Posts

Showing posts with the label Argentine Football Legend Antonio Ubaldo Rattin Passes Away

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ఆంటోనియో ఉబాల్డో రాటిన్ కన్నుమూత

Image
అ ర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) ఆదివారం కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్‌ కీలక పాత్ర పోషించారు. అయితే ఆదివారం ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆంటోనియో మృతి పట్ల అర్జెంటీనా జట్టు సంఘీభావం ప్రకటించి ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. 1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జర్మన్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బలవంతంగా మైదానం నుంచి బయటకు పంపడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ సమయంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడకుండా తనకు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిరసనకు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో మరుసటి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లక...