అన్డ్రెస్సింగ్ యాప్స్‌కు పెరుగుతున్న డిమాండ్ !
ఫొ టోల్లో మహిళల దుస్తులను తొలగించే ఏఐ ఆధారిత యాప్స్, వెబ్‌సైట్స్‌కు యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని సోషల్ నెట్వర్క్ ఎనాలసిస్ కంపెనీ గ్రాఫికా రీసెర్చ్‌లో తేలింది. ఒక్క 2023 సెప్టెంబర్‌లోనే ఈ తరహా వెబ్‌సైట్స్‌ని ఏకంగా 24 మిలియన్ మంది వాడినట్టు ఓ నివేదికను ప్రచురించింది గ్రాఫికా. నివేదిక ప్రకారం.. ఇలాంటి న్యూడిఫై యాప్స్, వెబ్‌సైట్స్ మార్కెటింగ్, ప్రొమోషన్ కోసం ప్రముఖ సోషల్ మీడియా సైట్స్‌ని వాడుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో.. అన్డ్రెస్సింగ్ యాప్స్ లింక్స్‌కు చెందిన యాడ్లు ఈ ఏడాది నుంచి ఇప్పటివరకు 2,400శాతం పెరిగాయి! ఏదైనా ఫొటోను అప్లోడ్ చేస్తే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుకుని, అందులోని వ్యక్తిని న్యూడ్‌గా చూపిస్తున్నాయి ఈ యాప్స్, వెబ్‌సైట్స్. వీటిల్లోని చాలా వరకు యాప్స్ కేవలం మహిళల ఫొటోలను తీసుకునే విధంగా రూపొందించడం జరిగింది! డీప్‌ఫేక్, డీప్‌ఫేక్ పార్నోగ్రఫీపై ఇప్పటికే సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ఇలాంటి యాప్స్ మరింత తలనొప్పిగా మారాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్న కొద్ది, ఆన్లై...