మహిళా అధికారులను అవమానించినందుకు జర్నలిస్టులను అరెస్టు చేశాము !
తె లంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికీ, స్థానికంగా పనిచేసిన ఐఏఎస్ అధికారికీ మధ్య లింకులు ఉన్నాయంటూ కథనాలు ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ జర్నలిస్టుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకు వచ్చిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తమ చర్యల్ని సమర్ధించుకున్నారు. మహిళా అధికారుల్ని అవమానించినందుకే తాము ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. అనంతరం సజ్జనార్ ఎక్స్ లో మహిళల గౌరవాన్ని గుర్తుచేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో "విమర్శలు, పరిశీలనలు ప్రజా జీవితంలో భాగం. కానీ ఏ స్త్రీనైనా - ఆమె ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రైవేట్ రంగంలో నిపుణురాలైనా, లేదా గృహిణి అయినా - పదాలు, టీవీ కథనాలు లేదా సోషల్ మీడియా ద్వారా కించపరచడం విమర్శ కాదు, అది క్రూరత్వం. ఇది ఆమోదయోగ్యం కాదు దీనిని అందరూ సంకోచం లేకుండా ఖండించాలి." అని తెలిపారు. మహిళలు పరిపాలన, పోలీసింగ్, పాలన, సైన్స్, ప్రజా జీవితం మరియు మీడియాలో ముందుండి నాయకత్వం వహిస్తున్నారని, ముఖ్యంగా, వారు ఇంట్లో కూడా నాయకత్వం వహిస్తున్నారు, తరచుగా కనిపించని బాధ్యతలను మోస్తున్నారని తెలిపారు. పని, కుటుంబం...