Ad Code

ఏసీ ఇండోర్‌ యూనిట్‌ పేలి మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం


ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఏసీ ఇండోర్‌ యూనిట్‌ పేలి మంటలు చెలరేగడంతో మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ మృతి చెందారు. పోలీసులకు సమాచారం ప్రకారం మే 27 బుధవారం రాత్రి 11:18 గంటల ప్రాంతంలో హౌజ్ ఖాస్‌లోని ఆర్‌-15 నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది, ఇంట్లోని ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్రంగా గాయపడిన ధనేంద్ర కుమార్‌కు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రమాద సమయంలో ధనేంద్రకుమార్‌, ఆయన కుమారుడితోపాటు మరో ముగ్గురు పనివారు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆలస్యమైంది. ఫైర్ సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంట్లో ఉన్న ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ధనేంద్ర కుమార్ పొగ కారణంగా ఊపిరి తీసుకోలేక మరణించగా, ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు ఈ ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని, విద్యుత్ లోపంపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu