రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో రూ.800 లంచం కేసు : 20 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు


నవీ ముంబయిలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో అరవింద్ మోతీరామ్ సావంత్ అనే వ్యక్తి క్లర్కుగా విధులు నిర్వహిస్తున్నాడు.ఒక అనుమతి లేని నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందించేందుకు, ఓ ప్రైవేటు కంపెనీ ప్రతినిధి నుంచి  రూ.800 లంచం డిమాండ్ చేశాడనేది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పక్కా స్కెచ్‌తో వల పన్నారు. అనుకున్నట్లే 2006 ఆగస్టు 22వ తేదీన సదరు ప్రైవేటు వ్యక్తి నుంచి రూ.800 నగదు తీసుకుంటుండగా సావంత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆ నోట్లను జప్తు చేసి, కేసు నమోదు చేయడంతో అరవింద్ మోతీరామ్ సావంత్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఈ చిన్న మొత్తం లంచం కేసు దాదాపు రెండు దశాబ్దాల పాటు కోర్టు గడపల చుట్టూ తిరిగింది. నిందితుడిపై మోపిన నేరాన్ని నిరూపించేందుకు సీబీఐ గట్టిగానే ప్రయత్నించింది. అయితే, సుదీర్ఘ విచారణలో భాగంగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. ఫిర్యాదుదారు కోరిన సర్టిఫైడ్ ప్రభుత్వ పత్రాలను జారీ చేసే అంతిమ అధికారం అసలు ఆ క్లర్కుకు లేదనే పచ్చి నిజం న్యాయస్థానం ముందుకొచ్చింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org