November 2025

రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం పార్లమెంట్‌ను నియంత్రించాలని చూస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అఖిలపక్ష సమావేశంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల భద్రత, ఢిల్లీ పేలుడు, విదేశాంగ విధానాలు, ఆర్థిక పర్యావరణ భద్రత వంటి కీలక అంశాలపై చర్చకు ఈ సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరోవైపు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. వీటిలో అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచే అణుశక్తి బిల్లు 2025, ఉన్నత విద్యలో పర్యవేక్షణ కోసం ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు 2025 వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ఈ స్వల్పకాలిక సమావేశాలు.. శాసనపరమైన ఆశయాలు, రాజకీయ ఘర్షణల మధ్య ఉత్కంఠగా సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్ సహా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున జైరామ్ రమేష్, గౌరవ్ గొగోయ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా వంటి నేతలు హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణలకు సంబంధించిన వాటిపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతదేశ విదేశాంగ విధానం ఇతర దేశాల ప్రభావంతో రూపొందించబడుతోందనే ఆందోళనలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఆరోగ్య భద్రతపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరితో పాటు మరి కొందరుకాంగ్రెస్ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో సోనియా, రాహుల్‌ గాంధీతో పాటు మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సుమన్‌ దూబే, శ్యామ్‌ పిట్రోడా ఉన్నారు. అంతేకాకుండా యంగ్‌ ఇండియా సంస్థ, డోటెక్స్ మెర్చండైజ్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) తదితర సంస్థలతో పాటు డోటెక్స్ ప్రోమోటర్ సునిల్ భండారిపై కూడా ఎఫ్ఐఆర్‌లో అభియోగాలు మోపారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, ఆస్తుల దుర్వినియోగం మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి.. ఈడీ పీఎమ్ఎల్ఏ చట్టంలోని సెక్షన్ 66(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. నిందితులందరూ కుట్రపూరితంగా కేవలం రూ. 50 లక్షలు మాత్రమే చెల్లించి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ. 2వేల కోట్ల విలువైన ఆసులపై అధికారాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. అయితే నిందితుల్లో మోతీలాల్‌ వోరా 2020లో మృతిచెందారు, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ 2021లో మరణించిన విషయం తెలిసిందే. కాగా, అసోసియేటెడ్‌ జర్నలిస్ట్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను.. కాంగ్రెస్‌ పార్టీ రూ. 90 కోట్ల లోన్ అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుంది. అయితే రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా.. కేవలం రూ. 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఛార్జిషీట్‌లో ఈడీ ఆరోపించింది. అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని పేర్కొంది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు.. డిసెంబర్ 16కు వాయిదా వేసింది. ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ. 2 వేల కోట్లు విలువైన ఆస్తుల్ని.. నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. తమపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని నిందితులు వాదిస్తున్నారు. ఏజేఎల్‌ను యంగ్‌ ఇండియన్‌ సంస్థ విలీనం చేసుకోవడం.. నేషనల్‌ హెరాల్డ్‌ సంస్థను పునరుద్ధరించేందుకేనని చెబుతున్నారు. అంతేకాకుండా, ఈడీ.. బీజేపీ కూటమి పార్టనర్ అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2014 జూన్‌లో ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తమిళనాడు ''రాజ్ భవన్'' పేరును ''లోక్ భవన్''గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు. దీనిపై స్టాలిన్ మాట్లాడుతూ ఈ సమస్య పేర్ల గురించి కాదని, ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం గురించి అని అన్నారు. ఈ పేరు మార్పులు అనవసరమని చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల అధకారాన్ని గౌరవించడంలో నిజమైన జవాబుదారీతనం ఉందని చెప్పారు. పేరు మార్చడం మనస్తత్వాన్ని మార్చడం కంటే ముఖ్యమైంది కాదు. శాసన సభ ప్రజల సభ. శాసనసభను గౌరవించని వారు, లోక్‌ భవన్‌గా పేరు మార్చడం కంటితుడుపు చర్య అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే సార్వభౌమ శాసనసభను గౌరవించడం ఈ కాలపు అవసరమని ఆయన అన్నారు. ఆలోచనలు, చర్యల్లో మార్పు లేకపోతే, ఇది కూడా అనవసరం అని అన్నారు. శాసనసభ పాత్రను సమర్థించని వారు గవర్నర్ నివాసం పేరు మార్చితే లాభమేంటని అన్నారు. తమిళనాడుకు ముందు, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ శనివారం కోల్‌కతాలోని రాజ్ భవన్ పేరును మార్చాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాన్ని అమలు చేశారు. డార్జిలింగ్ నివాసాన్ని లోక్ భవన్‌గా మార్చారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారానికి అనుగుణంగా పేరు మార్పు ఉత్తర్వులు అమలులోకి వచ్చాయి. 

ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడడం వంటి వాటి వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 442కి పెరిగింది.  ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. ఇంటర్నెట్, విద్యుత్ కూడా కొంతవరకు మాత్రమే పనిచేస్తున్నాయి. సెన్‌యార్ తుపాను వల్ల ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి, వేలాది భవనాలు మునిగిపోయాయి. ప్రవాహం చాలా వేగంగా వచ్చింది, కొన్ని సెకన్లలోనే వరద ఇళ్లలోకి చేరింది” అని ఆచె ప్రావిన్స్‌కు చెందిన అధికారులు అన్నారు. వరదల వల్ల తమ ఇంట్లోని అన్ని వస్తువలనూ కోల్పోయామని కొందరు చెప్పారు. లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వందలాది మంది ఇంకా వరదల్లోనే ఇరుక్కుపోయారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యంత ప్రభావిత ప్రాంతమైన టపనులిలో ఆహారం కోసం ప్రజలు దుకాణాలను దోచుకున్నట్టు తెలుస్తోంది.

ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎస్‌టీసీ)లో  అదానీ గ్రూప్‌ 72.8 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఏడీఎస్‌టీఎల్‌), దానికి 50 శాతం వాటాలున్న హొరైజన్‌ ఏరో సొల్యూషన్స్‌ (హెచ్‌ఏఎస్‌ఎల్‌) సుమారు రూ. 820 కోట్లు వెచ్చించనున్నాయి. ఎఫ్‌ఎస్‌టీసీకి హైదరాబాద్‌తో పాటు గురుగ్రామ్‌లో సిమ్యులేషన్‌ సెంటర్లు ఉన్నాయి. హర్యానాలోని భివాని, నార్నౌల్‌లో ఫ్లయింగ్‌ స్కూల్స్‌ నిర్వహిస్తోంది. సంస్థ 11 అధునాతన ఫుల్‌ ఫ్లయిట్‌ సిమ్యులేటర్లు, 17 ట్రైనింగ్‌ విమానాలు ఉన్నాయి. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్సులకు శిక్షణ, ప్రత్యేక నైపుణ్యాల కోర్సులను అందిస్తోంది.

తెలంగాణాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 2017-18 నుంచి 2023-24 వరకు మహిళా శ్రామికశక్తి 22 శాతం నుంచి 40.3 శాతంకు గణనీయంగా పెరుగుదల నమోదు చేసిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళా శ్రామికశక్తి 52.7 శాతంగా ఉందని, ఇది జాతీయ సగటు 45.2 శాతం కంటే అధికమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహిళా స్టార్టప్స్‌ను గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌గా తీర్చిదిద్దేందుకు 'వీ హబ్ 2.0' రూపకల్పన చేస్తున్నామన్నారు. స్కిల్స్, టెక్నాలజీ, ఫైనాన్స్, మార్కెట్, మెంటార్షిప్ ఆల్ ఇన్ వన్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి చెప్పారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధే సమాజ ప్రగతికి మార్గం చూపుతుందని ఈ సందర్బంగా శ్రీధర్ బాబు పేర్కొన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కూడా మంత్రి పేర్కొన్నారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

తమిళనాడులో ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్‌ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సుల్లో మృతదేహాలను వెలికితీస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నార్త్ ఇండియాలో ఉంటున్న ముగ్గురికి ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు  ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒకరిని పంజాబ్‌కు చెందిన హరగుణ్‌ప్రీత్ సింగ్‌గా, రెండవ వ్యక్తిని మధ్యప్రదేశ్‌లోని దాటియాకు చెందిన వికాస్ ప్రజాపతిగా, మూడవ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ఆరిఫ్‌గా గుర్తించారు. 'పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షెహజాద్ భట్టి నేతృత్వంలోని టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్టు చేశాం' అని అడిషనల్ ఎస్పీ (స్పెషల్ సెల్) ప్రమోద్ కమార్ కుష్వాహ తెలిపారు. 'అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు ఈనెల 25న గురుదాస్‌పూర్ సిటీ పోలీస్ స్టేషన్ ముందు హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. షెహజాద్ భట్టి ఈ దాడిని నిర్వహించాడు. పలు ప్రాంతాను టార్గెట్ చేసుకుని వీడియోగ్రఫీ, రెక్కీ జరిపి హ్యాండ్ గ్లనేడ్లు విసరుతుండం ఈ గ్రూప్ చేస్తుంటుంది' అని కుష్వాహ వివరించారు. కాగా, పాకిస్థాన్ బేస్ట్ టెర్రర్ మాడ్యూల్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించడం గత రెండు నెలల్లో ఇది రెండవది. సెప్టెంబర్‌లో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి దేశంలో కీలక దాడులకు ప్లాన్ చేసిన టెర్రర్ మాడ్యూల్‌ గుట్టురట్టు చేసింది.

అధిక పన్నుల కారణంగా అమెరికాకు భారత ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. మే నెలతో పోలిస్తే అక్టోబర్‌లో అమెరికాకు భారత్ ఎగుమతులు 28.5 శాతం మేరకు తగ్గిపోయినట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు 8.83 బిలియన్ డాలర్లు (రూ.78, 500 కోట్లు) నుంచి 6.31 బిలియన్ డాలర్లు (రూ.56, 000 కోట్లు)కు తగ్గిపోయాయి. భారత దేశ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పది శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత సుంకాలు పెంచుకుంటూ పోయి ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి పెంచారు. దీంతో అమెరికాకు భారత్ ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అలాగే పలు ఇతర దేశాలపై కూడా అమెరికా భారీగా సుంకాలు విధించింది. చైనాపై 30 శాతం, జపాన్ 15 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కాగా, రొయ్యలు, రత్నాలు, ఆభరణాలు, ఆటో భాగాలు, విద్యుత్ యంత్రాలు వంటి అనేక ఉత్పత్తి వర్గాలు తమ ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని ఇతర ఆసియా, యూరోపియన్ మార్కెట్లకు మళ్లించాయి. గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్‌లో అమెరికాకు రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 76 శాతం క్షీణించాయి. అయితే వేరే మార్కెట్లను ఎంచుకోవడంతో మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులు స్వల్పంగా 1.5 శాతం మాత్రమే తగ్గాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎగుమతులు 79 శాతం, హాంకాంగ్‌కు 11 శాతం, బెల్జియంకు 8 శాతం పెరిగాయి. అయితే ఇతర ఆసియా దేశాలు గట్టి పోటీ ఇస్తున్న రంగాలైన కాటన్ దుస్తులు, క్రీడా వస్తువులు, కార్పెట్‌లు, తోలు పాదరక్షలు వంటి విభాగాలు ఎక్కువ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. 

అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లను సైతం జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో అనుమానాలు పెరిగాయి. ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ఎక్కడున్నారు? అసలాయన బతికే ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలపై ఆయన పార్టీకి చెందిన సెనేటర్ ఖుర్రం జీషన్ స్పందించారు. ఇమ్రాన్ బతికే ఉన్నారని ఆయన అన్నారు. ఇమ్రాన్ ను అడియాలా జైల్లో ఉంచారని తెలిపారు. దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెచ్చేందుకే పాక్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇమ్రాన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయన ఫొటోలు, వీడియోలను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. “ఇమ్రాన్ ఖాన్ జనాదరణ చూసి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇమ్రాన్ బతికే ఉన్నారని, జైల్లో క్షేమంగా ఉన్నారని మాకు హామీ లభించింది” అని ఖుర్రం జీషన్ తెలిపారు. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో హత్య చేశారంటూ అఫ్గానిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి వార్తలు వ్యాపించాయి. ”కోర్టు ఆదేశాలున్నా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అధికారులు నెల రోజులుగా అనుమతించడం లేదు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకత్వం, న్యాయవాదులకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే. నిబంధనలు బేఖాతరు చేయడమే. దేశం విడిచి వెళ్లి, నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ఆయనతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ అలాంటి వాటికి ఎప్పటికీ అంగీకరించరు. జైల్లో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. యువతలో ఆయనకు బలమైన మద్దతు ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఒక్క ఫోటో.. పాకిస్తాన్ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయగలదు. అందుకే ప్రభుత్వం భయపడుతోంది. ఈ కారణంగానే ఇమ్రాన్ జైల్లో ఉన్నప్పటి నుండి ఆయన ఫోటో బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది” అని జీషన్ తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సచివాలయంలో “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌పై లోతైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విజన్ డాక్యుమెంట్ పాలసీని డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌లోనే ‘తెలంగాణ విజన్ 2047’ పాలసీని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా, మొదటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రెజెంట్ చేయడంతో పాటు, అన్ని వర్గాలకు, రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రెండవ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యం తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల బడ్జెట్ స్థాయికి చేర్చడం. ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ ఏ రంగాలను (పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, ఫార్మా వంటివి) ప్రోత్సహించాలి, కొత్త విధానాలను ఎలా అమలు చేయాలి అనే అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమీక్షలో లోతుగా చర్చించారు.

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్‌ నమోదు చేసింది. టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎనుచుకుంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ (18) నిరాశపరచగా రోహిత్‌ శర్మ అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు. రోహిత్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రెండో వికెట్‌కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి, ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించిన కోహ్లి నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో రికెల్టన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా, రుతురాజ్‌ గైక్వాడ్‌ (8), వాషింగ్టన్‌ సుందర్‌ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్‌ 349 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్‌ విధించింది.

సినిమాలో కంటెంట్ ఉంటే అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరు. అలా చాలా చిన్న సినిమాలు ఎలాంటి హడావుడి, హంగూ ఆర్భాటం లేకుండా సైలెంట్‌ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఇప్పుడు గుజరాత్ లో ఓ చిన్న సినిమా కూడా అలాంటి విధ్వంసమే సృష్టిస్తోంది. రిలీజై 50 రోజుల కావొస్తున్నా రూ. 100 కోట్ల కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే.. దర్శకుడు తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ఎవరినీ అడిగినా గుజరాతీ సినిమా 'లాలో' గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీకి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు.. తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. గతనెల అంటే అక్టోబర్ 10న చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. మెల్లగా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

మహారాష్ట్ర లోని నాందేడ్‌లో ''పరువు హత్య'' సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్‌బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంచల్, సాక్షం టేట్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆంచల్‌కు తన సోదరుల ద్వారా సాక్షం టేట్ పరిచయమ్యాడు. తరుచుగా సాక్షం టేట్ ఇంటికి వెళ్లే ఆంచల్ క్రమంగా అతడితో సంబంధాన్ని పెంచుకుంది. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ఆంచల్ కుటుంబం వీరి సంబంధాన్ని ఒప్పుకోలేదు. అనేక సార్లు బెదిరించినప్పటికీ ఆంచల్, సాక్షం టేట్‌తో తన ప్రేమను కొనసాగించింది. ఆంచల్ తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటుందనే విషయం తెలిసిన ఆంచల్ సోదరులు, తండ్రి సాక్షం టేట్‌ను తీవ్రంగా కొట్టి, తలపై కాల్చి, తలను రాయితో పగలగొట్టి చంపారు. అతడి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆంచల్, సాక్షం ఇంటికి వెళ్లి మృతదేహంపై ఉన్న పసుపు, కుంకుమను నుదుట పెట్టుకుని, ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత, తన జీవితాంతం సాక్షం ఇంట్లోనే కోడలిగా ఉండాలని నిర్ణయించుకుంది. సాక్షం మరణంలో కూడా తమ ప్రేమే గెలిచిందని, తన తండ్రి, సోదరులు ఓడిపోయారని చెప్పింది. తన ప్రియుడిని హత్యచేసిన వారికి ఉరిశిక్ష విధించాలని ఆంచల్ డిమాండ్ చేసింది. 

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ రీజియన్‌ దంతెవాడ జిల్లాలో ఇవాళ 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై రూ.65 లక్షల రివార్డు ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ అమలు చేస్తున్న 'పూనా మర్గం' ప్రచారానికి ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టులు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దంతేవాడ పోలీసులు పిలుపునిచ్చారు.తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న మావోయిస్టులు దంతెవాడలోని డీఆర్‌జీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

దిత్వా తుఫాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం మధ్యన తుపాను కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రస్తుతం ఉత్తర వాయవ్వ దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో దిత్వా తుఫాను తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దిత్వా తుపాను ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలు అయిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు తుపాను ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మధ్య కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవటంతో పాటుగా తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు దిత్వా తుపాను ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇక అత్యవసర సహాయం కోసం వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాలకు ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించారు. అలాగే వెంకటగిరిలో మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించారు. దిత్వా తుపాను ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తుపాను  సమయంలో విద్యుత్ సమస్యలు రాకుండా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. దిత్వా తుఫాను నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాను కారణంగా సోమవారం రోజున తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నడుమ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రోజున తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 

జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షడు మౌలానా మహమూద్ మదానీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మైనార్టీలపై అణచివేత జరిగితే భారత్‌లో జీహాద్ జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మైనార్టీ హక్కులను తక్కువ చేస్తోందని.. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటి తీర్పులు చూస్తే న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడి ఉందనిపిస్తోందని అన్నారు. రాజ్యాంగంలో మైనార్టీలకు పొందుపర్చిన హక్కులను బహిరంగంగా ఉల్లంఘించారన్నారు. ఈ మధ్య కాలంలో ఇలా మైనార్టీ హక్కులను తక్కువచేసే తీర్పులు చాలా వచ్చాయన్నారు. మైనార్టీల హక్కులు, న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మదానీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రార్థన స్థలాల చట్టం ఉన్నప్పటికీ కేసుల విచారణ తీరును మదానీ తప్పుపట్టారు. రాజ్యాంగాన్ని కాపాడుతున్నంతసేపు మాత్రమే సుప్రీంకోర్టు.. సుప్రీంగా (అత్యున్నతంగా) ఉంటుందని చెప్పారు. అలా జరగనప్పుడు అది సుప్రీం కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "సమాజంలో జీహాద్‌ను వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వం, మీడియా కలిసి ఈ పవిత్ర విధానాన్ని వక్రీకరిస్తున్నాయి. లవ్ జీహాద్, ల్యాండ్ జిహాద్, స్పిట్ జీహాద్.. వంటి పదాలను వాడటం తప్పు. జీహాద్ ఎప్పటికీ పవిత్రమైనదే. ఇతరుల మంచి కోసమే జీహాద్ జరుగుతుంది. అణిచివేయాలని చూస్తే జీహాద్ జరగక తప్పదు" అని మదానీ హెచ్చరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని కోతిగుట్టకు చెందిన వెంకటేష్‌ , శిల్ప భార్యాభర్తలు. వెంకటేష్‌ సైన్యంలో పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో శిల్ప పక్క గ్రామమైన నూనేవారిపల్లికి చెందిన కనకరాజు కుమారుడు ఎం.వెంకటేష్‌తో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త మిలటరీలో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంకటేష్‌ వీరి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్‌ ఉన్నట్టుండి గ్రామానికి వచ్చి భార్యను నిలదీసి గొడవపెట్టుకుని పెద్ద మనుషులకు చెప్పి ఇకనైనా సక్రమంగా ఉండాలని చెప్పి డ్యూటీకి వెళ్లిపోయాడు. అయితే తన భర్త ఉండగా వ్యవహారం కష్టమని భావించిన శిల్ప, ఆమె ప్రియు డు ఇద్దరూ కలిసి వెంకటేష్‌ ఇంటికి రాగానే చంపేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఆ మేరకు గత మేనెల 16న ఇంటికొచ్చిన భర్త వెంకటేష్‌ నిద్రిస్తుండగా భార్య కాచిన వేడి నూనెను భర్తపై పోసి అతను విలవిలలాడుతుండగా ప్రియుడితో కలిసి పారిపోయింది. దీనిపై అప్పట్లో పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వీరిని పట్ట ణ సమీపంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ స్వర్ణతేజ తెలిపారు. కాగా ఇన్ని రోజులుగా భర్త సీ.వెంకటేష్‌ కాలిన గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల కిందట ఆస్పత్రి నుంచి డిచార్జి అయి డ్యూటీకి వెళ్లిపోయాడు.

నదిలో లంగరు వేసిన కార్గో షిప్‌లోని కంటైనర్ అకస్మాత్తుగా తెరుచుకోవడం, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా ఐఫోన్‌లు ఉన్న పెట్టెలు నీటిలో పడటం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం సమీపంలోని గ్రామస్తులలో భయాందోళనలకు గురిచేసింది. దీన్ని చూసిన ప్రజలు తమ పడవలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐఫోన్ బాక్స్‌లతో నిండిన కంటైనర్‌ను గ్రామస్తులు సంకోచిస్తూ వాటిని తీసుకొని తమ పడవల్లోకి ఎక్కించుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నదిలో పడిపోతున్న బాక్స్‌లను కొంతమంది వంగి పట్టుకుంటున్నారు. మరికొందరు వాటిని నేరుగా కంటైనర్ నుండి బయటకు తీసి కిందకు తమ పడవలో వేసుకుంటున్నారు. ఈ వీడియోలో చాలా మంది హ్యాపీగా నవ్వుతూ ఐఫోన్ బాక్స్‌లను తీసుకోవటం కనిపిస్తోంది. కొందరు ఒకేసారి చాలా బాక్సులను పట్టుకుంటున్నారు. కొన్నింటిని పట్టుకోలేకపోతున్నారు. oye_sanki_1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే, ఈ వీడియో AI- జనరేటెడ్ అని చెప్పుకుంటున్నారు. కానీ, ఈ వీడియో మాత్రం ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్‌గా మారింది. నెటిజన్ల నుండి భిన్నమైన కామెంట్లు వచ్చాయి. ఒకరు దీనిపై స్పందిస్తూ బ్రదర్‌ దయచేసి నాకు కనీసం ఒకటైన ఇవ్వండి అని రాశారు. మరొకరు వావ్, మీరు బిలియనీర్ అయ్యారు అని రాశారు. మరొక దీనిపై స్పందిస్తూ మీకు ఎంత అదృష్టం ఉంది? అని రాశారు. వీడియో AI లాగా ఉంది అని కూడా చాలా మంది రాశారు.

నానో బనానా ఏఐ టూల్ వాడి ఫేక్ లీవ్ ను  తీసుకోవడం చర్చనీయమవుతోంది. ఓ ఉద్యోగి తన చేతి ఫొటోను తీసుకున్నాడు. ఆ చేతికి ఎలాంటి గాయాలు లేవు. లీవ్ తీసుకోవాలని అనుకున్న ఆ ఉద్యోగి తన చేతి ఫొటోకు గాయమైన ఫొటో ఇవ్వాలని జెమినై నానోలో అడిగాడు. దీంతో సెకండ్లలోనే అతడి చేతికి గాయమైన ఏఐ జనరేటేడ్ ఫొటో వచ్చేసింది. దీన్ని తన కంపెనీ హెచ్ఆర్    కు  పంపించి తాను బైక్ పై   నుంచి పడిపోయానని చెప్పాడు. ట్రీట్మెంట్ అవసరమని తెలిపాడు. ఇదిచూసి బాధపడ్డ హెచ్ ఆర్ వెంటనే అతడికి పెయిడ్ లీవ్ ఇచ్చాడు. అయితే ఆ ఉద్యోగి ఏఐ ఫొటోను పంపించాడని ఆ హెచ్ ఆర్ టీమ్ కూడా గుర్తించలేకపోయింది. ప్రస్తుతం ఏఐ వాడటం విపరీతంగా పెరిగిపోయింది. అనేకమంది ఏఐ ఫొటోలు, వీడియోలు జనరేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని చూస్తే కూడా నిజమే అని అనిపించేలా ఉంటున్నాయి. అయితే ఇలా ఉద్యోగులు, ఇతర వ్యక్తులు ఏఐని వాడి ఫేక్ గాయాలు, మెడికల్ రిపోర్టులు క్రియేట్ చేస్తే ఆయా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశీయ మార్కెట్లో రెనాల్ట్ కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26న అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు మరోసారి బలమవుతుందని అంచనా. కొత్త జనరేషన్ డస్టర్పూర్తిగా పాత మోడల్‌లోని మెకానికల్, డిజైన్ ఎలిమెంట్స్ ఏవీ ఇందులో కొనసాగించలేదు. ఇది సీఎంబీ-బీ ప్లాట్‌ఫామ్‌పై తయారు అవుతుంది. భారత్‌లోని ఒరగడం ప్లాంట్ లో దీనిని తయారు చేయనున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీలతో డస్టర్ భారత మార్కెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.  ప్రస్తుతం కిగర్ మాత్రమే ఉన్న రెనాల్ట్ SUV లైనప్‌లో డస్టర్ తిరిగి రావడం కంపెనీకి పెద్ద బూస్ట్‌గా మారనుంది. రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న కొత్త డిజైన్ (స్పై షాట్స్) ప్రకారం.. కొత్త డస్టర్ మరింత రగ్డ్, స్టైలిష్ రూపాన్ని దాల్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ డిసెంబరు 13 నుంచి 15 వరకు కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్‌ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు. ''ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్‌ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా, ఇప్పుడు హైదరాబాద్‌ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా'' అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ ''ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్‌ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్‌ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది'' అంటూ రేవంత్‌ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. కాగా మెస్సీ తన టూర్‌లో భాగంగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్‌ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్‌ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 

