Posts

Showing posts with the label Ajit Pawar's death

అజిత్‌ పవార్‌ మృతి : అదే రోజు మైనారిటీ శాఖలో 75 ఫైళ్లకు క్లియరెన్స్

Image
మ హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మృతి చెందిన రోజు మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావునిస్తోంది. మైనార్టీ శాఖ అజిత్‌ పవార్‌ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్‌ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన చార్జ్‌ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్...