ప్రాణం తీసిన సిగరెట్ వివాదం
ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో సిగరెట్ విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చివరకు 26 ఏళ్ల యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీర్‌పురి సి-బ్లాక్‌కు చెందిన అర్బాజ్ (26) స్థానిక జ్యువెలరీ షాప్‌లో పనిచేస్తూ తన కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా పండుగ సంబరాల్లో ఉండగా, ఇంటి సమీపంలో అర్బాజ్, కొందరు స్థానిక యువకుల మధ్య సిగరెట్ విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో, నిందితులు అర్బాజ్‌పై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అతడిని వెంటనే బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అర్బాజ్ మృతి చెందాడు.