Posts

Showing posts with the label AR Sub-Inspector Attempts Suicide by Shooting Himself with AK-47

ఏకే47తో కాల్చుకుని ఏఆర్ ఎస్సై ఆత్మహత్యాయత్నం

Image
ఆం ధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ తీవ్ర మనోవేదనకులోనై ఆత్మహత్యాయత్నంపాల్పడినట్లుగా తెలుస్తోంది. స్టేషన్ ప్రాంగణంలోనే ఆయన ఏకే47తో సెల్ఫ్ షూట్ చేసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ప్రమాదంలో తుపాకీ నుంచి పేలిన బుల్లెట్లు ఆయన ఛాతి భాగంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయారు. కాల్పుల శబ్దం విని వెంటనే అప్రమత్తమైన తోటి పోలీస్ సిబ్బంది, సహచర అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సత్యనారాయణను హుటాహుటిన సమీపంలోని అరకు వ్యాలీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.