Posts

Showing posts with the label corporate school in Anantapur

రెండవ తరగతి చిన్నారిపై అఘాయిత్య యత్నం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని అనంతపురం కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో ఎల్లప్ప 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ సదరు వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఫోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.