ఆగస్టులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రోబోటిక్ అంతరిక్ష నౌక స్విప్ట్‌కు అవసరమైనంత దగ్గరగా వెళ్లలేకపోయింది. దీంతో నాసా ఈ రెస్క్యూను రద్దు చేయాల్సి వచ్చింది. నాసా స్విప్ట్ కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. నవంబర్ 6న భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితులు, కక్ష్యలో మార్పుల కారణంగా అది ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. భూమి వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించే సమయంలో వాతావరణ ఘర్షణ కారణంగా ఇది ఆకాశంలోనే కాలిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని భాగాలు సముద్రంలో పడిపోతాయని భావిస్తున్నారు. దీని వల్ల పెద్దగా నష్టం లేదని చెబుతున్నారు.

Read More...

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జీఎస్‌ఎల్వీ-ఎఫ్-18 రాకెట్ ద్వారా ఎన్‌ఎస్‌వీ-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత నావిగేషన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక మైలురాయి అని ప్రశంసించారు. రవాణా, విమానయానం, సముద్ర నావిగేషన్, పర్యవేక్షణ, అత్యవసర సేవల వంటి కీలక రంగాల్లో ఎన్‌ఎస్‌వి-03 మెరుగైన సేవలు అందించనుందని పేర్కొన్నారు. ఈ విజయం యావత్ దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Read More...

ప్లాస్టిక్ కన్నా పేపర్ స్ట్రాలవల్ల క్యాన్సర్​ ముప్పు 16.18 రెట్లు అధికం : దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు

పేపర్ స్ట్రాలు పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే, అది కేవలం అపోహ మాత్రమేనని, నిజానికి ప్లాస్టిక్ కన్నా ఇదే ఎక్కువ ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలిందని కొరియన్ సైంటిస్టులు అంటున్నారు. ఈమేరకు సౌత్ కొరియా పర్యావరణ, ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. పీపుల్ పవర్ పార్టీ ప్రతినిధి కిమ్ వి-సాంగ్ ఈ నెల 21న రిలీజ్ చేసిన అధ్యయన ఫలితాల్లో మిగతా వాటితో పోలిస్తే పేపర్ స్ట్రాలతో వెలువడే క్యాన్సర్ ముప్పు ఎక్కువని తేలింది. ఈ పేపర్ స్ట్రాల తయారీ, వినియోగం, డిస్పోజ్ చేసే ప్రక్రియలో వెలువడే కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారక) ఉద్గారాలు సంప్రదాయ స్ట్రాలతో పోలిస్తే 6.33 రెట్లు ఎక్కువని బయటపడింది. పేపర్, బయోడిగ్రేడబుల్, బయో బేస్డ్ పాలియెత్లైన్ స్ట్రాలను సంప్రదాయ ప్లాస్టిక్ స్ట్రాలతో పోల్చి పరిశీలించినపుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సైంటిస్టులు తెలిపారు. ప్లాస్టిక్ స్ట్రాల తరహాలోనే మిగతా స్ట్రాలు కూడా మట్టిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు. అందుకే, ప్లాస్టిక్ స్ట్రాలతో పోలిస్తే వీటివల్ల క్యాన్సర్​ ముప్పు ఏకంగా 16.18 రెట్లు అధికమని పేర్కొన్నారు. కాగా, వాడి పారేసిన స్ట్రాలను వ్యర్థాలుగా ఎలా మారుస్తున్నారనే దానిని కూడా ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు. జాతీయ వ్యర్థ గణాంకాల ఆధారంగా వినియోగించిన స్ట్రాలలో 73.6% దహనం, మిగిలిన 26.4% పూడ్చివేత ప్రదేశాలకు చేరుకుంటున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. మరోవైపు, స్ట్రాలను ఏ పదార్థంతో చేసినా సరే పరిమాణం కారణంగా వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టమని, వాటిపై ఉండే రసాయనిక పూతతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్లాస్టిక్ స్ట్రాలపై మాత్రమే నిషేధం విధించడం సరికాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కస్టమర్ అడిగితే తప్ప డిస్పోజబుల్ స్ట్రాలను ఇవ్వకూడదని దుకాణదారులకు సిఫారసు చేశారు.

Read More...

విజయవంతమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 ప్రయోగం : ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 విజయవంతంగా ఆకాశంలోకి దూసుకుళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'NVS-03 ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా హృదయపూర్వక అభినందనలు. మన దేశీయ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ని మరింత బలోపేతం చేయడంలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైన అడుగు. మరిన్ని మెరుగైన సామర్థ్యాలతో పనిచేసే NVS-03 ఉపగ్రహం, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంలో మన దేశ స్వయంసమృద్ధి సాధనను మరింత ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా మన ప్రజలకు ఉపయోగపడే నావిగేషన్ సేవలకు ఎంతగానో తోడ్పడుతుంది. మన అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం, సృజనాత్మకత నిరంతరం మన రంగాన్ని, దేశాన్ని గర్వపడేలా చేస్తున్నాయి' అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.

Read More...

మెదడు సంకేతాలతో కంప్యూటర్లను నియంత్రించే సాంకేతికత : తొలి ఉత్పత్తి పేరు 'టెలిపతి'గా అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్‌

మెదడు సంకేతాలతో కంప్యూటర్లను నియంత్రించే సాంకేతికతను న్యూరాలింక్‌ సంస్థ మరింత అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో తమ తొలి ఉత్పత్తి పేరు 'టెలిపతి' అని మస్క్‌ అధికారికంగా ప్రకటించారు. దీని ద్వారా మాట్లాడటం, కీబోర్డుపై టైప్‌ చేయడం వంటి అవసరం లేకుండానే కేవలం ఆలోచనలతో కంప్యూటర్లతో సంభాషించవచ్చని వెల్లడించారు. రాబోయే కొన్నేళ్లలో ఈ సాంకేతికత ద్వారా సమాచారాన్ని పంపించే వేగం.. మనుషులు మాట్లాడటం లేదా వేగంగా టైప్‌ చేయడం కంటే ఎక్కువగా ఉంటుందని మస్క్‌ అంచనా వేశారు. కంప్యూటర్లతో పాటు ఇతర వ్యక్తులతోనూ ఆలోచనల ఆధారంగా వేగంగా కమ్యూనికేట్‌ చేయడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ వెనుక న్యూరాలింక్‌ అభివృద్ధి చేసిన ఎన్‌1  బ్రెయిన్‌ ఇంప్లాంట్‌ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో 64 సన్నని, సౌకర్యవంతమైన తీగలపై మొత్తం 1,024 ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇవి మెదడులోని కదలికలను నియంత్రించే మోటార్‌ కార్టెక్స్‌ నుంచి నాడీ సంకేతాలను సేకరిస్తాయి. ఆర్‌1 అనే ప్రత్యేక శస్త్రచికిత్స రోబోట్‌ ఈ తీగలను మెదడులో అమర్చుతుంది. ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొంటున్న పక్షవాతం బాధితులు ఈ ఇంప్లాంట్‌ సాయంతో కంప్యూటర్‌ కర్సర్‌ను కదిలించడం, చదరంగం ఆడటం, డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానంగా కర్సర్‌ నియంత్రణ అందుబాటులో ఉండగా, కీబోర్డు, ఇతర పరికరాల నియంత్రణ వంటి సదుపాయాలు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా, అక్టోబర్‌ 29న న్యూరాలింక్‌ ఇంజినీర్లు 72 గంటల పాటు ప్రత్యేక ఇన్నోవేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ వాయిస్‌ క్లినికల్‌ ట్రయల్‌ భాగస్వామితో కలిసి కొత్త ఫీచర్లను అభివృద్ధి చేశారు. ఇందులో మాట్లాడాలనే ఉద్దేశాన్ని మెదడు సంకేతాల ద్వారా గుర్తించి ఆటోమేటిక్‌గా వాయిస్‌ కమ్యూనికేషన్‌ ప్రారంభించే సదుపాయం, మెదడు సంకేతాలను దృశ్యరూపంలో చూపించే సాధనాలు ఉన్నాయి. అంతేకాకుండా, 'హే న్యూరాలింక్‌' అని మనసులో అనుకుని ఆదేశాలు ఇవ్వడం ద్వారా గ్రోక్‌ ఏజెంట్‌తో కంప్యూటర్‌ పనులు చేయించే ప్రయోగాత్మక సదుపాయాన్ని కూడా రూపొందించారు. మస్క్‌ ఇదే రోజు న్యూరాలింక్‌ రెండో ఉత్పత్తిగా 'బ్లైండ్‌సైట్‌'ను కూడా ప్రకటించారు. పుట్టుకతోనే చూపులేని వారితో పాటు పూర్తిగా అంధులైన వారికి చూపును అందించడమే దీని లక్ష్యమని తెలిపారు. అయితే దీనికి ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉంది.

Read More...

