Posts

Showing posts with the label Alexey Leonov

గోవాలో ఇద్దరు మహిళలను గొంతు కోసి చంపిన రష్యా జాతీయుడు !

Image
గో వాలో రష్యాకి చెందిన అలెక్సీ లియోనోవ్‌ తన ప్రియురాలు, స్నేహితురాలిని హత్య చేశాడు. వారిద్దరిని గొంతు కోసి చంపాడు. ఆ రష్యా వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత 8 కిలోమీటర్ల దూరంలోని అరమ్బోల్ గ్రామానికి అలెక్సీ లియోనోవ్‌ పారిపోయాడు. రష్యా జాతీయుడైన 37 ఏళ్ల అలెక్సీ లియోనోవ్‌, జనవరి 14న రాత్రి వేళ మోర్జిమ్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్న స్నేహితురాలైన 37 ఏళ్ల ఎలెనా వనీవాపై కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేశాడు. జనవరి 15న సాయంత్రం అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న స్నేహితురాలు ఎలెనా కస్థానోవాతో అతడికి ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గదిలో బంధించాడు. తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. మరోవైపు ఆ ఇంటి యజమాని ఫిర్యాదుతో మండ్రేమ్ పోలీసులు అక్కడకు చేరుకుని అలెక్సీ లియోనోవ్‌ను అరెస్ట్‌ చేశారు. రష్యాకు చెందిన ప్రియురాలితో పాటు స్నేహితురాలిని కూడా అతడు హత్య చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు మహిళల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రష్యా వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.