November 2024

దక్షిణాఫ్రికా లోని డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 516 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 103/5తో నాలుగో రోజు ఆట ఆరంభించిన శ్రీలంక 282 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (83; 174 బంతుల్లో, 12 ఫోర్లు), దనంజయ డిసిల్వా (59; 81 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (48; 77 బంతుల్లో, 9 ఫోర్లు) పోరాడారు. మార్కో జేన్సన్ నాలుగు వికెట్లు, రబాడ, కొయెట్జీ, మహరాజ్ తలో రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా (70; 117 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌటైంది. గత 100 ఏళ్లలో ఒక జట్టు ఇంత తక్కువ బంతుల్లో ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. అలాగే టెస్టుల్లో శ్రీలంక ఇదే అత్యల్ప స్కోరు. కామిందు మెండిస్ (13), లాహిరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మార్కో జేన్సన్ ఏడు వికెట్లతో విజృంభించాడు. కొయెట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ తీశారు. 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 366/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (122; 221 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బవుమా (113; 228 బంతుల్లో, 9 ఫోర్లు) సెంచరీలు సాధించారు. విశ్వా ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో ఆస్ట్రేలియా (57.69 %)ను వెనక్కినెట్టి దక్షిణాఫ్రికా (59.26 %) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ (61.11 %) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్ (54.55 %) నాలుగో స్థానంలో ఉంది.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇస్కాన్‌కు చెందిన మరో సభ్యుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్‌ దాస్‌ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో వెల్లడించారు. ''ఇస్కాన్‌ సభ్యుడు శ్యామ్‌దాస్‌ ప్రభును ఎలాంటి వారెంట్‌ లేకుండా చటోగ్రామ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా..?ఎలాంటి నేరం చేయకుండానే అరెస్టు చేయడం దిగ్ర్భాంతిని కలిగించింది'' అని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగ్లాలోని ఇస్కాన్‌ సెంటర్‌ను కొందరు ధ్వంసం చేసినట్లు తెలిపారు. అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్‌.. ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. ఈ వ్యవహారంలో భాగంగా ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. దేశంలో హిందువుల భద్రత కోసం డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరో సభ్యుడు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.

జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

చెన్నైలో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లి విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహం ఏటీఎం బయటకు కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు రద్దయ్యాయి. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దు కాగా.. ముంబాయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై నుంచి విశాఖ, విశాఖ నుంచి చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.

పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. సిలిగురి నుంచి గ్యాంగ్ టక్ వెళ్తుండగా అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు లోయలో పడి ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

తిరుమలలో డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 5 గంటలకు దర్శన టోకెన్లు జారీ కానున్నాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి టిటిడి పాలక మండలి స్థానిక దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలం, తిరుమల వాసులకు టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి. రేపు తిరుపతి మహతి వద్ద, తిరుమల కమ్యూనిటీ హాల్ వద్ద ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్లు జారీ చేయనున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని బరేలీలోని మీర్‌గంజ్ ప్రాంతంలో గీజర్ పేలి నవ వధువు మరణించింది. బులంద్ షహర్‌లోని కాలే కా నాగ్లా గ్రామానికి చెందిన యువతి పిపల్సనా చౌదరి గ్రామానికి చెందిన దీపక్ యాదవ్‌తో బాధిత యువతికి ఐదు రోజుల క్రితమే వివాహం జరిగింది. బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. నవంబర్ 22న ఆమె వివాహం తర్వాత అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. యువతి స్నానం చేయడానికి వెళ్లిన చాలా సేపటి కూడా బయటకు రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త, ఆమె బంధువులు పదేపదే పిలిచినా స్పందం రాకపోవడంతో, బాత్ రూమ్ తలుపు పగలగొట్టి చూశారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉంది. గీజర్ పేలిపోయి కనిపించింది. ఆమెని ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నందున, పేలుడుకు గల కారణాలను గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌ లోని ఈజ్గాంలో పులి దాడి ఘటనలో మరణించిన గన్నారం మండల వాసి కళ్యాణి కుటుంబానికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. పత్తి సేకరణకు వెళ్లిన కళ్యాణి పులి దాడిలో మరణించడం తనను ఎంతో వేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. శాఖాపరంగా అటవీ శాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఈ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ అవసరాల మేరకు తగిన విధంగా సహాయ, సహకారాలను అందిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఇవాళ సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడెంలో సురేష్ అనే రైతుపై మరో దాడి ఘటన జరగడంతో మంత్రి సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ నీరజ్‌ రైతు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాథమిక చికిత్స అనంతరం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల జిల్లా హాస్పిటల్‌కు సురేష్‌ను తరలిస్తున్నట్టు డీఎఫ్ఓ మంత్రికి వివరించారు. ప్రస్తుతం పులి కదలికలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర వైపు పులి కదలికలను గుర్తించినట్టుగా డీఎఫ్ఓ మంత్రికి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల పశువులపై కూడా పులి దాడి ఘటనలు నమోదైన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పీసీసీఎఫ్‌ను ఆదేశించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువులను మేతకు తీసుకొని పోయేవారు జాగ్రత్తగా ఉండాలనీ, అటవీ శాఖ సూచనలను పాటించాలని మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద, షార్ట్ సర్క్యూట్ తో ఓ కాలేజీ బస్సు దగ్ధం అయింది. రేపల్లె ఐ ఆర్ ఇ ఎఫ్ నర్సింగ్ కాలేజీకి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. రేపల్లె నుంచి గుంటూరుకు విద్యార్థులు పరీక్షల నిమిత్తం వస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయం లో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే విద్యార్థులు ఒకసారిగా కిందకి దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుసి దర్యాప్తు చేస్తున్నారు .

