Posts

Showing posts with the label CM Revanth Reddy calls upon MPs from all parties

రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలి !

Image
తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీల ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లురవి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్యాదవ్, రామసహాయం రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య తదితరులతో నిర్వహించిన సమావేశంలో కీలకవ్యాఖ్యలు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు నిధులు సాధించడం పైన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలవాల,ని మూసీ నదిపునరుజ్జీవనం ఫేస్ వన్ పనులకు అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద అనుమతులు పొందాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో ఫేజ్ 2 విస్తరణపైన, ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల పైన అందరూ వేగంగా పని చేయాలన్నారు. వరంగల్ ఆదిలాబాద...