ఈపీఎఫ్ఓ సభ్యులు ఏటీఎం ద్వారా వారి పీఎఫ్ ఖాతా నుండి నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కార్మిక మంత్రిత్వ శాఖ ఒక కార్డును జారీ చేసే పనిలో ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం ఈ సదుపాయం మే-జూన్ 2025 నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఇది ఈపీఎఫ్ఓ వినియోగదారులకు భారీ ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే, పీఎఫ్ సహకారంలో 50 శాతం కంటే తక్కువ మాత్రమే ATM ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. నవంబర్ ప్రారంభంలో, ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం కింద జీతం పరిమితిని 21,000 రూపాయలకు పెంచుతుందని వార్తలు వచ్చాయి. అంతకుముందు పదేళ్ల క్రితం 2014లో ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం కింద జీత పరిమితిని రూ.6500 నుంచి రూ.15,000కు పెంచింది.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా ?
November 30, 2024
0
Tags