జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన విచారణ ఖైదీ : తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ సస్పెండ్
మ ధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా జైలులో ఓ విచారణ ఖైదీ నీలేశ్ ఠాకూర్ జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఈ దృశ్యాలు బయటకు రావడం గమనార్హం. పండ్ల బుట్టలో దాచిన తుపాకీతో ఖైదీ జైలు గార్డుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలిక జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా జైలులో నిర్వహించిన వేడుకల సమయంలో అతడు జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులో ఠాకూర్ జైలులో ఉన్నట్లు ఉపవిభాగ పోలీసు అధికారి ప్రతిభా శర్మ తెలిపారు. గార్డును ఠాకూర్ ఒక్కసారిగా పట్టుకుని కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. గార్డు తిరిగి ఎదురుదాడికి ప్రయత్నించగా ఖైదీ అతడిని పక్కకు నెట్టేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో ఉంది. ఠాకూర్ పండ్ల బుట్టతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి దాన్ని తెరవాలని తోమర్‌ను ఒత్తిడి చేశాడు. గార్డు నిరాకరించడంతో.. బుట్టలో దాచిన దేశీయంగా తయారు చేసిన తుపాకీని బయటకు తీసి అతడి...