హైదరాబాద్ లోని గచ్చిబౌలి మెన్స్ పీజీ హాస్టల్‌లో ఈగల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మందికి డ్రగ్ టెస్టులు చేయగా ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది. పీజీ హాస్టళ్లే కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న అనుమానాలతో అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సెలింగ్‌తో పాటు, నిబంధనల ప్రకారం కేసుల నమోదుపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు.
3
Beranda
› crime
› Six Individuals Test Positive for Ganja
› Surprise Inspections by 'Eagle' Officials at a Gachibowli PG Hostel
› two of these individuals are software engineers has drawn significant attention
› గచ్చిబౌలి పీజీ హాస్టల్‌పై ఈగల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు : ఆరుగురికి గంజాయి పాజిటివ్
Subscribe to:
Post Comments (Atom)
