Posts

Showing posts with the label Alliance Led by CM Vijay Named 'Secular Social Justice Victory Alliance'

సీఎం విజయ్ నేతృత్వంలోని కూటమి పేరు 'సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌' గా ఖరారు

Image
త మిళనాడు లో తమిళగ వెట్రి కళగం కూటమి ప్రభుత్వానికి 'సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌' అనే పేరును నిర్ణయించారు. ఈ విషయాన్ని టీవీకే చీఫ్‌ విజయ్‌, వీసీకే చీఫ్‌ తోల్‌ తిరుమావళన్‌, ఎండీఎంకే చీఫ్‌ వైకో, ఐయూఎంఎల్‌ నాయకులు మీడియా ముఖంగా వెల్లడించారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్‌, వీసీకే,ఎండీఎంకే, ఐయూఎంఎల్‌ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే తమిళనాడు కూటమి ప్రభుత్వానికి ఈ పేరును ఖరారు చేశారు. అయితే,అనూహ్యంగా ఈ సమావేశానికి విజయ్‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వామపక్ష పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ సమావేశం ఇది. కూటమి నిర్మాణాన్ని అధికారికంగా ఖరారు చేయడంపై ఈ భేటీ ప్రధానంగా దృష్టి సారించింది. ఉమ్మడి కార్యక్రమంలో రూపకల్పన, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కన్వీనర్ నియామకం,కూటమికి అధికారిక పేరును ఖరారు చేయడం వంటి ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం. తమిళనాడులో సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే కూటమి సమావేశానికి సీపీఐ,సీపీఎం వంటి వామపక్ష పార్టీలు గైర్హాజరు క...