Ad Code

తొలి టెస్టులో శ్రీలంకపై గెలిచి ఐసీసీ టేబుల్‌లో రెండో స్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా


క్షిణాఫ్రికా లోని డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 516 పరుగుల లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 103/5తో నాలుగో రోజు ఆట ఆరంభించిన శ్రీలంక 282 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (83; 174 బంతుల్లో, 12 ఫోర్లు), దనంజయ డిసిల్వా (59; 81 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (48; 77 బంతుల్లో, 9 ఫోర్లు) పోరాడారు. మార్కో జేన్సన్ నాలుగు వికెట్లు, రబాడ, కొయెట్జీ, మహరాజ్ తలో రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 191 పరుగులు చేసింది. కెప్టెన్ బవుమా (70; 117 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌటైంది. గత 100 ఏళ్లలో ఒక జట్టు ఇంత తక్కువ బంతుల్లో ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి. అలాగే టెస్టుల్లో శ్రీలంక ఇదే అత్యల్ప స్కోరు. కామిందు మెండిస్ (13), లాహిరు కుమార (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మార్కో జేన్సన్ ఏడు వికెట్లతో విజృంభించాడు. కొయెట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ తీశారు. 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 366/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (122; 221 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), బవుమా (113; 228 బంతుల్లో, 9 ఫోర్లు) సెంచరీలు సాధించారు. విశ్వా ఫెర్నాండో, ప్రభత్ జయసూర్య చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో ఆస్ట్రేలియా (57.69 %)ను వెనక్కినెట్టి దక్షిణాఫ్రికా (59.26 %) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ (61.11 %) అగ్రస్థానంలో కొనసాగుతోంది. టేబుల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. న్యూజిలాండ్ (54.55 %) నాలుగో స్థానంలో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu