About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label "Mark BJP-berg". Show all posts
Showing posts with label "Mark BJP-berg". Show all posts

'మెటా, బీజేపీ కా బేటా' : కర్ణాటక యూత్ కాంగ్రెస్ వినూత్న రీతిలో బ్యానర్ క్యాంపెయిన్

'మెటా' రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కర్ణాటక యూత్ కాంగ్రెస్ వినూత్న రీతిలో బ్యానర్ క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి మరియు విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడంలో మెటా విఫలమైందని ఆరోపిస్తూ బెంగళూరు నగరంలో భారీ హోర్డింగులను ఏర్పాటు చేసింది. 'మెటా, బీజేపీ కా బేటా' అనే పేరుతో చేపట్టిన ఈ ప్రచారంలో భాగంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ రహదారిలోని సదహళ్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) దుస్తులైన ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా, నల్ల టోపీ మరియు నుదుటన తిలకంతో చిత్రీకరించారు. పక్కనే మెటా లోగో, హోలోగ్రామ్‌ను ఉంచారు. జుకర్‌బర్గ్‌ను 'మార్క్ బీజేపీ-బర్గ్'  అని అభివర్ణిస్తూ, 'మెటా, బీజేపీ కా బేటా' అనే నినాదాన్ని ఈ పోస్టర్లపై ముద్రించారు. కేంద్రంలోని అధికార పార్టీకి మెటా తొత్తుగా మారిందని ప్రజలకు తెలియజేయడానికే ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు యూత్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి మెటా నాయకత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వారు మండిపడ్డారు. ప్రముఖులు, వాహనదారులు నిత్యం రద్దీగా తిరిగే ఎయిర్‌పోర్ట్ రోడ్డులోని చిక్కజాల తదితర ప్రాంతాల్లో కూడా ఈ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మాతృసంస్థ అయిన మెటాపై కాంగ్రెస్ చేపట్టిన ఈ విమర్శలపై అటు బీజేపీ గానీ, ఇటు మెటా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read More...