Ad Code

అమెజాన్ లో నథింగ్ ఫోన్ 3 పై భారీ డిస్కౌంట్ ఆఫర్ !


దేశీయ మార్కెట్లో గత సంవత్సరం జులైలో 'నథింగ్ ఫోన్ 3'ని విడుదలైంది. విడుదలైన ఏడాదిలోపే ఈ ఫోన్ ధర రూ. 37,000 వరకు తగ్గింది. ప్రారంభ ధర 12GB+256GB వేరియంట్ రూ. 79,999, అలాగే 16GB+512GB వేరియంట్ రూ. 89,999గా ఉండేవి. అమెజాన్ లో ప్రస్తుత తగ్గిన ధర (ప్రకారం 12GB+256GB: బ్లాక్ కలర్ రూ. 42,999, వైట్ కలర్ రూ. 44,999, 16GB+512GB: బ్లాక్ కలర్ రూ. 51,999, వైట్ కలర్ రూ. 54,999లకు లభిస్తున్నాయి. ఇది  6.67-అంగుళాల AMOLED ప్యానెల్, 1.5K రిజల్యూషన్, 4500 నిట్స్ (HDR) పీక్ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. పాత నథింగ్ ఫోన్ 2తో పోలిస్తే ఇందులో CPU శక్తి 36%, GPU పనితీరు 88% మరియు AI ప్రాసెసింగ్ 60% మెరుగుపడ్డాయి. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది (50MP మెయిన్ + 50MP పెరిస్కోప్ + 50MP అల్ట్రా-వైడ్). ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 'ట్రూ లెన్స్ ఇంజిన్ 4' వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 5500mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, అంటే 54 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu