Posts

Showing posts with the label actor Vijay

వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యం !

Image
త మిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గెలుపే లక్ష్యంగా తమిళగ వెట్రి కజగం పార్టీ ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగానే, నటుడు విజయ్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే, కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలిసారిగా కాంచీపురం జిల్లాలో నిర్వహిస్తున్న సభలో అతడు మాట్లాడుతూ.. 12 హామీలను సభలో ప్రస్తావించారు. ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు.. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడుతారు, ఆ రోజు త్వరలోనే వస్తుంది అని టీవీకే చీఫ్ పేర్కొన్నారు. అయితే, ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఓ కులానికి చెందిన పార్టీ ముద్ర వేయాలని కొందరు చూశారని తమిళగ వెట్రీ కజగం అధినేత విజయ్ తెలిపారు. పార్టీ లాగేసుకోవాలని చూశారు.. కానీ, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు.. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యం.. అందుకు ప్రజల్లోకి వచ్చాను, మీకోసం పోరాటం చేస్తున్నాను.. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి అయితే, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి...