దేశీయ మార్కెట్లో అక్టోబర్ 15 రియల్ మీ పి 1 స్పీడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ను సేల్ పార్ట్ నర్ గా ఎంచుకుంది. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Energy చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 26GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది. గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ సమయంలో ఈ ఫోన్ ను వేడెక్కకుండా త్వరగా చల్లబరచడానికి వీలుగా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కూడా అందించింది. పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ లో GT Mode సపోర్ట్ ను కూడా రియల్ మీ జత చేసింది.
3
Beranda › Posts filed under 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్
Showing posts with label 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్. Show all posts
Showing posts with label 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 90fps ఫాస్ట్ గేమింగ్ సపోర్ట్ కలిగిన OLED స్క్రీన్. Show all posts
Subscribe to:
Posts (Atom)