Posts

Showing posts with the label CM Suvendu Adhikari Issues Orders

అక్రమ బంగ్లాదేశీ వలసదారులను సరిహద్దు భద్రతా దళానికి అప్పగింత !

Image
ప శ్చిమ బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్న అక్రమ బంగ్లాదేశీ వలసదారులను ఇకపై కోర్టుల ముందు హాజరుపరచకుండా, దేశ బహిష్కరణ కోసం నేరుగా సరిహద్దు భద్రతా దళానికి అప్పగించాలని సీఎం సువేందు అధికారి ఆదేశాలు ఇచ్చారు. తక్షణం అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాన్ని రాష్ట్ర పోలీసులకు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. బెంగాల్ కొత్త బీజేపీ ప్రభుత్వ విధానం ప్రకారం.. అక్రమ వలసదారులుగా తేలి, పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోరేందుకు అర్హత లేని వారిని కోర్టు ముందు హాజరుపరచకుండా, నేరుగా బీఎస్ఎఫ్ సరిహద్దు అవుట్‌పోస్టులకు తీసుకువెళతారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన విస్తృతమైన 'గుర్తించడం, తొలగించడం, దేశ బహిష్కరణ' చట్రంలో భాగంగానే ఈ చర్య ఉందని సువేందు అధికారి అభివర్ణించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయుల కేసులలో సాధారణంగా అనుసరించే విధానానికి ఇది ఒక విధంగా భిన్నమైనది. 2016లో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, భారతదేశంలో బంగ్లాదేశ్...