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది. భద్రతా సిబ్బంది ఆయనను రక్షించారు. అయితే చాలా మంది మద్దతుదారులు, పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి సింధియా శనివారం శివపురి పర్యటనలో ఉన్నారు. ఇక్కడ డ్రెడ్జింగ్ మిషన్‌ను ప్రారంభించేందుకు ఆయన మధ్యాహ్నం శివపురి సెయిలింగ్‌కు చేరుకున్నారు. సింధియా సరస్సు వద్దకు చేరుకోగానే తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేశాడు. సింధియాను ఆయన భద్రతా సిబ్బంది ఏదోవిధంగా రక్షించినప్పటికీ కొంతమంది మద్దతుదారులు, పోలీసులు తేనెటీగల బాధితులయ్యారు. యంత్రాన్ని ప్రారంభించేందుకు సింధియా క్లబ్ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ ఉన్న పండిట్ అగరబత్తిని వెలిగించారు. పొగలు రావడంతో సెయిలింగ్ క్లబ్‌లోని తేనెటీగలు ఒక్కసారిగా లేచి దాడి చేయడం ప్రారంభించాయి. జ్యోతిరాదిత్య సింధియా తలపైకి తేనెటీగలు రావడంతో ఎలాగోలా రక్షించి కారు వద్దకు తీసుకొచ్చారు. అయితే చాలా మంది నేతలు, మద్దతుదారులు, పోలీసులను తేనేటీగలు టార్గెట్ చేశాయి. కొంతమందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్‌ అసంపూర్తిగానే ముగిసింది. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో, బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ మీటింగ్‌ అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయరని కార్పొరేటర్ల విమర్శలు చేశారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవని స్టాండింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. దీంతో, చేసేదేమీ లేక.. బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభంలోనే బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై కాషాయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ డివిజన్‌లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్ గద్వాల విజయలక్ష్మి హామీ ఇవ్వడంతో బీజేనీ కార్పొరేటర్లు నిరసన విరమించుకున్నారు. అంతకుముందు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు మహబూబ్‌నగర్‌లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తూ రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని అన్నారు. రుణమాఫీపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిద్ధమా అని సవాల్ విసిరారు. రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. రైతుల కోసం ఇంకా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతేడాది నవంబర్‌ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని తెలిపారు. దొరల గడీలను కూల్చేందుకు ఓటర్లు తరలివచ్చిన రోజు అని చెప్పారు. రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసునన్నారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదన్నారు. ఉపాధి కోసం ముంబై, హైదరాబాద్‌కు వలసలు పోయే పరిస్థితి ఉందన్నారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారని గుర్తుచేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని ఉద్ఘాటించారు. సీనియర్లందరూ జూనియర్‌ అయినా నాకు సహకరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని పూర్తి చేసిందా అని ప్రశ్నించారు.వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్‌ అనలేదా అని నిలదీవారు. ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే రూ.500 బోనస్‌ ఇచ్చి వరి రైతుకు పండుగ తెచ్చిందని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మూడేళ్లు నిండకుండానే కాళేశ్వరం కూలిందని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది తెలంగాణలో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి పండిందని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్ మీద దాడికి యత్నించాడు. వెంటనే ఆప్ నాయకులు, కార్యకర్తలు ప్రతిస్పందించి ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

చపాతీ లేదా రొట్టెలు చాలా మంది ఆహారపట్టికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు, అయితే రోజూ అవి అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమతుల్య ఆహారం తీసుకోవడం , అన్ని రకాల ఆహారాలను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. చపాతీల్లో అధికంగా ఉండే గ్లూటెన్ కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి గ్యాస్, పొట్ట నొప్పి, నానిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువగా గోధుమ పిండితో తయారుచేసిన రొట్టెలు తింటే ఫైబర్ పరిమిత మోతాదును మించి అందుకోవడం వల్ల కొన్నిసార్లు మలబద్ధకం లేదా విరేచనాల సమస్యల్ని తెచ్చిపెట్టవచ్చు. గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రోజూ ఎక్కువ చపాతీలు తీసుకోవడం శరీరంలో అదనపు క్యాలరీలు చేరడానికి దారితీస్తుంది. రాత్రి సమయంలో చపాతీలను అధికంగా తింటే శరీరంలో ఎనర్జీ ఖర్చు కాకుండా కొవ్వుగా నిల్వ ఉంటుందనే ఆందోళన ఉంటుంది. చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శాతం నెమ్మదిగా పెంచుతుందని భావించినా, అధికంగా తీసుకుంటే షుగర్ స్థాయిలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజూ చపాతీలను మాత్రమే తీసుకుంటే, ప్రోటీన్, విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు తగిన మోతాదులో లభించవు. ఇది ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. సగటు ఆహారంలో ప్రోటీన్, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ సమపాళ్లలో ఉండాలి. కొంతమందికి గోధుమ పిండిలో ఉండే పదార్థాలు ఆమ్లపిత్తం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణమవుతుంది. దీనికి తోడు పచ్చడి లేదా కూరలో అధిక మసాలాలు ఉంటే సమస్య మరింత పెరుగుతుంది. అధికంగా గ్లూటెన్ లేదా శుద్ధి చేయని గోధుమ పిండిని తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది చర్మం మీద దద్దుర్లు లేదా చర్మంపై ముడతలు వచ్చే ప్రమాదం కలిగిస్తుంది. చపాతీలతో పాటు ఇతర కూరగాయలు, ప్రోటీన్, మంచి కొవ్వులను కలిపిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఎంత మోతాదులో తింటున్నారో నియంత్రించాలి. చపాతీ పిండిలో ఓట్స్ లేదా జొన్న పిండి కలపడం ఉత్తమం.

