Posts

Showing posts with the label a special 6-day package

ఆంధ్రప్రదేశ్ లో కారవాన్ టూరిజం

Image
కే రళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో పర్యాటకుల కోసం పెద్దఎత్తున కారవాన్​లను నడుపుతున్నారు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ తరహా టూరిజం అందుబాటులోకి వచ్చింది. నాలుగు మార్గాల్లో వీటిని నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ పోర్టల్‌ ద్వారా సులభంగా వాహనాలు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం రెండు సంస్థలు ఎంప్యానల్ చేయగా నాలుగు కారవాన్​లు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వాహనాల్లో 10 నుంచి 12 సీట్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా మరో రెండు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు. సంక్రాంతి వేళహైదరాబాద్‌ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా 6 రోజుల ప్యాకేజీతో కారవాన్‌ నడవనుంది. ఈ మార్గంలో ప్యాకేజీ రూ.3.50 లక్షలు. ఈనెల 10, 11, 12 తేదీలకు బుక్‌ చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 6 రోజుల పాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది. ఈ మూడు తేదీల్లో హైదరాబాద్‌ నుంచి 4 కారవాన్‌లు నడపనున్నారు. సందర్శించాక పర్యాటకులు రాత్రుల్లో కార వాన్‌లోనే నిద్రపోయేలా వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. కూర్చొనే సీట్లనే మీరు నిద్రపోయే విధంగా మార్చుకోవచ్చు. వాహనంలో టీవీ, ఫ్రిజ్, వాష్‌రూం సదుపాయా లు ఉన్నాయ...