రేపు రాత్రి GSLV-F18 రాకెట్‌ ను నింగిలోకి పంపనున్న ఇస్రో

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి 11 గంటల 51 నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ 18 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. షార్‌లోని వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ వ్యాబ్‌లో రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తిచేశారు. ఈ ప్రయోగం భారత స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ను మరింత బలోపేతం చేయనుందని ఇస్రో తెలిపింది. మన రోజువారీ ప్రయాణాల నుంచి కీలకమైన నావిగేషన్ సేవల వరకు శాటిలైట్ పాత్ర ఎంతో కీలకం. అయితే భారత్‌ సొంత నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే మరో కీలక అడుగు అవసరం. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలను తిరిగి మెరుగుపరచడంలో ఈ ప్రయోగం కీలకంగా మారనుంది. గతంలో ఉపగ్రహాల్లోని అణు గడియారాల పనితీరు నిలిచిపోవడం, వాటి సేవా కాలం ముగియడం, కొన్ని ఉపగ్రహ ప్రయోగాలు విఫలం కావడం వంటి కారణాలతో ఈ వ్యవస్థలో పలు సమస్యలు ఏర్పడ్డాయి. వాటికి పరిష్కారంగా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. NVS-03 ఉపగ్రహం రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో మూడోది. అలాగే భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ IRNSS లో ఇది 12వ ఉపగ్రహం. ఈ ప్రయోగాన్ని తొలుత 2026 అక్టోబర్ 15 నుంచి 20 మధ్య చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందు 2025 చివర్లోనే ప్రయోగించాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది. ఇటీవల PSLV ప్రయోగాల్లో ఎదురైన అవాంతరాల నేపథ్యంలో ఇస్రో మరింత జాగ్రత్తగా వ్యవహరించి షెడ్యూల్‌ను సవరించింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే నావిగేషన్‌ వ్యవస్థకు అవసరమైన కనీసం నాలుగు పనిచేసే ఉపగ్రహాల సంఖ్యను అందుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా స్థాన నిర్ధారణ సమాచార సేవలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.

Read More...

రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్

దేశీయ మార్కెట్లో గోయీన్ సంస్థకు చెందిన చలో 1000 వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువైన ఒక ఆప్షన్ గా నిలుస్తోంది. ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన లుక్ , నగర ప్రయాణాలకు అనువైన పెర్ఫార్మన్స్ తో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు సంప్రదాయ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, మార్కెట్‌కు వెళ్లడం, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటున్నాయి . ఎలక్ట్రిక్ మోటార్ ఆధారంగా పనిచేసే ఈ స్కూటర్‌లో ప్రయాణ సౌకర్యంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. భారతీయ రహదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని డిజైన్ఈ చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్, శక్తివంతమైన మోటార్, ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. 60V , 72V బ్యాటరీ వేరియంట్ లు అందుబాటులో ఉన్నాయి.ఈ స్కూటర్‌లో 1,500W రేటెడ్ పవర్, 2,000 W పీక్ పవర్ కలిగిన BLDC హబ్ మోటార్‌ను అందించారు. కంపెనీ ప్రకారం టాప్ స్పీడ్ 80 kmph .దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతుంది .లిథియం, లెడ్-యాసిడ్ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. లిథియం బ్యాటరీ ఛార్జింగ్‌కు సుమారు 4 గంటలు, లెడ్-యాసిడ్ బ్యాటరీకి సుమారు 8 గంటలు పడుతుంది బ్యాటరీ పెర్ఫార్మన్స్ పర్యవేక్షించేందుకు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంను అందించారు. డిజైన్ పరంగా ట్విన్ ప్రొజెక్టర్ LED హెడ్‌ ల్యాంప్స్, LED లైటింగ్, వెడల్పైన టైర్లు, ఆకర్షణీయమైన బాడీ నిర్మాణం ప్రత్యేకంగా ఉంటాయి. రివర్స్ మోడ్, పార్కింగ్ మోడ్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, ఎలక్ట్రానిక్ వీల్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ECO ,SMART ,HYPER రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు 220 mm, వెనుక 180 mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక స్ప్రింగ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను అందించారు. 90/90-12 ముందు టైర్, 120/70-12 వెనుక టైర్, 170mm. గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ లోడ్ సామర్థ్యం 150 కిలోలు, బ్యాటరీ లేకుండా బరువు 80 కిలోలు. మోటార్‌కు IP66 ప్రొటెక్షన్ రేటింగ్‌ను అందించారు. Army Olive ,Frost White , Blaze Orange ,Glacier Blue ,Lunar Silver ,Sage Green రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.



Read More...

అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు ఒకటి గిఫ్ట్ గా ఇస్తాను : ఎలాన్ మస్క్ ప్రకటన

అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు తన ఏరోస్పేస్ కంపెనీ 'స్పేస్ఎక్స్' నుంచి ఒక షేరును బహుమతిగా ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "వచ్చే ఏడాది, నేను అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్ఎక్స్ షేర్లలో ఒకటి గిఫ్ట్ గా ఇస్తాను. ఇది ఇలాంటి బహుమతులలో మొదటిది మాత్రమే అవుతుంది" అని మస్క్ పేర్కొన్నారు. 2025 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 72 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారు. స్పేస్ఎక్స్ షేర్ల ఇటీవలి ట్రేడింగ్ ధరల ఆధారంగా చూస్తే, ఈ భారీ పంపిణీ అంచనా విలువ దాదాపు 10.5 బిలియన్ డాలర్లు ఉండొవచ్చని నివేదికలు వస్తున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం మస్క్ ప్రస్తుత ఆస్తి దాదాపు 908.5 బిలియన్ డాలర్లు. 2002లో స్పేస్ఎక్స్ ను  స్థాపించిన మస్క్, కంపెనీ మొత్తం ఈక్విటీలో దాదాపు సగం వాటాను కలిగి ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం మస్క్ కు  పెద్ద భారం కాకపోవచ్చు. ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' తమ షేర్లలో 5 శాతాన్ని పబ్లిక్ బెనిఫిట్ ఫండ్ కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై స్పందిస్తూ, స్పేస్ ఎక్స్ షేర్లను నేరుగా ప్రజలకే ఇవ్వడం మంచిదని సిఫార్సు చేస్తూ మస్క్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. "నేను మనసులో ఇంకా చిన్నపిల్లాడినే, నాకూ ఒక షేరు కావాలి!" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. అంతరిక్ష నౌక స్టార్షిప్ను నిర్మిస్తున్న కంపెనీలో వాటా లభించడం వల్ల రాబోయే తరం మొత్తం అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి చూపుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ షేర్ల ద్వారా వచ్చే డబ్బును పేదరికాన్ని నిర్మూలించడానికి, మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగించాలని కొందరు సూచించారు.

Read More...

భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధం : 'స్టార్‌లింక్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ లారెన్ డ్రేయర్ వెల్లడి

దేశవ్యాప్తంగా 100 శాతం డిజిటల్ కనెక్టివిటీ సాధించాలనే ప్రధాని మోడీ ఆశయానికి మద్దతుగా నిలిచేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని 'స్టార్‌లింక్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ లారెన్ డ్రేయర్ వెల్లడించారు. ఇప్పటికే ఇన్-స్పేస్, శాటిలైట్ లైసెన్సుల నుంచి ప్రాథమిక అనుమతులు పొందిన స్టార్‌లింక్, ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) భద్రతా క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది. సుదూర, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో స్టార్‌లింక్ శాటిలైట్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని కంపెనీ అభిప్రాయపడింది. భారతీయ భద్రతా అవసరాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు స్టార్‌లింక్ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత వినియోగదారుల డేటాను దేశీయంగానే భద్రపరిచేలా ప్రతి దశలోనూ నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వందలాది యాంటెన్నాలతో కూడిన 20కి పైగా గేట్‌వే సైట్లను ఇప్పటికే నిర్మించామని పేర్కొంది.

Read More...

మళ్లీ ట్రిలియనీర్‌గా అవతరించిన ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా మారారు. స్పేస్‌ఎక్స్, టెస్లా కంపెనీల షేర్ల విలువ భారీగా పెరగడంతో ఆయన సంపద ఒక్కరోజులోనే ఏకంగా 65 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో మస్క్ మొత్తం సంపద 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. అక్టోబర్ ప్రారంభం నుంచి స్పేస్‌ఎక్స్ షేర్లు సుమారు 13 శాతం పెరగగా.. టెస్లా షేర్లు 6.7 శాతం లాభపడ్డాయి. ఈ కంపెనీల్లో మస్క్‌కు ఉన్న వాటాల విలువ పెరగడం ఆయన సంపదపై నేరుగా ప్రభావం చూపింది. గత మూడు నెలల్లో తొలిసారిగా మస్క్ సంపద 13 అంకెల స్థాయికి చేరింది. జూన్‌లో స్పేస్‌ఎక్స్ రికార్డు స్థాయిలో పబ్లిక్ ఆఫరింగ్ చేపట్టడంతో షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఆ సమయంలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ నిలిచారు. అయితే ఆ తర్వాత కంపెనీ విలువపై ఆందోళనలు వ్యక్తం కావడంతో షేర్ల ధరలు తగ్గి, ఆయన సంపద కూడా గణనీయంగా పడిపోయింది. జూలై చివరి నాటికి మస్క్ సంపద గరిష్ఠ స్థాయి నుంచి 600 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. ఈ మొత్తం బ్లూమ్‌బర్గ్ ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల జాబితాలో ఇప్పటివరకు నమోదైన ఇతర వ్యక్తుల మొత్తం సంపద కంటే కూడా ఎక్కువగా ఉండటం విశేషం. తాజా షేర్ల ర్యాలీకి స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థలపై మళ్లీ పెరిగిన పెట్టుబడిదారుల నమ్మకమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా రంగాల్లో స్పేస్‌ఎక్స్‌కు ఉన్న అవకాశాలపై ఆశావాదం పెరగడంతో ఆ కంపెనీ షేర్లు ఆగస్టు కనిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 58 శాతం పుంజుకున్నాయి. మరోవైపు మస్క్ వ్యక్తిగత సంపదలో 98 శాతానికి పైగా స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల్లో ఆయనకు ఉన్న వాటాల ద్వారానే వస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంపద సూచీ పేర్కొంది. దీంతో ఈ రెండు కంపెనీల షేర్ల కదలికలు మస్క్ సంపదపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి.

Read More...

అక్టోబర్ 7 నుంచి 10 వరకు 'ఇండియా మొబైల్ కాంగ్రెస్'

అక్టోబర్ 7 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో 'ఇండియా మొబైల్ కాంగ్రెస్'  జరగనుంది. చిప్‌సెట్ కంపెనీలు, టెలికాం దిగ్గజాలు తీసుకునే నిర్ణయాలు బడ్జెట్ ఫోన్ల ఎంపికపై ప్రభావం చూపుతాయి. అక్టోబర్ 8, 9 తేదీల్లోనే ఎర్లీ యాక్సెస్ ఆఫర్లు మొదలవుతాయి. మీడియాటెక్, యూనిసాక్ సంస్థల కొత్త రోడ్‌మ్యాప్‌లు, స్టాండ్‌అలోన్ 5G  అప్‌డేట్‌లు, భారత్‌లో ఫోన్ల అసెంబ్లింగ్ భాగస్వామ్యాలపై కన్నేసి ఉంచండి. ఇవన్నీ ధరలు, బ్యాటరీ ఎఫిషియెన్సీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, నెట్‌వర్క్ సపోర్ట్‌ను నిర్ధారిస్తాయి. ఈ సదస్సులో చౌకైన ఎంట్రీ-లెవెల్ 5G డిజైన్లు, తక్కువ ధరల ప్లాట్‌ఫారమ్‌లపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు తమ 5G SA నెట్‌వర్క్ విస్తరణ, వాయిస్ ఓవర్ న్యూ రేడియో  టైమ్‌లైన్‌ను ప్రకటించవచ్చు. దీనివల్ల వాయిస్ క్వాలిటీ, కవరేజ్ పెరగడమే కాకుండా బ్యాటరీ డ్రెయిన్ కూడా తగ్గుతుంది.  ఈసారి బడ్జెట్ విభాగంలో 6 నానోమీటర్ లేదా 4 నానోమీటర్ చిప్‌సెట్ల వల్ల మెరుగైన ఎఫిషియెన్సీ చూడవచ్చు. చిన్న నోడ్స్ వల్ల ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా గేమింగ్ ఆడొచ్చు, ఫ్రేమ్ రేట్ స్థిరంగా ఉంటుంది, బ్యాటరీ కూడా ఎక్కువ సేపు వస్తుంది. చవకైన ప్రాసెసర్లలో కూడా మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ ఇస్తుండటంతో నైట్ షాట్స్, ఆటోఫోకస్ క్వాలిటీ మెరుగవుతుంది. దేశంలోనే అసెంబ్లింగ్ పెరగడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి, స్పేర్ పార్ట్స్ వేగంగా లభిస్తాయి. రిపేర్ సెంటర్లు కూడా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలా సర్వీస్ హామీలపై కొత్త ప్రకటనలు రావచ్చు. విద్యార్థులు పిక్-అప్, డోర్‌స్టెప్ రిపేర్ సదుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. ఒకవేళ రూ. 10 వేల లోపే n28 5G బ్యాండ్ ఉన్న ఫోన్ వస్తుందంటే కొద్ది రోజులు ఆగడం బెటర్. లేదంటే మంచి బ్యాటరీ లైఫ్, UFS స్టోరేజ్ ఉన్న మోడల్ తీసుకోవచ్చు.

Read More...

నాడీ కణాలను కాంతితో నియంత్రించే సాంకేతికతకు నోబెల్ పురస్కారం : న్యూరాలజిస్ట్ కార్ల్ డీసెరోత్, జర్మన్ సహచరులు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌ ఎంపిక

కాంతితో నాడీ సంకేతాలను నియంత్రించే పద్ధతినే 'ఆప్టోజెనెటిక్స్' అని పిలుస్తున్నారు. ఆప్టోజెనెటిక్స్ రంగంలో చేసిన కృషికి గాను అమెరికన్ సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్ కార్ల్ డీసెరోత్, జర్మన్ సహచరులు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లకు ఈ ఏడాది ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. మానవ మెదడు ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీరి పరిశోధన దోహదపడింది. క్లినికల్ మెడిసిన్‌లో, దృష్టి లోపం ఉన్నవారిలో చూపును తిరిగి రప్పించే ప్రయత్నాలలో పరిశోధకులు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. న్యూరోసైన్స్‌లో కొత్త శకానికి పునాది వేశారని ఈ ముగ్గురిని నోబెల్ కమిటీ ప్రశంసించింది.

Read More...

అత్యాధునిక మోడల్ 'క్లాడ్' శిక్షణ : స్వామి సర్వప్రియానందతో విస్తృతంగా చర్చించిన ఆంత్రోపిక్

ఏఐకి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకు ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఆధ్యాత్మిక, తత్వశాస్త్రం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో 'ఇంటర్నెట్ యుగపు స్వామి వివేకానంద'గా పేరొందిన వేదాంత గురువు స్వామి సర్వప్రియానందను ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. తమ అత్యాధునిక మోడల్ 'క్లాడ్'కు శిక్షణ ఇచ్చే విధానాలు, సాంకేతికతలో నైతిక విలువల రూపకల్పన, భవిష్యత్తులో ఏఐ మానవుల తరహా చేతనను సాధించగలదా అనే అంశాలపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. సంస్థతో కుదిరిన నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ)కారణంగా సమావేశంలోని పూర్తి వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ మేధోమథనంలో సంస్థ వ్యవస్థాపకులలో ఒకరితో పాటు వివిధ మతాల ఆధ్యాత్మికవేత్తలు, మానసిక నిపుణులు, వైద్యులు పాల్గొని తమ విలువైన ఆలోచనలను అందించారని ఆయన తెలిపారు. కేవలం గణిత అల్గారిథమ్‌లు, డేటాతోనే కాకుండా మానవీయ కోణాన్ని అర్థం చేసుకునేలా ఏఐని తీర్చిదిద్దడమే ఈ సమాలోచనల అసలు ఉద్దేశం. 

Read More...

అంతరిక్షంలో పేలిన పాత అమెరికన్ ఉపగ్రహం : ఎలాంటి తక్షణ ప్రమాదం గుర్తించబడలేదని అమెరికా అంతరిక్ష దళం

అమెరికా ఉపయోగించిన ఒక పాత గూఢచారి ఉపగ్రహం అంతరిక్షంలో అకస్మాత్తుగా పేలి ముక్కలై చెల్లాచెదురైంది. 1988వ సంవత్సరంలో అంతరిక్షంలోకి ప్రయోగించిన USA-32 అనే ఈ ఉపగ్రహం గత సెప్టెంబర్ 13వ తేదీన భూమి యొక్క దిగువ కక్ష్యలో ముక్కలైంది. దీనివల్ల దాని భాగాలు అంతరిక్షంలో చెల్లాచెదురయ్యాయి. ఆ ప్రాంతంలో 200కి పైగా ఉపగ్రహాలు ఉన్నందున, వాటికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా అనే ప్రశ్న తలెత్తింది. అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్, 1988 సెప్టెంబర్ 5వ తేదీన టైటాన్-2 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. దీనికి 'ఫర్రా-3' అనే రహస్య పేరు కూడా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ యొక్క రాడార్ మరియు రేడియో సిగ్నల్స్‌ను పర్యవేక్షించడం దీని ప్రధాన విధి. చాలా ఏళ్ల క్రితమే దీని పనితీరు ముగిసినప్పటికీ, ఇది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది. సుమారు 775 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఈ ఉపగ్రహం ముక్కలు కావడానికి గల కారణం ఇప్పటివరకు కచ్చితంగా తెలియలేదు. అంతరిక్షంలో ఉండే వేడి మరియు చలిలో వచ్చే మార్పుల కారణంగా చాలా ఏళ్లుగా దాని బ్యాటరీ లేదా పీడనంతో కూడిన ఇంధన ట్యాంక్‌లో లోపం ఏర్పడి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా చిన్న అంతరిక్ష వస్తువు (శకలం) ఢీకొట్టి ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కానీ, ఈ కారణాలలో ఏదీ ఇప్పటివరకు నిర్ధారించబడలేదు. సెప్టెంబర్ 17వ తేదీన అమెరికా అంతరిక్ష దళం ఈ ఘటనను ధృవీకరించి, చెల్లాచెదురైన భాగాలను పర్యవేక్షించడం ప్రారంభించింది. ఉపగ్రహ భాగాలు చెల్లాచెదురైన ప్రాంతంలో 200కి పైగా ఉపగ్రహాలు ఉన్నట్లు సమాచారం. వాటిలో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అంతరిక్షంలో గాలి నిరోధకత తక్కువగా ఉన్నందున, ఈ శకలాలు చాలా కాలం పాటు కక్ష్యలోనే ఉండిపోవచ్చు. అవి ఇతర ఉపగ్రహాలను ఢీకొంటే మరింత అంతరిక్ష చెత్త ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి తక్షణ ప్రమాదం గుర్తించబడలేదని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. 

Read More...

స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపిన నాసా

స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌లో నాసా నలుగురు వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపించింది. కేప్‌ కానవెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వీరున్న స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇంధన వ్యవస్థ లీకేజీ కారణంగా మూడు వారాలు ఆలస్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జెస్సికా వాట్కిన్స్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఎస్‌ఎస్‌లోకి ఆమె వెళ్లడం ఇది రెండోసారి. అదేవిధంగా, కక్ష్యలోకి వెళ్లే వ్యోమగాములకు నల్లజాతి మహిళ కమాండర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి. ఈ నలుగురూ ఆరు నెలలపాటు ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు. ఇప్పటికే అక్కడున్న నలుగురు వ్యోమగాములు తిరిగి భూమిపైకి వస్తారు. వాట్కిన్స్‌ మొదటిసారి 2022లో దీర్ఘకాలంపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. జియాలజిస్ట్‌ అయిన వాట్కిన్స్‌కు దశాబ్దం క్రితం నాసా చేపట్టిన క్యూరియాసిటీ రోవర్‌ కార్యక్రమంతోనూ సంబంధముంది. ఈమె సారథ్యంలో గురువారం వెళ్లిన వారిలో రిటైర్డ్‌ మెరైన్‌ ల్యూక్‌ డెలానీ, కెనడాకు చెందిన ఆర్మీ అధికారి జోషువా కుట్రిక్, రష్యా వాసి సెర్గీ టటెర్యాట్నికోవ్‌ ఉన్నారు. కాగా, నాసా కోసం స్పేస్‌ ఎక్స్‌ చేపట్టిన 13వ మిషన్‌ ఇది. వాట్కిన్, ఆమె బృందం లక్కీ 13 అనే నంబర్‌ ప్లేట్లు కలిగిన నల్ల టెస్లా కారులో లాంఛ్‌పాండ్‌ వద్దకు చేరుకున్నారు. వ్యోమగాముల్లో కెనడాకు చెందిన కుట్రిక్‌ భార్య హీథర్‌ నవంబర్‌లో మూడో బిడ్డకు జన్మనివ్వ నున్నారు. ఆ సమయానికి కుట్రిక్‌ తన కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. అందుకే, కుట్రిక్‌ ఐఎస్‌ఎస్‌ నుంచే భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇలా, అంతరిక్షంలో ఉండగానే తండ్రవుతున్న వ్యోమగాముల్లో కుట్రిక్‌ నాలుగో వ్యక్తిగా నిలుస్తారు.

Read More...

