ప్రియురాలితో కలిసి జాలీ ట్రిప్‌నకు వెళ్తున్న భర్తను జాతీయ రహదారిపై వారిని ఆపి రెడ్ హ్యాండెడ్‌గా భార్య పట్టుకుంది. ఇద్దరినీ స్కూటీ మీద నుంచి కిందకు తోసేసి తన ప్రతాపం చూపించింది. కారులో కూర్చున్న వారి కొడుకు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది. వీడియో ప్రకారం ఓ కారు జాతీయ రహదారిపై ఆగి ఉంది. ఆ కారులో నుంచి దిగిన మహిళ అటు వైపు స్కూటీ మీద వస్తున్న ఓ జంటను ఆపింది. రోడ్డు మీద కనిపించిన భార్యను చూసి భర్త ఆశ్చర్యపోయాడు. వారి మధ్య తోపులాట జరగడంతో స్కూటీ మీద నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. భర్తతో గొడవకు దిగిన భార్య.. అతడి ప్రియురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె మొహానికి కట్టుకున్న స్కార్ఫ్‌ను తొలగించేందుకు ప్రయత్నించింది. కారులో కూర్చున్న కొడుకును బయటకు పిలిచి ``చూడు మీ నాన్న ఎలాంటి పనులు చేస్తున్నాడో`` అంటూ కేకలు వేసింది. ఆ కుర్రాడు కారులో కూర్చుని ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.5 లక్షల మందికి పైగా వీక్షించారు. 3.5 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అంత జరుగుతున్నా ఆ వ్యక్తి తన కళ్లజోడు సరి చేసుకుంటున్నాడు``, ``భార్యకు దొరికిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి సిగ్గుపడడం లేదు``, ``ఆమె పరిస్థితి ఏంటి``, ``ఇది రీల్ కోసం చేసిన వీడియో కాదు కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
3
Beranda › Posts filed under @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్లో వీడియో షేర్
Showing posts with label @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్లో వీడియో షేర్. Show all posts
Showing posts with label @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్లో వీడియో షేర్. Show all posts
Subscribe to:
Posts (Atom)