నోయిడాలో డిసెంబర్ 11న యాపిల్ స్టోర్ ను ప్రారభిస్తున్నట్లు యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్‌లెట్‌. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది. డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్ నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్,  బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.

రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌ వార్‌ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను థార్‌ వాహనంతో ఢీకొట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు ఆ ముగ్గురిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. బైక్‌ నుంచి కింద పడిన ఆ వ్యక్తులు పైకి లేచారు. తమ వద్ద ఉన్న గన్స్‌ తీసి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో థార్‌లోని వ్యక్తులు వెనక్కి తగ్గారు. ఇంతలో మారుతి స్విఫ్ట్‌ కారు ఆ ముగ్గురిపైకి దూసుకెళ్లగా వారు తప్పించుకున్నారు. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత థార్‌, స్విఫ్ట్‌ కారులోని వ్యక్తులు కిందకు దిగారు. రోడ్డు పక్కన పడి ఉన్న బైక్‌ను ఐరన్‌ రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం తమ వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్‌ వార్‌ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాల్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బైక్‌పై ఉన్న మహిపాల్ గుర్జార్, థార్‌లో ఉన్న వినోద్ పోస్వాల్ మధ్య పాత శత్రుత్వం ఉన్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన గ్యాంగ్‌ వార్‌కు కారణం ఏమిటన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రెండు గ్యాంగ్‌లకు చెందిన వారి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన గ్యాంగ్‌ వార్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పోస్టల్ శాఖ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కి ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ రేటు అందిస్తుంది. ఇది పోస్ట్ ఆఫీస్ పథకాలలో అత్యధిక రాబడిని అందిస్తున్న స్కీమ్. సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ ప్రత్యేక పొదుపు పథకం, త్రైమాసిక వడ్డీ చెల్లింపుల ద్వారా స్థిరమైన ఆదాయానికి భరోసా ఇస్తుంది. ఈ పథకం కింద, భార్యాభర్తలిద్దరూ కలిసి మొత్తం ₹22 లక్షలు (ఒక్కొక్కరు ₹11 లక్షలు) ఏకమొత్తంగా పెట్టుబడి పెడితే, వారికి ప్రతీ మూడు నెలలకు ₹45,100 వడ్డీ లభిస్తుంది. దీని అర్థం, వారికి సగటున నెలకు సుమారు ₹15,000 ఆదాయం వస్తుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంలో, ఈ దంపతులు వడ్డీ రూపంలో మొత్తం ₹9,02,000 సంపాదించవచ్చు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ పౌరుడైనా ఈ ఖాతాను తెరవవచ్చు మరియు కనిష్టంగా ₹1,000 నుండి గరిష్టంగా ₹30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి.గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు అనుమతించడం లేదు. తన తండ్రిని డెత్ సెల్‌లో ఉంచారని, ఆయన నుంచి ఎలాంటి కాల్స్ లేవని, ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని, ఆయన బతికి ఉన్నాడనే ఆధారాలు లేవని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల్ని జైలులోకి అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా అనేది తెలుసుకునేందుకు ఆయన కుటుంబం అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది. 845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం జైలులో ఉంచింది. ఆయనకు ఏదైనా జరిగితే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టబద్ధంగా, నైతికంగా, అంతర్జాతీయంగా జవాబుదారీగా ఉంటుందని కాసిం అన్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని ఆయన జీవించి ఉన్నాడనే రుజువు కోరాలని ఆయన కోరారు. దీనికి ముందు, ఇమ్రాన్ సోదరి నోరీన్ నియాజీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో చీకటి కాలం నడుస్తోందని విమర్శించారు. తన సోదరుడిని జైలులో కఠిన పరిస్థితుల్లో ఉంచారని, జైలు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఆమె అన్నారు. 

డిసెంబర్ 4-5 తేదీలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ శుక్రవారం ప్రకటనను విడుదల చేశాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆయనకు ఇది మొదటి పర్యటన కావడంతో ఈ భేటీ ఇండియాకు రక్షణ, ఇంధనం, దౌత్య రంగాలలో అనేక పెద్ద ప్రయోజనాలను అందించనుంది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా భారత్‌పై అదనపు టారిఫ్‌లు అమలు చేస్తోన్న వేళ పుతిన్ రాక ఉత్కంఠను సృష్టిస్తోంది. ప్రధాని మోడీ ఆహ్వానం వ్లాదిమిర్ పుతిన్ ఇండియాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ - పుతిన్ భేటీ కానున్నారు. పుతిన్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈక్రమంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన  టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం మేనేజ్‌మెంట్, సెలెక్టర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం వారికి మద్దతు తెలిపాడు. ప్రస్తుతం జట్టు సంధి దశలో ఉందని తెలిపారు. దాంతోనే ఆశించిన ఫలితం దక్కలేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదనే వాదనను తప్పుబట్టారు. కోహ్లీ, రోహిత్ జట్టులో ఉన్నా ఇదే ఫలితం పునరావృతమయ్యేదని నొక్కి చొప్పాడు.సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా రెండు సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లు రోహిత్, కోహ్లీ, అశ్విన్‌లను ఇంకొన్నాళ్లు జట్టులో కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వాదనను గవాస్కర్ తప్పుబట్టాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 3-0తో టీమిండియా క్లీన్ స్వీప్ అయిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా టీమిండియా ఓడిపోయిందని చెప్పారు. 'రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. బహుషా.. టీమ్‌మేనేజ్‌మెంట్ వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పవచ్చు. కానీ వారు జట్టులో ఉంటే భారత్ గెలిచేది అనే వాదన సరికాదు. ఎందుకంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయినప్పుడు వారు భారత జట్టులోనే ఉన్నారు. వారు ఉండగానే భారత్ 0-3తో చిత్తయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ సిరీస్ కోల్పోయింది. రిటైర్మెంట్ తీసుకునేలా చేశారా? అనే ఆలోచనే చేయవద్దు. అది సరైన పద్దతి కూడా కాదు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