ఉద్యోగుల తొలగింపు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఏఐ వినియోగం పూర్తి నిషేధం : చట్టం చేసిన కాలిఫోర్నియా రాష్ట్రం

కృత్రిమ మేధ ఆధారంగా ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ కాలిఫోర్నియా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి అమెరికా రాష్ట్రంగా నిలిచింది. కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ 'నో రోబో బాసెస్ యాక్ట్' (SB 947) పై సంతకం చేసినట్టు సీఎన్‌బీసీ వార్తా ఛానల్ నివేదించింది. చట్టం అమల్లోకి రావడంతో ఇకపై ఉద్యోగుల తొలగింపు, క్రమశిక్షణా చర్యలకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి. ఈ చట్టం గురించి గవర్నర్ గెవిన్ న్యూసమ్ మాట్లాడుతూ ''ఏ ఉద్యోగి కూడా కేవలం ఆల్గారిథమ్స్ ఆధారంగా తమ కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలను ఎదుర్కోరాదు, యంత్రం లేదా ఏఐ నిర్ణయాల వల్ల ఏ ఒక్కరూ ఉద్యోగం కోల్పోకూడదు, చర్యలకు గురికాకూడదు. ఏఐ ఉత్పాదకతను పెంచగలదు. కానీ తప్పులు చేయడానికి, పక్షపాతం చూపించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి'' అని స్పష్టం చేశారు. కాలిఫోర్నియా వ్యాపార సంస్థలు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి లేదా తొలగించడానికి కేవలం 'ఆటోమేటెడ్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్స్' (ఏఐ) పై ఆధారపడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధిస్తుంది. ఒకవేళ ఏఐ సిస్టమ్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కంపెనీలు నిర్ణయం తీసుకోవాలనుకుంటే, ఆ విషయాన్ని మానవ పరిశీలన, ఇతర నివేదికల ద్వారా ధ్రువీకరించుకోవాలి. మేనేజర్ల అంచనాలు, సహోద్యోగుల సమీక్షలు, ఉద్యోగుల పర్సనల్ రికార్డులను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఒక ఉద్యోగిపై తీసుకునే నిర్ణయంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తే, ఆ విషయాన్ని సదరు ఉద్యోగికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఏ డేటా ఆధారంగా ఏఐ ఆ నిర్ణయం తీసుకుందో వివరించడంతో పాటు, సందేహాలను నివృత్తి చేయడానికి ఓ అధికారి సమాచారాన్ని అందించాలి. ఈ బిల్లును రూపొందించిన డెమొక్రాటిక్ స్టేట్ సెనేటర్ జెర్రీ మెక్‌నెర్నీ మాట్లాడుతూ ''ఏఐ అనేది మానవ నియంత్రణలో ఉండే ఒక సాధనంగా మాత్రమే ఉండాలి తప్ప, అదే మానవులను శాసించే నిర్ణేతగా మారకూడదు'' అని అన్నారు. ఉద్యోగులపై ఏఐ పరిమితులు విధించడాన్ని వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియాలోని కార్మిక సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కాలిఫోర్నియా ఫెడరేషన్ ఆఫ్ లేబర్ యూనియన్స్ ఛైర్మన్ లోరెనా గొంజాలెజ్ హర్షం వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో ఏఐ వాడకం నియంత్రించడంలో కాలిఫోర్నియా దేశానికి దిక్సూచీగా నిలిచిందని, అమెరికా వ్యాప్తంగా ఏఐ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు ఇది ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుందని ఆమె అన్నారు. కార్మికుల రక్షణకు ఫెడరల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని నేపథ్యంలో గవర్నర్ న్యూసమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఏఐ మోడల్స్ వల్ల కలిగే ప్రమాదాల నివారణకు కార్యనిర్వాహక ఉత్తర్వు, ఏఐ సిస్టమ్స్ స్వతంత్ర మూల్యాంకనం, ఆడిటింగ్ కోసం ఒక రాష్ట్ర స్థాయి ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. గతేడాది ఓఈసీడీ సర్వే ప్రకారం ఆటోమేటెడ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ వినియోగంలో అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దాదాపు 90 శాతం మంది అమెరికా మేనేజర్లు తమ సంస్థల్లోని ఉద్యోగుల పర్యవేక్షణ లేదా పనితీరు అంచనా వేయడానికి కనీసం ఒక ఏఐ టూల్‌నైనా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. అయితే దీనివల్ల వివాదాలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఈ ఏడాది జులైలో ఉద్యోగుల తొలగింపు విషయంలో 'మెటా' సంస్థపై ఒక కేసు నమోదైంది. లేఆఫ్స్ కోసం జాబితా తయారీకి ఏఐ ఉపయోగించారని, దీనివల్ల మెడికల్ లేదా ఫ్యామిలీ లీవ్ తీసుకున్న ఉద్యోగులు ఎక్కువగా నష్టపోయారని బాధితులు ఆరోపించారు అలాగే యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ సర్వేలోనూ వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంస్థల్లో హెచ్ఆర్ నిర్ణయాలు సరైన పర్యవేక్షణ లేకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమైంది.

Read More...