మహారాష్ట్ర లో డిసెంబర్ 5న ప్రభుత్వం కొలువుదీరే అవకాశముందని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నట్లు అతను చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. కొన్ని రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మహాయుతి నేతలు భేటీ అయ్యారు. మరుసటి రోజు సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవడానికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశం కావాల్సి ఉండగా, షిండే హఠాత్తుగా తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో సమావేశం రద్దైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు రోజులు కావొస్తున్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించి పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేదు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 5న ఆజాద్ మైదాన్ లో నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ, శివసేనకు చెందిన నేతలు చెప్పినట్లు 'ది హిందూ' పత్రిక వెల్లడించింది. 'బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ శాసనసభాపక్ష నేత, సీఎం అంశానికి సంబంధించి ఇద్దరు కేంద్ర పరిశీలకులను నియమిస్తుంది. ఈ పరిశీలకులు ముంబైకి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత మేం గవర్నర్ను కలుస్తాం' అని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్ల జారీ అంశంలో ప్రతిష్టాత్మక “స్కోచ్” అవార్డు దక్కించుకుంది. బస్సులలో డిజిటల్ పద్ధతిలో టికెట్ల జారీ అంశంలో స్కోచ్ అవార్డు వచ్చినట్టు ఏపీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అవార్డును ఏపీఎస్‌ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు అందుకున్నారు. యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టుట, ఇన్ బస్సులో డిజిటల్‌ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకుందన్నామని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ రోజు, ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ ఐటీ వై శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని ఏపీఎస్‌ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ లోని కుటుంబాలకు ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డులు (ఎఫ్‌బీసీ) అందనున్నాయి. వీటిలో రేషన్‌ కార్డులు, పింఛన్లు, పొదుపు సంఘాలు, కుటుంబ సమాచారం, గృహనిర్మాణ విభాగం అందించిన సమాచారం, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ ఒకేచోట ఉంటాయి. ఆయా కుటుంబాల విద్యుత్తు మీటర్లు, నెలవారీ బిల్లులు, పొలాల వివరాలు, ఈ-క్రాప్ పెట్టుబడి సాయం, ఇంటి చిరునామా వివరాలు సైతం ఇందులో కనిపిస్తాయి. ఎఫ్‌బీసీ కార్డులో ప్రతి కుటుంబానికి ఒక యూనిక్‌ ఐడీని కేటాయిస్తారు. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దు అనుకుంటే ఈ యాప్‌ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డుల వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఆ యాప్‌లోకి వెళ్లి అన్ని కుటుంబాల లబ్ధిదారులు వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఎఫ్‌బీసీ కార్డులలోని సమాచారాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులలోని సమాచారం ఆధారంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఏఐ అంచనా వేస్తుంది. దాని ఆధారంగా ఆయా కుటుంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాల వివరాలను విశ్లేషిస్తుంది. ఆయా ఫ్యామిలీల ఆర్థిక వికాసానికి ఇంకా ఎటువంటి స్కీమ్స్ అమలు చేయాలి అనేది ఈ ఏఐ టెక్నాలజీ సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసులను ప్రభుత్వ అధికార వర్గాలు సమీక్షించి, క్షేత్ర స్థాయిలో ఆయా కుటుంబాల వాస్తవిక స్థితిగతుల గురించి తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటాయి. వారికి ఇంకా ఏయే సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చాలి అనేది నిర్ణయిస్తాయి. వాస్తవానికి ఫ్యామిలీ బెనిఫిట్‌ కార్డులను జారీ చేయాలని మంత్రి నారా లోకేశ్‌ 2019లోనే భావించారు. ప్రపంచబ్యాంకుకు దీనిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. అప్పట్లోనే ఏపీ డేటా సెంటర్‌లో అన్ని వివరాలనూ అనుసంధానించే ప్రక్రియను చేపట్టారు. అయితే తదుపరిగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ దీని అమలును మరిచింది.

డిసెంబర్ 05న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేటర్‌లలో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 05 నుంచి 08 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. 

ఎయిర్‌టెల్ బెస్ట్ ఫ్యామిలీ మొబైల్ ప్లాన్‌ను నెలకు రూ. 1749లకు అందిస్తోంది.ఈ ప్లాన్ లో 5 సిమ్ కార్డ్‌లు, 200GB డేటా, రోజువారీ ఎస్ఎంఎస్ లు , అపరిమిత వాయిస్ కాల్‌లు, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ సైట్‌లు ఎలాంటి ప్రయోజనాలను వదలకుండా ఒకే రీఛార్జ్ కింద కస్టమర్‌కు ఏది అవసరమో అది అందిస్తుంది. మొత్తం కుటుంబానికి అయ్యే ఖర్చుగా చూస్తే, ప్రతి వ్యక్తికి వ్యక్తిగత రీఛార్జ్‌ల మొత్తం ఖర్చుతో పోలిస్తే ఇది చౌకగా అనిపించవచ్చు. దీనిలో ఒక ప్రైమరీ సిమ్ మరియు నాలుగు సెకండరీ సిమ్‌ల కనెక్షన్‌లుపొందుతారు. అన్ని SIM కార్డ్‌లకు అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజువారీ 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. డేటా ప్రయోజనాల పరంగా, ప్రాథమిక SIMకి 200GB డేటా (బిల్లింగ్ సైకిల్‌కు) మరియు సెకండరీ కనెక్షన్‌ల కోసం 30GB డేటా అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్ కింద 200GB వరకు డేటా రోల్‌ఓవర్ మద్దతు అందుబాటులో ఉంది. ప్రారంభించని వారి కోసం, డేటా రోల్‌ఓవర్ ఈ నెలలో ఉపయోగించని డేటాను తదుపరి బిల్లింగ్ సైకిల్‌కు రోల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. OTT ప్రయోజనాలు భారతీ ఎయిర్‌టెల్ రూ.1749 మొబైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ క్రింద కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం, నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్, అమెజాన్ ప్రైమ్ వీడియో 6 నెలల పాటు ఉచిత యాక్సెస్‌లు అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ.150 అదనంగా చెల్లించడం ద్వారా మీరు మీ నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది కాకుండా, VIP సర్వీస్, అపోలో 24/7 సర్కిల్, బ్లూ రిబ్బన్ బ్యాగ్, Wynk ద్వారా ఉచిత హలో ట్యూన్స్ కూడా రూ.1749 లోపు అందుబాటులో ఉన్నాయి. అలాగే 10 మరియు 30 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఏదైనా అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లపై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. 

'నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా, అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను.' అని కేటీఆర్‌ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిన్న తెలంగాణ భవన్‌ లో కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడని ఆగ్రహించారు.

తెలంగాణలోని ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ ఎంఎస్‌ చదవడానికి నాలుగు నెలల కిందటే అమెరికాకు వెళ్లాడు. అక్కడ చదువుతూ ఓ స్టోర్ లో  పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోచికాగోలో దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త తెలిసిన తర్వాత సాయితేజ కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కొడుకుకు మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్న ఈ సమయంలో ఈ విషాద వార్త వినాల్సి రావడంపై వాళ్లు వాపోతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేలా చూడాలని అక్కడి తెలుగు సంఘాలను కోరుతున్నారు. 

