నాలుగు రాష్ట్రాల్లోని 12 చోట్ల ఎన్‌ఐఏ మెరుపు దాడులు


దేశంలో భారీ పేలుళ్లకు, ప్రాణనష్టానికి ఓ ఉగ్రవాద ముఠా కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ కనిపెట్టింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆపరేటివ్ జస్వీర్ చౌదరి, అతని భారతీయ సహచరులకు లింక్ ఉన్న ఒక కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. జస్వీర్ చౌదరి తన నెట్‌వర్క్ సహాయంతో భారత్-పాక్ సరిహద్దుల గుండా డ్రోన్ల ద్వారా భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని, ఐఈడీలతో కూడిన కన్సైన్‌మెంట్‌ను అక్రమంగా దేశంలోకి రప్పించినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు భారతదేశంలోని పంజాబ్, ఢిల్లీతో పాటు దేశంలోని పలు ఇతర ప్రధాన నగరాలు, ప్రాంతాలలో వరుస పేలుళ్లకు పాల్పడి, భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించడమే ఈ ముఠా ముఖ్య ఉద్దేశమని అధికారులు వెల్లడించారు. ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు, నిందితులకు నిధులు, స్థానికంగా లభించిన సహాయక సహకారాల మూలాలను వెలికితీసేందుకు ఎన్‌ఐఏ ఈ విస్తృత తనిఖీలు చేపట్టింది.

No comments:

Post a Comment

3