2026-27 ఆర్థిక సంవత్సరానికి టాటా ట్రస్ట్స్ దాతృత్వ వ్యయం రూ. 2 వేల కోట్లకు పెంపు : టాటా ట్రస్ట్స్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ
టాటా గ్రూప్, హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణించిన తర్వాత గతితప్పిందన్న వార్తలు వచ్చాయి. గ్రూప్‌కు చెందిన పలు సంస్థల్లో లాభాదాయాలు తగ్గడం, షేర్ల విలువలు భారీగా పడిపోవడంతో మార్కెట్ విలువ పతనం కావడం జరిగాయి. తర్వాత ఇటీవల మాత్రం కొంత కాలంగా టాాటా ట్రస్టులో విభేదాలు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అంతర్గత విభేదాల నేపథ్యంలో టాటా సన్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ట్రస్టీల మధ్య అభిప్రాయ భేదాలు కూడా బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా వీటి గురించి టాటా ట్రస్ట్స్ సీఈఓ సిద్ధార్థ్ శర్మ మాట్లాడుతూ 'మా గురించి అంతా వివాదాలు, గందరగోళం గురించే మాట్లాడుతున్నారు. కానీ అసలు మా టాటా ట్రస్ట్స్ పనేంటనేది మర్చిపోతున్నారు. మా లక్ష్యం దాతృత్వం, సమాజ సేవ.' అని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. వాస్తవాల్ని పూర్తిగా పరిశీలించకుండానే చాలా కథనాలు ప్రచారం అవుతున్నాయని.. టాటా ట్రస్ట్స్ మాత్రం ఎప్పటిలానే సమాజంలో అట్టడుగు వర్గాల వారి కోసం సేవ చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి ప్రచారం, హడావుడి/ఆర్బాటం లేకుండా కఠోర శ్రమతో పని చేయడమే తమ పద్ధతి అని, దీనికి బయటినుంచి వచ్చే విమర్శలతో పని...