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై టీటీడీ నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని రాజకీయ నేతలు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

తెలంగాణ మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గంట చక్రపాణి నియమితులవగా, ఆ తర్వాత జనార్దన్ రెడ్డి నియామకం జరిగింది. అయితే వివిధ ఆరోపణల నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి స్థానంలో మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్ర వెంకటేశం ముఖ్యమంత్రి నియమించారు. నాలుగు సంవత్సరాల పాటు బుర్ర వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ పదవీలో ఉండనున్నారు. డిసెంబర్ 3తో మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆ స్థానంలో బుర్ర వెంకటేశంను నియామిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈనెల 20న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అదే సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో టీజీపీఎస్సీ చైర్మన్ పదవి కోసం దాదాపు 45 అప్లికేషన్లు వచ్చాయి. అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరకు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న బుర్ర వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. అనంతరం చైర్మన్ నియామకానికి సంబంధించిన ఫైలును గర్నవర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. ఈ క్రమంలో నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం పేరును కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం నియమితులైన నేపథ్యంలో ఇంతకుముందున్న పదవులకు ఆయన రాజీనామా చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వీఆర్‌ఎస్‌కు వెంకటేశం దరఖాస్తు చేసుకోగా అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిసెంబర్ 3న ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశంను సర్కార్ నియమించింది. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈపీఎఫ్ఓ ​​సభ్యులు ఏటీఎం ద్వారా వారి పీఎఫ్ ఖాతా నుండి నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక కార్డును జారీ చేసే పనిలో ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం ఈ సదుపాయం మే-జూన్ 2025 నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది ఈపీఎఫ్ఓ ​​వినియోగదారులకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే, పీఎఫ్ సహకారంలో 50 శాతం కంటే తక్కువ మాత్రమే ATM ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. నవంబర్ ప్రారంభంలో, ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం కింద జీతం పరిమితిని 21,000 రూపాయలకు పెంచుతుందని వార్తలు వచ్చాయి. అంతకుముందు పదేళ్ల క్రితం 2014లో ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం కింద జీత పరిమితిని రూ.6500 నుంచి రూ.15,000కు పెంచింది.

తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి చేసింది.  ఓ యువతిపై దాడి చేసి 24 గంటలు గడిచిందో లేదో సిర్పూర్ (టి)మండలంలోని దుబ్బగూడ గ్రామానికి చెందిన మరో రైతుపై పులిదాడి చేసి గాయపరిచింది. పొలంలో సురేష్ అనే రైతు పని చేస్తుండగా పెద్దపులి దాడి చేసింది. పక్కనే ఉన్న వారంతా గట్టిగా కేకలు వేసి అరవడంతో పులి భయపడి పారిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి పంజా విసురుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరిపై దాడి చేసింది. ఇందులో ఒకరు చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగజ్ నగర్ మండలంలో నజ్రుల్ నగర్ విలేజ్ పరిదిలో శుక్రవారం పులి పంజా దెబ్బకు గన్నారం గ్రామానికి చెంది 21 ఏళ్ల మోర్లె లక్ష్మి మృత్యువాత పడ్డారు. పొలంలో పత్తి ఏరుతుండగా పులి వచ్చి దాడి చేసింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో పులి దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు నాలుగేళ్లుగా నలుగురిని బలి తీసుకున్నాయి. ఇలా పులి దాడిలో చనిపోయిన వారంతా కూలీలు, చిన్న రైతులే. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థకు అతి పెద్ద పండుగగా డిసెంబర్ 7న తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఈ మెగా సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరుకావాలని కోరారు. ఆయన వ్రాసిన లేఖలో 'అందరికీ నమస్కారం. పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది. ఎడ్యుకేట్, ఎంగేజ్, ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇందులో వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా మీ, మీ పరిధి పాఠశాలలు, మీ సమీప స్కూళ్లలో జరిగే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అన్నారు. 'ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. పిల్లల సమస్యలు, అభ్యసనా సామర్థ్యాలు, క్రీడలు, కళలు పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చు. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం.. విద్య నేర్చుకునే పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వం లక్ష్యం. పేరెంట్-టీచర్ మీటింగ్‌కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. మీ పార్టీ జెండాలు. కండువాలు, రంగులు వేసుకుని రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వవిద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ 7న జరగబోయే మెగా పేరెంట్- టీచర్ మీటింగ్‌లో భాగం కావాలని మనస్పూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం' అంటూ లేఖలో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. డిసెంబర్ 7న జరిగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. బాపట్లలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. గతంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావించారు. కానీ వాయిదా పడింది. చివరికి డిసెంబర్ 7న ముహూర్తం ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఈ మేరకు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని ఆహ్వానిస్తూ లేఖ రాశారు.

చైనా మార్కెట్ లో ఒప్పో పాడ్‌ 3 లాంచ్‌ అయింది. తక్కువ ఫీచర్లతో కూడిన ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒప్పో ప్యాడ్‌ 3లో 11.61 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 2800x2000 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పాటు 700 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీనిలో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ట్యాబ్‌లో 9510 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ పాడ్‌ 3లో 8 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 67 వాట్స్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 9510 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు. ఇందులో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. 

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో యాపిల్ ఐఫోన్ 17 ప్రో సిరీస్ ను లాంచ్ చేయనుంది. గతంలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలో టైటానియం ఫ్రేమ్ వాడినట్లుగానే ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం ఫ్రేమ్ ని వాడారు.దీనిలో కెమెరా బంప్ పెద్దదిగా ఉంటుంది. దీన్ని అల్యూమినియంతో తయారు చేయనున్నారు. ఇది మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా కనిపిస్తుంది. యాపిల్ కు సంబంధించిన కొత్త ఏ19 ప్రో చిప్ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది టీఎస్ఎమ్సీ 3ఎన్ఎం టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్, కెపాసిటీని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు యాపిల్ రూపొందించిన వైఫై 7 చిప్ ను వాడారు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ల్లో 12 జీబీ ర్యామ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఐఫోన్ 16 ప్రోలో అందించిన 8 జీబీ ర్యామ్ కంటే ఎక్కువ. మల్టీ టాస్కింగ్, యాపిల్ ఏఐ ఆధారిత ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి ఈ అప్ గ్రేడ్ చేశారు. ఐఫోన్ 17 సిరీస్ లో ప్రధాన కెమెరా అప్ గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ముందు కెమెరాను 12 మెగాపిక్సెల్ నుంచి 24 మెగాపిక్సెల్ కి, ప్రో మోడల్స్ లోని టెలిఫోటో కెమెరాను 48 మెగాపిక్సెల్ కి అప్ గ్రేడ్ చేయవచ్చు. ఇది ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ప్రో మాక్స్ మోడల్ లో ఒక చిన్న డైనమిక్ ఐలాండ్ అందిస్తారని సమాచారం. ఇది స్క్రీన్ టు బాడీ రేషియోను మెరుగుపరుస్తుంది. ఫేస్ ఐడీ సిస్టమ్ మెటా లెన్స్ ని ఉపయోగించడం ద్వారా ఈ మార్పు సాధ్యమవుతుంది.

