తెలంగాణ మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గంట చక్రపాణి నియమితులవగా, ఆ తర్వాత జనార్దన్ రెడ్డి నియామకం జరిగింది. అయితే వివిధ ఆరోపణల నేపథ్యంలో జనార్ధన్ రెడ్డి స్థానంలో మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన బుర్ర వెంకటేశం ముఖ్యమంత్రి నియమించారు. నాలుగు సంవత్సరాల పాటు బుర్ర వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవీలో ఉండనున్నారు. డిసెంబర్ 3తో మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆ స్థానంలో బుర్ర వెంకటేశంను నియామిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈనెల 20న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అదే సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో టీజీపీఎస్సీ చైర్మన్ పదవి కోసం దాదాపు 45 అప్లికేషన్లు వచ్చాయి. అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరకు విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న బుర్ర వెంకటేశంను టీజీపీఎస్సీ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. అనంతరం చైర్మన్ నియామకానికి సంబంధించిన ఫైలును గర్నవర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. ఈ క్రమంలో నియామకానికి సంబంధించిన ఫైల్‌పై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం పేరును కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం నియమితులైన నేపథ్యంలో ఇంతకుముందున్న పదవులకు ఆయన రాజీనామా చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వీఆర్‌ఎస్‌కు వెంకటేశం దరఖాస్తు చేసుకోగా అందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. డిసెంబర్ 3న ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియడంతో టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశంను సర్కార్ నియమించింది. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్ర వెంకటేశం !
November 30, 2024
0
Tags