Ad Code

మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్‌లో అల్పాహారం తిన్న18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

తెలంగాణ లోని వరంగల్ జిల్లా మామునూరులోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఉదయం అల్పాహారం తిని 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు. వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ వై మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu