తహవూర్ రాణాకు కెనడా పౌరసత్వం రద్దు ?
ముం బయి 26/11 ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాకు పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రక్రియను కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లుండి భారత పర్యటనకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాబోతున్న వేళ ఈ పరిణామం ఆసక్తిగా మారింది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న భారత్-కెనడా సంబంధాలను పునరుద్ధరించేందుకు, ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే కెనడా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పాకిస్థాన్‌లో జన్మించిన రాణా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. లష్కరే తోయిబా ఆధ్వర్యంలో జరిగిన ముంబై దాడుల కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నాడు. కెనడా పౌరసత్వం కలిగి ఉన్న తహవూర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కెనడా నిర్ణయం వెనుక ఉగ్రవాద ఆరోపణలు కాదని తెలుస్తోంది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం (ఐఆర్‍సీసీ) ప్రకారం ఆయన 2001లో కెనడా పౌరసత్వం పొందే సమయంలో తప్పుడు వివరాలు సమర్పించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకోబోతోంది. పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తులో తాను కెనడాలో నాలుగేళ్లపాటు నివసించానని, ఆ సమయంలో కేవలం ఆరు రోజులు మాత్రమే దేశం వెలుపల ఉన్నానని కెనడా అధికారులకు రాణా...