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వధువు ప్రవర్తనపై కామెంట్లు కురిపిస్తున్నారు. @ArpitKushwah అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ వివాహ వేడుక జరుగుతోంది. వివాహ వేదికపై వరుడు ఉన్నాడు. వధువు అప్పుడే మెట్లు ఎక్కి పైకి వస్తోంది. ఆ సమయంలో వరుడు ఆమె దగ్గరకు వెళ్లి చెయ్యి అందించాడు. ఆ వధువు వరుడి చేయి అందుకుని గట్టిగా కిందకు లాగేసింది. దీంతో ఆ వరుడు స్టేజ్ పై నుంచి కిందకు పడిపోయాడు. వధువు స్టేజ్ పైకి వెళ్లి వరుడి వైపు చూసి నవ్వుకుంది. ఆ దృశ్యాన్ని చుట్టు పక్కల వాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. వీటిలో మ్యాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ కంపెనీలు చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో అమల్లోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి మాత్రం తగ్గించిన ధరలతో అమ్మబోతున్నారు. త్వరలో మరో రెండు కంపెనీలు ధరలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. మ్యాన్షన్ హౌస్ 2019లో టీడీపీ ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ రూ.110 ఉండగా వైసీపీ హయంలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్‌ బాటిల్‌ ధర రూ.440 నుంచి రూ.380కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది. అలాగే రాయల్‌ చాలెంజ్‌ సెలెక్ట్‌ గోల్డ్‌ విస్కీ క్వార్టర్‌ ధర రూ.230 నుంచి రూ.210కి, ఫుల్‌ బాటిల్‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.1600 నుంచి రూ.1400కు తగ్గింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలపై విమర్శలు రావడంతో వీటి సవరణకు ఓ కమిటీని నియమించింది. త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది. అందుకు అనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. కమిటీ నిర్ణయించక ముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి. బాటిల్‌ తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను కమిటీ పరిశీలించనుంది.

లంచం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఇతరులకు అమెరికా ప్రాసిక్యూటర్లు సమన్లు జారీ చేశారంటూ వస్తున్న వార్తలను విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి ఎలాంటి సమన్లు కానీ, అరెస్టు కోరుతూ ఎలాంటి లాంఛనప్రాయమైన అభ్యర్థులు రాలేదని స్పష్టం చేసింది. ఇది ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు, యూఎస్ న్యాయశాఖకు సంబంధించిన లీగల్ అంశమని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అలాంటి కేసుల్లో నిర్దిష్ట విధానాలు, చట్టపరమైన మార్గాలు ఉంటాయని తెలిపారు. ''ఈ అంశంపై భారత ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. ఈ అంశం అమెరికా ప్రభుత్వంతో చర్చకు కూడా రాలేదు. సమన్లు, అరెస్టు వారెంట్లు అనేవి పరసర్ప న్యాయ సహాయంలో భాగంగా ఉంటాయి. అలాంటి విజ్ఞప్తులకు మెరిట్ ప్రాతిపదికగా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి యూఎస్ వైపు నుంచి ఎలాంటి అభ్యర్థన మాకు రాలేదు'' అని జైశ్వాల్ తెలిపారు. అదానీ, దాని అనుబంధ సంస్థలు సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఆఫర్ చేశారనే ఆరోపణలో అమెరికాలో కేసు నమోదైందన్న వార్తలు ఇటీవల సంచలనం సృష్టించారు. అయితే ఈ వార్తలు అవాస్తమని అదానీ గ్రూప్‌నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ తోసిపుచ్చింది. ఎఫ్‌సీపీఏ కింద గౌతమ్ అదానీ, ఆయన బంధువురు సాగర్, కంపెనీ సీనియర్ డైరెక్టర్ వినీజ్ జైన్‌పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్టు వచ్చిన కథనాలను తాము తిరస్కరిస్తున్నామనీ, వీరంతా సెక్యూరిటీస్ సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారే కానీ వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదని వివరణ ఇచ్చిందని, ఎఫ్‌సీపీఏ నిబంధనలు ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు పేర్లు ప్రస్తావనకు రాలేదని అదానీ గ్రీన్ పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అభివర్ణించారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు. ఖజికిస్తాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పుతిన్ ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలన్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని పుతిన్ ఆరోపించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారన్నారు. జూలైలో పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకెళ్లడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెప్టెంబరులో జరిగిన ఓ సంఘటనలో ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ట్రంప్ పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ట్రంప్‌ ఏమాత్రం సురక్షితంగా లేరని తనకు అర్థం అవుతోందని, ఆయన ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు పుతిన్. ఉక్రెయిన్‌ కు మద్దతు ఇస్తున్న బిడెన్ త్వరలో అమెరికా ప్రెసిడెంట్ గా పదవి చేపట్టనున్న ట్రంప్ బృందానికి అదనపు ఇబ్బందులు సృష్టించారని కూడా పుతిన్ విమర్శించారు. 

తెలంగాణలో అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం చేస్తామని.. లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి ఇస్తామని సీఎం తెలిపారు. ''ఇళ్ల విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలి. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి'' అని అధికారులను సీఎం ఆదేశించారు.

సింగపూర్‌లో 21 ఏళ్లుగా ఉంటున్న బాలసుబ్రమణ్యం చిదంబరం రూ. 8 కోట్లను గెలుపొందారు. జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో భాగంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ జ్యువెలరీలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. చిదంబరం లిటిల్ ఇండియాలోని ఈ షాపుకు వెళ్లిన సమయంలో భార్య కోసం 6000 డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. తాను ఇంత పెద్ద లక్కీ డ్రాని గెలుచుకోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన నాన్నగారి వర్ధంతి రోజు ఈ వార్త తెలియడంతో మరింత సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలని, గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ ముందుకు రావడం పట్ల ఆ దేశ రాయబారి రువెన్ అజర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటును అందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై అత్యాధునిక శిక్షణలో మద్దతు కావాలని కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. ఇజ్రాయెల్ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు. నూతన పరిజ్ఞానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే తెలంగాణ నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి సూచించారు.

తెలంగాణలోని నల్గొండ  జిల్లా మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుకుల సిబ్బందిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెరుగైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై నిప్పులు చెరిగారు.

