Posts

Showing posts with the label 'New Delhi Declaration 2026' Adopted

దిగ్విజయంగా ముగిసిన బ్రిక్స్ సదస్సు : న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదం

Image
న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ వేదికపై భారత్ తన దౌత్యపరమైన వ్యూహాలతో తిరుగులేని విజయం సాధించింది. వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' పేరుతో రూపొందించిన ఉమ్మడి తీర్మానానికి సభ్య దేశాలన్నీ పూర్తి ఆమోదం తెలిపాయి. ఈ మూడు రోజుల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  బిజీ షెడ్యూల్‌తో గడిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సహా సుమారు 15 దేశాల అగ్రనేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ప్రపంచంలో సంక్షోభాలు ఉన్నప్పటికీ, గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతను చాటాలని మోడీ పిలుపునిచ్చారు. పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంటూనే, బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో సమతూకం పాటిస్తూ భారత్ దౌత్యపరంగా తన ప్రత్యేక ముద్ర వేసింది. సదస్సు మొదటి రోజున ప్రధాని మోడీ  రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2030 నాటికి భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు ద...