ఇకపై 30 రోజుల్లోనే గూగుల్ ఫోటోలు శాశ్వతంగా డిలీట్ !
గూ గుల్ లో ఇప్పటివరకు 'ట్రాష్' లేదా 'బిన్'లో ఉన్న ఫోటోలు, వీడియోలు డిలీట్ అవ్వడానికి 60 రోజుల సమయం ఉండేది. కానీ ఇకపై కేవలం 30 రోజుల్లోనే అవి పర్మనెంట్‌గా తొలగిపోతాయి. అదనంగా లభించే ఆ ఒక నెల వెసులుబాటుపై ఆధారపడే భారతీయ యూజర్లు వెంటనే అలర్ట్ అవ్వడం మంచిది. మీ బిన్ ఒకసారి ఓపెన్ చేసి, ముఖ్యమైన ఫోటోలు ఏవైనా ఉంటే వెంటనే రికవర్ చేసుకోండి. గూగుల్ హెల్ప్ పేజీలో ఇప్పటికే ఈ 30 రోజుల నిబంధనను అప్‌డేట్ చేశారు. ఈ వారంలోనే యూజర్లకు యాప్‌లోనే నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. 30 రోజులు పూర్తవ్వగానే, బిన్‌లో ఉన్న ఫైళ్లు అన్ని డివైజెస్ నుంచి పర్మనెంట్‌గా తొలగిపోతాయి. అంతేకాదు, మీరే స్వయంగా బిన్‌ను ఎంప్టీ చేస్తే అవి వెంటనే డిలీట్ అయిపోతాయి, ఇక వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు. ఫోటోలు ఇతరులకు కనిపించకుండా దాచాలనుకుంటే 'డిలీట్' చేయడానికి బదులు 'ఆర్కైవ్' ఆప్షన్ వాడటం శ్రేయస్కరం. దీనివల్ల ఫోటోలు అల్బమ్‌లోనే సురక్షితంగా ఉంటాయి, వెతకడానికి వీలుగా ఉంటూనే పొరపాటున డిలీట్ అయ్యే ముప్పు తప్పుతుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వండి. కింద ఉన్న ...