సినీ నటి సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేస్తూ ''నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ..'' అని పేర్కొన్నారు. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును సైతం ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలి- 240, తమిళనాడులోని నాగపట్నం- 330, పుదుచ్చేరి- 390, చెన్నై- 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 190, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం- తూర్పు ఆగ్నేయ దిశగా 470, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 580, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ గత రెండు మూడు నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ కూడా అమ్మకాలలో వెనుకబడి ఉన్నాయి. మొత్తమ్మీద, ఇది ఇప్పుడు దేశంలో పాపులర్ స్కూటర్‌గా పేర్గాంచింది. ఇందులో అనేక ఆఫ్షన్లు రావడం మొదలయ్యాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.95,998. మరోవైపు, టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 89,999, ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 59,999. ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే బజాజ్ చేతక్ చాలా ఖరీదైనది. మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీరు దాని బ్యాటరీ ధరను కూడా తెలుసుకోవాలి. కంపెనీ తన స్కూటర్ బ్యాటరీపై సుదీర్ఘ వారంటీని ఇస్తుంది. అయితే, ఈ వారంటీ బ్యాటరీ నష్టాన్ని కవర్ చేయదు. మీరు కొత్త బ్యాటరీని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొత్త బ్యాటరీ ధర కూడా తెలుసుకోవాలి. బజాజ్ పోర్ట్‌ఫోలియో చేతక్ 2930 వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో 2.8kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఎవిండియా నివేదిక ప్రకారం బజాజ్ బ్యాటరీ సామర్థ్యం 2.8kWh నుండి 3.2kWh వరకు ఉంది. కంపెనీ తన అన్ని వాహనాల్లో రెండు ఆఫ్షన్లను అందిస్తుంది అంటే స్టాండర్డ్, టెక్‌ప్యాక్. ఈ కొత్త బ్యాటరీల ధరలు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు ఉన్నాయి. అంటే, స్కూటర్, బ్యాటరీ ధర మధ్య సగానికి పైగా వ్యత్యాసం ఉంటుంది. అయితే, దాని బ్యాటరీ ధరను నిర్ధారించడం లేదు. దీని కోసం మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌లో 3 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి అక్టోబర్ 2024 వరకు డేటా ప్రకారం మొత్తం 3,03,621 యూనిట్లను విక్రయించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్టోబర్ 2024లో అత్యధిక నెలవారీ షిప్‌మెంట్‌లను నమోదు చేసింది. బజాజ్ చేతక్ ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. జూన్ 2024లో 2 లక్షల యూనిట్ల మార్కును దాటిన తర్వాత, బజాజ్ చేతక్ కేవలం నాలుగు నెలల్లో గత లక్ష యూనిట్ల విక్రయాలను సాధించింది.

రామేశ్వరం - మండపం మధ్య సముద్రంలో 2.06 కి.మీ.ల పొడవైన పాత పంబన్‌ బ్రిడ్జిపై నుంచి రైలు వెళ్తుంది. సముద్రంలో వచ్చే షిప్‌ ఆ బ్రిడ్జిని దాటాలంటే 16 మంది కార్మికులు మ్యానువల్‌ గా రైల్వే బ్రిడ్జిని లిఫ్ట్ చేసే వాళ్లు. 1914లో రూ.20 లక్షలతో నిర్మించిన పాత పంబన్‌ బ్రిడ్జి లైఫ్‌ టైమ్‌ అయిపోయింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన న్యూ పంబన్‌ బ్రిడ్జి త్వరలోనే సేవలందించడానికి సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే ఒక ఇంజనీరింగ్‌ మార్వెల్‌ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్‌ మీడియా వీడియోలు, ఫొటోలు షేర్‌ చేశారు. ఇది దేశంలోనే మొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జీ. కొత్త పంబన్‌ బ్రిడ్జి ట్రాక్‌ తో సహా ఆటోమేటిక్‌గా పైకి లిఫ్ట్‌ అవుతుంది. ఓడలు వెళ్లేప్పుడు పైకి వెళ్లే బ్రిడ్జి కమ్‌ రైల్వే ట్రాక్‌ సాధారణ సమయాల్లో రైళ్లు రయ్యిన దూసుకుపోయేందుకు అనువుగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు చూసిన వాళ్లు ఔరా! అంటున్నారు.

పురుషుల పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకు సహాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. తమలపాకు పురుషులలో స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యతను మెరుగుపరుస్తుందని చెబుతారు. తమలపాకు అకాల స్కలన సమస్యను కూడా పరిష్కరిస్తుంది. తమలపాకుల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. తమలపాకులోని యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తమలపాకు చర్మం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తమలపాకులోని పోషకాలు శరీరానికి చాలా అవసరం మరియు తమలపాకుతో తయారు చేసిన సాధారణ మందులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్  ప్రచురించిన ఇటీవలి అధ్యయనాల డేటాను పరిశీలిస్తే తమలపాకు లక్షణాలు రుజువుగా కనిపిస్తున్నాయి. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. యాంటీబయాటిక్ లక్షణాలు సూక్ష్మక్రిములతో పోరాడటానికి సహాయపడతాయి. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. తమలపాకులను పగటిపూట తినడం కంటే రాత్రిపూట తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. వర్షాకాలంలో తమలపాకు చెట్లు బాగా పెరుగుతాయి. దీని పచ్చి ఆకులను రాత్రిపూట తినడం వల్ల నోటి పరిశుభ్రత మెరుగుపడుతుంది. తమలపాకులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలో కనిపించే హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలను తొలగించడంలో సహాయపడతాయి. తమలపాకులు నోటి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. ఇప్పటికే నోటిపూత ఉన్నవారు తమలపాకులను తింటే త్వరగా నయమవుతుంది. అంతే కాకుండా నాలుకలో ఏదైనా గాయం, చికాకు వచ్చినా తమలపాకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. నోటి పుండ్లు ఉంటే తమలపాకులను తినేటప్పుడు సున్నం తక్కువగా వాడాలి. తమలపాకులను రోజూ నమలడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. తమలపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అదనపు కడుపు ఆమ్లాన్ని తటస్థీకరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తమలపాకులు ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తాయి. తమలపాకు శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దీనిని మంచి డిటాక్సిఫైయర్ అని చెప్పవచ్చు. ఇవి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మలబద్ధకంతో బాధపడేవారు తమలపాకు తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. తమలపాకు నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. తమలపాకులో నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే గుణాలు ఉన్నాయి, శరీరం మరియు మనస్సును ఉత్సాహంగా ఉంచుతాయి. 

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పవిత్రమైన 18 మెట్లపై 23 మంది పోలీసులు గ్రూప్ ఫోటో దిగిన ఘటనలో ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. ఆ పోలీసులు తక్షణమే సత్ర్పవర్తన కోసం కఠినమైన శిక్షణ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఏపీ క్యాంప్‌కు చెందిన పోలీసు ఆఫీసర్లు ఇప్పుడు కన్నౌర్‌లోని కేఏపీ-4 క్యాంపునకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ క్యాంపులో సత్ర్పవర్తన పొందేలా పోలీసులకు కఠిన శిక్షణ ఇవ్వనున్నారు. ఏడీజీపీ ఎస్ శ్రీజిత్ ఆదేశాల మేరకు శిక్షణ కొనసాగనున్నది. క్రమశిక్షణ చర్యల గురించి హైకోర్టుకు తెలియజేశారు. అయ్యప్ప సన్నిధానంలో మెట్లపై నిలుచుని ఫోటో దిగిన పోలీసులు తమ వెనుక భాగాన్ని దేవుడి వైపు ఉంచారు. దీని పట్ల వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో 23 మంది ఆఫీసర్లను శిక్షణ కోసం వెనక్కి రప్పించారు. సన్నిధానం స్పెషల్ ఆఫీసర్ నుంచి కూడాఏడీజీపీ రిపోర్టును కోరారు. 18 మెట్లపై పోలీసులు ఫోటోషూట్ చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ విమర్శించింది. అయ్యప్ప భక్తులు ఎవ్వరూ దేవుడికి వెన్ను చూపించరని పేర్కొన్నది. ఆలయ పవిత్రతను పోలీసులు దెబ్బతీసినట్లు వీహెచ్‌పీ ఆరోపించింది.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుండి గోండియాకు వెళుతున్న ఆర్టీసీ బస్సు సడెన్ ‎గా బైక్ అడ్డు రావడంతో దానిని తప్పించబోయి బోల్తా పడింది. ఖజ్రీ గ్రామ సమీపంలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మారం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బస్సు రోడ్డు మధ్యలో బోల్తా పడటంతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహయంతో బస్సును పక్కకు తొలగించారు.

దేశంలోని విభిన్న రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా హోండా బైకులు రూపొందించబడ్డాయి, అందువల్ల ప్రతీ వాడుకదారుడు దీనిని సౌకర్యంగా వాడవచ్చు. హోండాలో సీబీ షైన్, హోండా యాక్టివా, హోండా యునికార్న్ వంటి మోడళ్లను దేశంలో ఎన్నో సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. 5-స్టార్ సేఫ్టీ ప్రమాణాలు, అద్భుతమైన బ్రేకింగ్ సిస్టమ్, సర్వీస్ నెట్‌వర్క్ వినియోగదారులకు విశ్వసనీయతను అందిస్తాయి. ఇది మాత్రమే కాదు, హోండా బైకులు అందరూ స్టైలిష్, మోడరన్ డిజైన్ వల్ల కూడా ఆకర్షితులవుతారు. హోండా మీద విశ్వసనీయత, లాంగ్-లాస్టింగ్ పనితీరు కారణంగా, ఇది భారతదేశంలోని బైక్ ప్రియులలో ప్రాధాన్యత పొందింది. హోండా రెబెల్ 1100 బైక్ కంఫర్ట్ మరియు కన్వీనియన్స్ విభాగంలో మాత్రమే కాదు. టెక్ పరంగా, క్రూయిజర్ ఇప్పుడు రోడ్‌సింక్‌ని కలిగి ఉంది. హోండా యూఎస్ లైనప్‌ మొదటిసారిగా చేశారు. ఇది స్మార్ట్‌ఫోన్‌తో జత చేసే చెక్నాలజీ, హ్యాండ్స్-ఫ్రీ నావిగేషన్, మ్యూజిక్ నియంత్రణలు, వాతావరణ సూచనను తనిఖీ చేయడం వంటి ఇతర ఫీచర్‌లను యాక్సెస్ చేస్తుంది. ఇది అబ్బాయిలనే గర్ల్‌రైడర్‌లను ఆకర్షించాలని చూస్తోంది. మంచి పనితీరు, సాంకేతిక పరిజ్ఞానం గల వ్యక్తులు నగరం లోపల, వెలుపల సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. రెబెల్ 1100 మీకు చేయి, కాలు పని లేకుండా పని చేస్తుంది. 1,000cc తో దీని ధర రూ. 8 నుంచి 12 లక్షలు ఉంటుంది. 

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ప్రతినిధి జైరాం రమేష్‌ స్పందించారు. ఐఎల్‌ఒ నివేదికను ఉటంకిస్తూ  ఇది ప్రధాని మోడీ పకోడా నామిక్స్‌ ప్రత్యక్ష పరిణామమని ధ్వజమెత్తారు. ఐఎల్‌ఒ ఇటీవల విడుదల చేసిన ' ప్రపంచ వేతన నివేదిక 2024-2025' భారత దేశంలో వేతన అసమానతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ఆదాయం పొందేవారిలో మొదటి 10 శాతం మంది దిగువ 10 శాతం కంటే 6.8 రెట్లు అధికంగా సంపాదిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌ మరియు మయన్మార్‌లతో సహా మన పొరుగున ఉన్న దాదాపు ప్రతి దేశం కన్నా వేతనాలు చాలా అసమానంగా ఉన్నాయని ఎక్స్‌లో పేర్కొన్నారు. తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో వేతన కార్మికులలో భారతదేశం అత్యల్పవాటాను కలిగి ఉందని నివేదికను ఉదహరించారు. చాలా మంది కార్మికులు స్వయం ఉపాధి కలిగి ఉన్నారని, అయితే ఇది అనధికారికంగా, తక్కువ వేతనంతో మరియు ఎక్కువ అస్థిరతకు గురవుతుందని అన్నారు. ఇది నాన్‌ బయోలాజికల్‌ పిఎం సృష్టించిన పకోడా -నామిక్స్‌ ప్రత్యక్ష పరిణామ ఫలితమని ఉద్ఘాటించారు. ప్రజలకు పకోడాలు, ఎంచుకున్న కొద్ది మందికి హల్వా అందిస్తున్నారని మండిపడ్డారు.

