Posts

Showing posts with the label 000 MW will be developed

పీఎం-ఎస్‌ఎస్‌వైకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం : రూ.5,070 కోట్లు కేటాయింపు

Image
ప్ర ధానమంత్రి నరేంద్ర మోడీ  అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 'ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన' (పీఎం-ఎస్‌ఎస్‌వై)కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు రూ.5,070 కోట్లు ఖర్చు చేయనుంది. చెరువులు, సరస్సులు, జలాశయాల ఉపరితలంపై భారీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీంతో పాటు, 10,000 మెగావాట్-గంటల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టులను 2026- 2027 నుంచి 2030- 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆమోదించబడతాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయ పంపిణీ 2033 వరకు కొనసాగుతుంది. తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్లు అంటే భూమిపై కాకుండా, సరస్సు, ఆనకట్ట, జలాశయం లేదా చెరువు ఉపరితలంపై ఏర్పాటు చేయబడిన సౌర విద్యుత్ ప్లాంట్లు. దీనివల్ల భూమి అవసరం తగ్గి, అందుబాటులో ఉన్న నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. విజయ...