రేణుకాస్వామి హత్యకేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ప్రత్యక్షసాక్షుల్లో ఒకరు కోర్టులో మాట మార్చారు. పట్టణగెరె షెడ్‌లో జరిగిన ఘటనకు తాను ప్రత్యక్షసాక్షిని కాదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న నటి పవిత్రాగౌడ బెయిల్ కోసం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసు విచారణ బెంగళూరులోని 59వ సీసీహెచ్ కోర్టులో కొనసాగుతోంది. మంగళవారం జరిగిన విచారణకు పట్టణగెరె షెడ్‌లో పనిచేసే మల్లికార్జున హాజరయ్యారు. అయితే కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో షెడ్‌లో ఏం జరిగిందో తాను చూడలేదని తెలిపారు. గతంలో పోలీసుల విచారణ సందర్భంగా మల్లికార్జున ఇచ్చిన వాంగ్మూలానికి, ప్రస్తుతం కోర్టులో చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనను ప్రతికూల సాక్షిగా ప్రకటించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇప్పటికే ఈ కేసులో సెక్యూరిటీ గార్డు నరేంద్రసింగ్ కూడా నిందితులను గుర్తుపట్టలేనని కోర్టుకు వెల్లడించారు. తాజాగా షెడ్‌లో పనిచేసే మల్లికార్జున సైతం అదే తరహాలో వాంగ్మూలం ఇవ్వడం విచారణలో చర్చనీయాంశంగా మారింది. వరుసగా సాక్షులు తమ గత వాంగ్మూలాలకు భిన్నంగా మాట్లాడుతుండటం ప్రాసిక్యూషన్‌కు సవాలుగా మారింది.
3
Beranda › Posts filed under actress Pavithra Gowda
Showing posts with label actress Pavithra Gowda. Show all posts
Showing posts with label actress Pavithra Gowda. Show all posts
Subscribe to:
Posts (Atom)