బెంగళూరులో డిసెంబరు 15న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. గత సీజన్‌ రూ.13.5 కోట్లు ఉండగా ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్‌ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి. ఈసారి వేలంలో హీథర్‌ నైట్‌, లీ తహుహు, నాడిన్‌ డి క్లెర్క్‌, స్నేహ్‌ రాణా, డియాండ్ర డాటిన్‌, లారెన్‌ బెల్‌, పూనమ్‌ యాదవ్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీల గడువు ముగియగా.. ఒక్క బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్‌ నుంచి ఒక్క డ్యానీ వ్యాట్‌ (ఇంగ్లండ్‌)ను ఆర్‌సీబీ తీసుకుంది. గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌ టీమ్స్ డబ్ల్యూపీఎల్‌ 2025లో తలపడనున్నాయి. గతేడాది ఆర్‌సీబీ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2025 ముందు డబ్ల్యూపీఎల్‌ 2025 జరగనుంది. ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలోని పూణెలో క్రికెట్ మైదానంలో గుండెపోటుతో క్రికెటర్ మృతి చెందాడు. ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని గర్వార్ క్రికెట్ స్టేడియంలో లక్కీ బిల్డర్స్, యంగ్ 11కు మధ్య మ్యాచ్ జరుగుతుండగా గుండెనొప్పి వస్తుందని ఎంపైర్కు ఇమ్రాన్ సికిందర్ పటేల్ చెప్పాడు. వెంటనే మైదానం నుంచి వెళ్తుండగా పటేల్ కుప్పకూలడంతో ఆటగాళ్లు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే క్రికెటర్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సికిందర్ పటేల్ లక్కీ బిల్డర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు. దీంతో పటేల్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. 

హిమాచల్ ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో శివుని ఆలయం ఉంది. ఇది హిందూ, సిక్కు మతాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రదేశం. పార్వతి నది మణికర్ణ గుండా ప్రవహిస్తుంది. దీనికి ఒక వైపు శివాలయం, మరొక వైపు మణికర్ణ సాహిబ్ అని పిలువబడే గురు నానక్ కి చెందిన చారిత్రక గురుద్వారా ఉంది. ఇక్కడ వేడి నీరు ఇప్పటికీ ఒక రహస్యం. ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. అయినా రహస్యం తెలుసుకోలేకపోయారు. ఈ శివాలయానికి సంబంధించిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. పురాణ కథ ప్రకారం ఒకసారి నదిలో పార్వతీదేవి జలాకాలాడుతుండగా అమ్మవారి చెవిపోగు ముత్యం నీటిలో పడిపోయింది. ప్రవహిస్తున్న నది నీటి నుంచి ఆ ముత్యం భూలోకం నుంచి పాతాళానికి చేరుకుంది. ఆ తర్వాత శివుడు తన గణాలను ఆ ముత్యం కోసం వెతకడానికి పంపాడు. ఎక్కడ ఎంత వెతికినా వారికి ఆ ముత్యం దొరకలేదు. దీంతో శివుడు కోపించి భయంకరమైన దూరం దాల్చి మూడో కన్ను తెరిచాడు. మహాదేవుని కోపము వలన నదిలో నీరు మరగడం మొదలైంది. ఆ నది నీరు అది నేటికీ అలా మరుగుతూనే ఉంది. శివుని ఈ భయంకరమైన రూపాన్ని చూసి నైనా దేవి ప్రత్యక్షమై పాతాళానికి వెళ్లి శేషనాగుడిని పార్వతి దేవి ముత్యాన్ని శివునికి తిరిగి ఇవ్వమని కోరింది. ఆ తర్వాత శేషుడు పార్వతిదేవి ముత్యాన్ని మహ దేవుడికి తిరిగి ఇచ్చాడు. శేషుడు పాతాళంలో బిగ్గరగా బుసలు కొట్టాడు. అప్పుడు అనేక రత్నాలు భూమిపైన వివిధ ప్రదేశాలలో పడ్డాయి. అప్పుడు పార్వతీ దేవికి సంబంధించిన రత్నాన్ని తీసుకుని.. శివుడు ఆ రత్నాలన్నింటినీ రాళ్ళుగా మార్చి నదిలో విసిరాడు. ఒకవైపు పార్వతి నదిలో గడ్డకట్టే నీరు, మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గ ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ దైవిక దృగ్విషయం చూసిన నాస్తికుడు కూడా దేవునికి తల వంచాల్సిందే అని సందర్శకులు చెబుతారు. ఈ ఆలయ సందర్శన ప్రతి భక్తునికి మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. శీతాకాలంలో మంచు కురుస్తుంది. వేసవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పురాతన కాలం నుంచి ఇక్కడ మరుగుతున్న నీటి బుగ్గలు 10 నుంచి 15 అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్‌ను సృష్టించాయి. కొన్నిసార్లు ఈ నీటి బుగ్గల నుంచి విలువైన వివిధ రంగు రాళ్ళు కూడా బయటకు వస్తాయి. ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత 65 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ వెచ్చని నీటిగల కారణాన్ని అన్వేషించడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు. నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదు. ఈ నీటిలో అన్నం, పప్పు, కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి. ఈ కుండంలో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్యాలు నయమవుతాయి. ఈ పవిత్ర జలంలో ఎవరు స్నానం చేస్తారో వారికి సంబంధించిన చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని ప్రజలు నమ్మకం. 

తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో యువతిపై పులి దాడి చేసింది. కాగజ్‌నగర్‌ మండలం గన్నారం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌగంజ్ ప్రాంతంలో కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ బాలిక తన సోదరి, సోదరుడితో అంబులెన్స్‌లో ప్రయాణిస్తోంది.అప్పటికే డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది స్నేహితుడు రాజేష్ కేవత్‌లు అంబులెన్స్‌లో ఉన్నారు. నీళ్ల కోసం బాలిక సోదరి, సోదరుడు అంబులెన్స్ నుంచి కిందకు దిగారు. అంబులెన్స్ డ్రైవర్ వెంటనే వారి కోసం ఎదురు చూడకండా వాహనాన్ని నడిపాడు. కదులుతున్న అంబులెన్స్‌లో బాలికపై రాజేష్ కేవత్ అత్యాచారం చేశాడు. అనంతరం రోడ్డు పక్కన బాలికను వదిలేసి పారిపోయారు. వెంటనే బాలిక తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికి కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మూడు రోజుల తరువాత తల్లి, తన కూతురుతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేవత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

3