Posts

Showing posts with the label Centre Launches New Incentive Scheme

ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు : కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన కేంద్రం

Image
దే శంలో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2026 సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలకు తక్కువ ధరకు లభించే దేశీయ గ్యాస్‌ను అదనంగా కేటాయించనున్నారు. దీంతో ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం కంపెనీలకు మరింత ఆకర్షణీయంగా మారనుంది. ప్రభుత్వం నిర్దేశించిన కనీస స్థాయిని మించి కొత్తగా బిల్లు అయ్యే ప్రతి దేశీయ పీఎన్జీ కనెక్షన్‌కు 200 స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల అదనపు ఏపీఎం గ్యాస్‌ను అర్హత ఉన్న  సీజీడీ సంస్థలకు కేటాయించనున్నారు. అయితే కేవలం పైప్‌లైన్‌ వేసి మీటర్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రయోజనం లభించదు. వాస్తవంగా గ్యాస్‌ వినియోగించి బిల్లు వచ్చే కనెక్షన్ల సంఖ్య పెరిగినప్పుడే కంపెనీలకు ఈ అదనపు గ్యాస్‌ కేటాయింపు వర్తిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల కాలంలో రెండు విడతలుగా అమలు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని సీజీడీ సంస్థలు తమ అవసరాల్లో కొంత భాగాన్ని ఖరీదైన ఎల్ఎన్జీ ద్వారా భర్తీ చేస్తున్నాయి. కొత్త పథకం కింద లభించే తక్కువ ధర దేశీయ గ్యాస్‌ను ఎల్ఎన్జీకి ప్రత్యామ్నాయంగా ఉ...