Posts

Showing posts with the label Argentina's Resounding Victory Over Iceland

ఐస్‍లాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం : మెరుగైన ప్రదర్శన చేసిన మెస్సి

Image
ఫిఫా ప్రపంచ కప్‌ 2026కు ముందు జరిగిన తమ చివరి వార్మప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా అదరగొట్టింది. అలబామా వేదికగా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. అలానే తన చివరి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న మెస్సి ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆట ప్రారంభంలో ఐస్‌లాండ్ గోల్ చేసే ఒక సులభమైన అవకాశాన్ని వృథా చేసుకుంది. అర్జెంటీనా ప్లేయర్లు ఐస్ లాండ్ కు గోల్ చేసే చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వకుండా తీవ్రంగా కట్టడి చేశారు. మరోవైపు తొలి హాఫ్ ముగుస్తుందనగా మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ అందించిన కీలక పాస్‌తో లౌటారో మార్టినేజ్ గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపాడు. దీంతో తొలి హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరో 10 నిమిషాల్లో రెండో హాఫ్ ముగుస్తుందనగా మళ్లీ మైదానంలోకి వచ్చిన మెస్సీ ఈసారి తానే స్వయంగా గోల్ కొట్టాడు. మార్టినేజ్ అందించిన పాస్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించి మెస్సి తన కెరీర్‌లో 117వ గోల్ సాధించాడు.