చైనా మార్కెట్లో షియోమీ కంపెనీ షియోమీ ప్యాడ్ 9, షియోమీ ప్యాడ్ 9 ప్రో మోడళ్లను కొత్త టాబ్లెట్లను విడుదల చేసింది. ఈ రెండు టాబ్లెట్లు 3.2K రిజల్యూషన్ డిస్‌ప్లే, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రాసెసింగ్ కోసం రెండు మోడళ్లలోనూ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను అందించారు. HyperOS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇవి పనిచేస్తాయి. షియోమీ ప్యాడ్ 9 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.42,800)గా నిర్ణయించారు. 8GB + 256GB మోడల్ ధర CNY 3,299 (సుమారు రూ.47,000), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB స్టోరేజ్‌తో వచ్చే Soft-Light Edition ధర CNY 3,499 (సుమారు రూ.49,900). ఈ టాబ్లెట్ సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్, ఐస్ పీచ్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9ప్రో 8GB + 128GB బేస్ వేరియంట్ ధర CNY 3,799 (సుమారు రూ.54,000). 8GB + 256GB మోడల్ ధర CNY 4,099 (సుమారు రూ.58,500), 12GB + 256GB ధర CNY 4,599 (సుమారు రూ.65,600), 16GB + 256GB వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ.71,300)గా ఉంది. 12GB + 256GB Soft-Light Edition ధర CNY 4,799 (సుమారు రూ.68,400). ఇది సిల్వర్, క్లౌడ్ సీడార్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 12.5 అంగుళాల 3.2K డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 12GB, 16GB వేరియంట్లలో 9,600Mbps వేగంతో LPDDR5T RAM, 8GB వేరియంట్‌లో 8,533Mbps LPDDR5X RAM ఉంటుంది. 128GB మోడల్‌లో UFS 3.1 స్టోరేజ్, మిగిలిన వేరియంట్లలో UFS 4.1 స్టోరేజ్ అందించారు. షియోమీ ప్యాడ్ 9 లో 11.2 అంగుళాల 3.2K డిస్‌ప్లే ఉంటుంది. 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి Snapdragon 8s Gen 4 చిప్‌సెట్‌ను అందించారు. షియోమీ ప్యాడ్ 9 ప్రో లో భారీ 11,000mAh బ్యాటరీ ఉంది. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. షియోమీ ప్రకారం షార్ట్-వీడియో ప్లేబ్యాక్‌లో 14.5 గంటలు, ఆన్‌లైన్ మీటింగ్స్‌లో 20 గంటల వరకు బ్యాకప్ లభిస్తుంది. షియోమీ ప్యాడ్ 9లో 9,720mAh బ్యాటరీను అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోడల్ కూడా షార్ట్-వీడియో ప్లేబ్యాక్‌లో 14.5 గంటలు, ఆన్‌లైన్ మీటింగ్స్‌లో 20 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. రెండు టాబ్లెట్లలోనూ Xiaomi HyperOS 4 ఉంటుంది. PC-స్థాయి ప్రొడక్టివిటీ కోసం WPS for Pad, Jianying Pro, PixelCake, ZWCAD, CAJ Reader వంటి యాప్స్‌కు సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా కంపెనీకి చెందిన Super XiaoAI 2.0 AI అసిస్టెంట్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.
3
Beranda › Posts filed under 000 nits
Showing posts with label 000 nits. Show all posts
Showing posts with label 000 nits. Show all posts
ఫ్లిప్‌కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 10పై డిస్కౌంట్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'పిక్సెల్ 10' పై భారీగా ధర తగ్గించింది. అద్భుతమైన ఏఐ ఫీచర్లు, అదిరిపోయే కెమెరా పెర్ఫార్మెన్స్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.79,999 లాంచ్ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. కానీ ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.57,999కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా రూ.22 వేల తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.7,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా ఈ ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. గూగుల్ సొంతంగా తయారు చేసిన లేటెస్ట్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 6.3 ఇంచుల యాక్చువా OLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి.. స్క్రీన్ చాలా స్మూత్‌గా, బ్రైట్‌గా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. దీని వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. 4970mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది 30W వైర్డ్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Pixel 10 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే నీరు, ధూళి నుండి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. గూగుల్ క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవంతో పాటు దీనికి సుదీర్ఘ కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను కూడా అందించనుంది.
ముంబై లోకల్ ట్రైన్‌లో డోరు మూసే విషయంలో గొడవ : అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపిన దుండగుడు
ముంబై లోకల్ ట్రైన్‌లో డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.చుట్టూ జనం ఉండగానే అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు. హత్య అనంతరం దర్జాగా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మయాంక్ లోహార్ మంగళవారం రాత్రి చర్చ్‌గేట్ నుంచి నల్లసోపారా వెళ్లే లోకల్ ట్రైన్ ఎక్కాడు. గోరేగావ్ - కందివాలి మధ్యలో తోటి ప్రయాణికుడితో మయాంక్‌కు గొడవైంది. వర్షం పడుతుండటంతో డోరు క్లోజ్ చేసే విషయంలో ఈ గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి మయాంక్‌పై కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మయాంక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ఏడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ సంఘటనపై బోరివాలి రైల్వే పోలీస్ అధికారి దత్త ఖుప్రేకర్ మాట్లాడుతూ.. 'వర్షం పడుతుండగా డోరు మూసే విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు' అని చెప్పుకొచ్చారు. ఇక, సోషల్ మీడియాలో సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జనం.. 'ఇతడు అతడిని చంపేశాడు. చంపేశాడు' అంటూ అరుస్తున్నారు. డోరు దగ్గర మయాంక్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది.
Subscribe to:
Posts (Atom)