Posts

Showing posts with the label diesel

విదేశాలకు ఎగుమతి అయ్యే ఇంధనంపై పన్ను పెంపు

Image
కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దులు దాటి విదేశాలకు ఎగుమతి అయ్యే ఇంధనాలపై పన్నుల భారాన్ని గణనీయంగా పెంచింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకంలేదా విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సమీక్షిస్తూ పెంపు నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. పెట్రోల్ ఎగుమతిపై పన్నును లీటరుకు 2.5 రూపాయిల నుంచి 3.5 రూపాయిలకు పెంచగా, డీజిల్ ఎగుమతి పన్నును లీటరుకు 15.5 రూపాయిల నుంచి ఏకంగా 25.5 రూపాయిలకు పెంచింది. అదేవిధంగా ఎయిర్‌క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై కూడా లీటరుకు పన్నును 14.5 రూపాయిల నుంచి 22 రూపాయిలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక లాభాల కోసం ఇంధనాన్ని ఎగుమతి చేయడాన్ని నిరుత్సాహపరచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచడం ద్వారా, ఆయా కంపెనీలు సరుకును విదేశాలకు పంపడం తగ్గించి దేశీయంగానే విక్రయించేలా ఒత్తిడి తెచ్చినట్లవుతుంది. దీనివల్ల మన దేశంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడకుండా తగినంత స్టాక్ అందుబాటులో ఉండటంతో పాటు, దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు స్థిరం...

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన వామపక్షాలు

Image
వి జయవాడలో వామపక్ష పార్టీలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సామాన్య ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ పలు దశల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. లెఫ్ట్‌ పార్టీల ప్రెస్‌ మీట్‌లో మీడియాతో మాట్లాడిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రోజురోజుకీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల వల్లే ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష నేతలు వెల్లడించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంగా పాసర్లపూడిలోని కేజీ బేసిన్ ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రోజూ పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల పేరుతో ప్రకటనలు చేస్తూ హడావిడి చేస్తున్నారని, కానీ ధరల పెరుగుదల ...

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు ?

Image
దే శవ్యాప్తంగా వాహనదారులకు, వంట గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం నేపథ్యంలో భారతీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచే దిశగా కసరత్తు చేస్తున్నాయి. జాతీయ కథనాల ప్రకారం, వచ్చే వారంలోనే ధరల పెంపు జరిగే అవకాశం ఉంది. గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెరుగవచ్చని, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపుపై సంయమనంతో ఉన్న ఆయిల్ కంపెనీలు, ఇప్పుడు వారాంతంలో ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ కొరత లేదు : ఇండియన్ ఆయిల్

Image
దే శవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, వినియోగదారుల అవసరాలకు సరిపడా నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది. 'ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరా జరుగుతోంది. వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేయడం చేయాల్సిన అవసరం లేదు' అని సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. వంట గ్యాస్ ధరల పెరుగుదల, కొన్ని చోట్ల కనిపిస్తున్న కొరత వల్ల వాహనదారులు పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా ఆందోళన చెందారు. అయితే.. పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం.. భారత్ వద్ద అత్యవసర పరిస్థితుల కోసం తగినంత క్రూడ్ ఆయిల్ రిజర్వ్‌లు ఉన్నాయి. రష్యా వంటి దేశాల నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగుతుండటం వల్ల ప్రస్తుతానికి ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. వదంతులను నమ్మి పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టి ఇబ్బంది పడవద్దని ప్రభుత్వం, చమురు సంస్థలు కోరుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల విషయంలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఇంధన సరఫరాపై ప్రభావం చూపవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.