విమానంలో శబరిమలకు వెళ్లే స్వాములు ఇరుముడిని తమతో పాటు తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చెక్‌ఇన్‌ లగేజీగా పంపేలా ఇంతకాలం ఉన్న ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కేబిన్‌ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లడానికి స్వాములకు వీలు కలగనుంది. తాజా నిర్ణయంతో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు, ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్‌లో తమతో పాటు తీసుకువెళ్ళవచ్చు. భక్తుల విశ్వాసానికి విలువ ఇస్తూ.. సంబంధిత భద్రతా శాఖలతో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. జనవరి 20వ తేదీ వరకు ఇది వర్తిస్తుందని అన్నారాయన. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లుకునే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి రావడం వల్ల భక్తులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. ఈ కారణంగానే చాలామంది స్వాములు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. అయితే భక్తుల ఇక్కట్ల నేపథ్యంలో ప్రత్యేక మినహాయింపు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక సడలింపు ఈ రోజు నుంచే (నవంబర్‌ 28, 2025) అమల్లోకి వస్తూ, మండల పూజల కాలం నుంచి మకర విలక్కు ముగిసే జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, భక్తులు సహకరించాలని పౌర విమానయాన విజ్ఞప్తి చేసింది. 

ఉత్పాదకతను పెంచుకోవడానికి, వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది. జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబుకు ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా? అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొందని శ్రీధర్ వెంబు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.

డీఆర్డీఓ యువ శాస్త్రవేత్తలు ఇద్దరు వారం వ్యవధిలో ఆకస్మిక మరణాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇద్దరూ యువకులు, ఆరోగ్యంగా ఉన్నారు..ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అకస్మాత్తుగా మృతి చెందడంపై డాక్టర్లకే అంతు చిక్కడం లేదు. గుండెపోటుతో మరణించి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినా ఆ లక్షణాలు చాలా తక్కువే అంటున్నారు డాక్టర్లు. పోస్ట్ మార్టమ్ రిపోర్టులు వస్తేగానీ ఏం తేల్చలేమని చెబుతున్నారు. డీఆర్డీఓ కీలక మిషన్లలో పనిచేస్తున్న ఈ ఇద్దరు సైంటిస్టుల మృతి ఇప్పుడు అంతుచిక్కని రహస్యంగా మారింది. లక్నోకు చెందిన 30 ఏళ్ల ఆకాష్ దీప్ గుప్తా డీఆర్డీఓ లో బ్రహ్మోస్ క్షిపణి మిషన్‌పై పని చేస్తున్నారు. పెళ్లై ఆరునెలలు అయింది. ఢిల్లీలో ఉంటున్న తల్లిదండ్రులను చూసేందుకు వచ్చి నవంబర్ 21న ఉన్నట్టుండి ఇంట్లోనే అనారోగ్యం పాలయ్యాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇంకొకరు ఢిల్లీ అల్వార్ కు చెందిన ఆదిత్య వర్మ. నవంబర్ 27న అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. పెళ్లైన రెండు రోజులే అయింది.  కొత్త జంట హానీమూన్ ప్లాన్ చేసుకున్నారు. టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని ఆదిత్య కుటుంబం తెలిపింది. మరో రెండు రోజుల్లో హానీమూన్ వెళ్లనున్న ఆదిత్యవర్మ ఆకస్మాత్తుగా విగతజీవిగా మారాడు. ఇద్దరి మరణాలు దాదాపు ఒకేరకంగా సంభవించాయి. కుటుంబ సభ్యులు గుండెపోటు తో మరణించి ఉండొచ్చు అని చెబుతున్నా డాక్టర్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే సరియైన కారణాలు చెప్పగలం అని చెబుతున్నారు.

బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం అమెరికాలోనే ప్రారంభమైంది. అక్కడ ఈ రోజును ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఓ రకంగా దీనిని థాంక్స్ గివింగ్ డే తర్వాత వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఈ విధంగా చూస్తే ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే నవంబర్ 28వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచే క్రిస్మస్ షాపింగ్ మొదలవుతుందని వారు నమ్ముతారు. ఈ అవకాశాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవడానికి షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. మొదట్లో బ్లాక్ ఫ్రైడేను అమెరికాలో మాత్రమే జరుపుకునేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇతర దేశాలలో కూడా దీని క్రేజ్ పెరిగింది. ఇ-కామర్స్ వెబ్ సైట్లు ఈ క్రేజ్ ను  పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాయి. అందుకే దీనిని ఇతర దేశాలలో కూడా జరుపుకోవడం ప్రారంభించారు. బ్లాక్ ఫ్రైడే అనే పేరు వినగానే ఇది చెడు లేదా దురదృష్టకరమైన రోజుగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లను చూస్తే అలా అనిపించదు. కానీ ఈ పేరు పెట్టినప్పుడు నిజంగానే దీనిని బ్లాక్ డేగా భావించి పెట్టారట. వాస్తవానికి బ్లాక్ ఫ్రైడే క్రిస్మస్ సెలబ్రేషన్స్​కి గుర్తుగా చెప్తారు. దానికి సంబంధించిన షాపింగ్ చేస్తారు. పండుగ వాతావరణం ఉంటుంది. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నగర వ్యవస్థను అదుపులో ఉంచేందుకు పోలీసులను బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని అరవైల నుంచి డెబ్బైల మధ్య ఫిలడెల్ఫియా పోలీసులు దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సమయంలో అందరూ తమ ఫ్యామిలీతో ఉండాలనుకుంటారు. కానీ తమ కుటుంబాలను విడిచిపెట్టి డ్యూటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. అందుకే దీనిని బ్లాక్ ఫ్రైడే అని పిలవడం ప్రారంభించారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అయింది. దీనిని ప్రతికూలంగా భావించి బ్లాక్ ఫ్రైడేను బిగ్ ఫ్రైడేగా మార్చడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కానీ బ్లాక్ ఫ్రైడే అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని బ్లాక్ ఫ్రైడే గానే  పిలుస్తున్నారు. దీనిని కొనసాగించడానికి అమెరికా మార్కెట్లలో చాలా ఆఫర్లు, డిస్కౌంట్లు పెడతారు. దీనిని అనుసరిస్తూ అనేక దేశాలలో ఆన్ లైన్  షాపింగ్ అందించే వెబ్ సైట్లు దీనిని బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ప్రచారం చేయడం ప్రారంభించాయి. భారీ డిస్కౌంట్లపై షాపింగ్ అందిస్తున్నాయి. 

దేశీయ మార్కెట్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తన పట్టును రోజురోజుకు పెంచుకుంటూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పెరిగి మొత్తం 34,900 యూనిట్లు కొనుగోలుదారులకు చేరాయి. ఇది గత సంవత్సరం ఇదే నెల (అక్టోబర్)లో నమోదైన 30,644 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 13.89% వృద్ధిని సూచిస్తుంది. చేతక్ అమ్మకాలు ఈ స్థాయిలో పెరగడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది ఇది ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్‌లతో పోలిస్తే సరసమైన ధరలో లభిస్తోంది. రెండవది దీని బాడీని పూర్తిగా స్టీల్‌తో తయారు చేయడం వల్ల, క్వాలిటీ, మన్నిక విషయంలో వినియోగదారులకు మంచి నమ్మకాన్ని కలిగించడం జరిగింది. సాంప్రదాయ స్కూటర్ క్వాలిటీని కోరుకునే కస్టమర్లు దీని బిల్డ్ క్వాలిటీని ఇష్టపడుతున్నారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చేతక్ 3001, చేతక్ 3501, చేతక్ 3502, చేతక్ 3503 వేరియంట్లలో లభిస్తోంది. ఈ వేరియంట్లు ధర, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్ల పరంగా విభిన్నంగా ఉన్నాయి.

బజాజ్ చేతక్ 3001బేసిక్ మోడల్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.02 లక్షలుగా ఉంది. ఇందులో 3 కిలోవాట్-అవర్ సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 127 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అత్యవసర ఛార్జింగ్‌కు అనుకూలంగా, బ్యాటరీ కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 0% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ వేరియంట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టెయిల్ ల్యాంప్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డ్రమ్ బ్రేక్‌లు వంటి బేసిక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ బ్రూక్లిన్ బ్లాక్, ఆజూర్ బ్లూ, సైబర్ వైట్, లైమ్ యెల్లో, రేసింగ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

బజాజ్ చేతక్ 3501 మోడల్ ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఇందులో కొంచెం పెద్దదైన 3.5 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల, పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 153 కి.మీ వరకు మెరుగైన రేంజ్ అందిస్తుంది. ఫీచర్ల పరంగా ఇది TFT డిజిటల్ డిస్‌ప్లేతో పాటు, మెరుగైన భద్రత కోసం డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

బజాజ్ చేతక్ 3502 ధర రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే ఈ వేరియంట్‌లో కూడా 3.5 kWh బ్యాటరీ, 153 కి.మీ రేంజ్ లభిస్తుంది. 3501 వేరియంట్ కంటే ఇందులో అదనంగా కలర్ TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్,స్మార్ట్‌ఫోన్ అనుసంధానం కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉంటాయి. ఇది కూడా డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

బజాజ్ చేతక్ 3503  వేరియంట్ ధర రూ.1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 3.5 kWh బ్యాటరీని కలిగి ఉండి, 150 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. 3501, 3502 మోడళ్లకు మధ్యస్థంగా, ఇందులో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కంట్రో, మ్యూజిక్ కంట్రోల్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ పరంగా, దీనికి ముందు భాగంలో డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కు సంబంధించిన ఒక కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి రూ.56.44 కోట్ల జరిమానా విధిస్తూ అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తమకు గురువారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా అందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 74 కింద ఈ పెనాల్టీని విధించారు. అయితే, జీఎస్టీ అధికారుల ఈ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పుబట్టింది. సేవల ప్రదాత (సర్వీస్ ప్రొవైడర్) అందించిన సేవల వర్గీకరణను అధికారులు సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండానే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్డ్ క్రెడిట్‌గా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అధికారుల ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఆన్‌లైన్‌లో గురువారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవవ్వగా గంటలో 2.16 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సాయంత్రానికి మొత్తం 4.60 లక్షల మంది నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఈ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు టీటీడీ అనుమతినిచ్చింది. దీంతో ఈ నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన ఈ డిప్‌లో టోకెన్లు పొందిన భక్తుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 30 నుంచి తొలి మూడు రోజులు వారికి వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతినిస్తారు. మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించడంతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనున్ననారు. ఈ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి కోటాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తారు. ఈ టికెట్ల బుకింగ్ కోసం https://ttddevasthanams.ap.gov.in లేదా ttddevasthanams appను సంప్రదించవచ్చు. లేదా 95523 00009 వాట్సాప్ నంబర్లో   వివరాలు నమోదు చేసి టికెట్లు పొందవచ్చు.

ఢిల్లీని కాలుష్యం ముప్పు తిప్పలు పెడుతోంది. స్వచ్ఛమైన గాలి లేక నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఢిల్లీ వాసులు కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఢిల్లీలో జీవించలేకపోతున్నామని వాపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని విధించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరగాల్సిందేనని కోరారు.''నేను కలిసిన ప్రతి తల్లి నాకు ఒకటే చెప్పారు. బిడ్డలు విషపూరిత గాలిని పీల్చుకుంటున్నారని. నీరసించి పోవడమే కాకండా భయపడుతున్నారని చెప్పారు. ఆందోళనగా ఉంటున్నారని వాపోయారు. మోడీ జీ ! భారతదేశ పిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మీరెలా మౌనంగా ఉండగల్గుతున్నారు? మీ ప్రభుత్వానికి ఎందుకు అత్యవసర ప్రణాళిక లేదు. జవాబుదారీతనం లేదా?'' అంటూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ''ఆరోగ్య అత్యవసర పరిస్థితిని'' పరిష్కరించడానికి దేశానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. ''మన పిల్లలు స్వచ్ఛమైన గాలికి అర్హులు- సాకులు, పరధ్యానాలు కాదు.'' అని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. కవిత పట్టాలపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని రైలురోకో నిర్వహించిన కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అదుపులోకి తీసుకున్నారు.  రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కవితోపాటు జాగృతి నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కవిత, పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17శాతం రిజర్వేషన్లతోనే పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు.

టీటీడీ పరకామణి కేసులో సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మూడ్రోజుల క్రితమే సీఐడీ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం మరోసారి విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించి విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకుని విచారణకు అటెండ్ అయ్యారు. పరకామణి కేసులో ఎవరి ప్రమేయం ఉంది? బ్యాంకు లావాదేవీలు వంటి వాటిపై విచారణ సాగనుంది. డిసెంబర్ 2న సీఐడీ అధికారుల కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. దీంతో పరాకమణి చోరీ కేసు క్లైమాక్స్‌కు చేరుకునట్లే కన్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌, సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రులు, ఉన్నతాధికారులు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అమరావతికి మరింత ఆర్థిక సాయం అందించాలని కోరారు. కాగా తాజాగా శంకుస్థాపన చేయబడిన 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6,514 ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఏపీసీఆర్డీఏ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్,న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయాల నిర్మాణాన్ని ₹1,334 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. వెనుకబడిన కుల సంఘాలు తమ పిటిషన్‌లో, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలని కోరాయి. బీసీలలోని ఏ,బీ,సీ,డీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైనందున, ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాతే ఎందుకు సవాల్ చేస్తున్నారని పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో జీవో 46పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులో జరిగిన మాజీ మావోయిస్టు బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్దన్న హత్య కేసు పెద్ద సంచలనం సృష్టించింది. గతంలో నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, దశాబ్దాల తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో పాత ఘటన మళ్లీ వెలుగులోకి రావడంతో జరిగిన ఈ హత్య సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హత్య వెనుక కారణం ఇటీవల యూట్యూబ్‌లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అని పోలీసులు తేల్చారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధన్న తన మావోయిస్టు కాలంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను వెల్లడించారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తానే హత్య చేశానని చెప్పడం పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ వీడియోను చనిపోయిన వ్యక్తి కొడుకు సంతోష్ చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన తండ్రిని చంపిన వ్యక్తి ఇప్పుడు సామాన్య జీవితంలో గౌరవంగా తిరుగుతున్నాడన్న భావనతో ఆగ్రహం పెరిగి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సంతోష్ సిద్ధన్నను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే సిద్ధన్నను సంప్రదించి, అభిమానిని అంటూ నమ్మకం సంపాదించుకున్నాడు. తరచూ మాట్లాడడం, కలవడం, వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా సిద్ధన్నను పూర్తి స్థాయిలో నమ్మించాడు. తరువాత అనుకూలమైన సమయం చూసి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా దాడి చేసి రాళ్లతో కొట్టి అతన్ని హతమార్చాడు. హత్య చేసిన వెంటనే సంతోష్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన సమయంలోనే అసలు విషయం బయటపెట్టడంతో అందరూ షాక్ అయ్యారు. సిద్ధన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీలో దశాబ్దం పాటు పనిచేసి, అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. కోవర్టు హత్యాకాండల్లోనూ, పలు ఎన్‌కౌంటర్ ఘటనల్లోనూ అతని పాత్ర ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. 2004లో ఆయన స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయి, ప్రభుత్వ పునరావాస పథకాలతో సాధారణ జీవితాన్ని ప్రారంభించారు. 

అమెరికా లోని వైట్‌హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్‌పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్‌పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సందర్భంగా  ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నిందితుడు జంతువు, పిచ్చోడు అంటూ మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం కారణంగానే ఇదంతా జరిగిందంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ను ఎందుకు నిందిస్తున్నారంటూ నిలదీసిన విలేకరిపై కూడా ట్రంప్ మండిపడ్డారు. తెలివి తక్కువవారా? అంటూ పదే పదే రుసరుసలాడారు. నిందితుడు రహ్మానుల్లా లకన్వాల్‌ ఆప్ఘన్ జాతీయుడుగా గుర్తించారు. 2021 ఆగస్టులో ఆప్ఘన్‌స్థాన్‌లో బైడెన్ ప్రభుత్వం అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలో బైడెన్ ప్రభుత్వం ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 70, 000 ఆప్ఘన్ జాతీయులు అమెరికాలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించినవాడే రహ్మానుల్లా. బైడెన్ నిర్ణయం కారణంగానే ఈరోజు అమెరికాలో ఉగ్ర దాడి జరిగిందంటూ ట్రంప్ ఫైరయ్యారు. పునరావాస కార్యక్రమం ద్వారా ప్రవేశించిన వారికి శాశ్వత హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. రహ్మానుల్లా కూడా డిసెంబర్ 2024లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రంప్ అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత.. అనగా ఏప్రిల్ 23న ఆమోదించబడింది. రహ్మానుల్లా ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనట్లుగా ఒక అధికారి తెలిపారు. అయితే రహ్మానుల్లా ఉన్నట్టుండి ఉన్మాదిలా మారి వైట్‌హౌస్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ వీసాలను సమీక్షించాలని ఆదేశించారు. దీంతో ఆప్ఘన్ జాతీయుల గ్రీన్ కార్డులను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలకు అని పిలిచి పలువురిని అరెస్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఆప్ఘన్ జాతీయుల దరఖాస్తులను కూడా నిలిపివేసేశారు. మరోవైపు వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వాళ్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించి మాట్లాడుతూ  ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రో పాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. 

చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో ట్రాక్ నిర్వహణ కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా, మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యునాన్ ప్రావిన్స్‌లోని లౌయాంగ్‌జెన్ స్టేషన్‌లో కార్మికులు ట్రాక్ సాధారణ నిర్వహణ పనులు చేస్తుండగా టెస్ట్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ వెల్లడించింది. 

డిసెంబర్ 1నుంచి 20వ తేదీ వరకు ఇంద్ర, అమరావతి ఏసీ బస్సులో 10 శాతం వరకు ఛార్జీలను ఏపీఎస్ఆర్టీసీ తగ్గించింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఆదివారం ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదు. గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో 10 శాతం వరకు తగ్గుతుంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని అమరావతి బస్ సర్వీసుల్లో ఛార్జీ తగ్గుతుంది. గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా బీహెచ్ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 700 నుంచి 640 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి బీహెచ్ ఈఎల్ వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 770 నుంచి 710 రూపాయలకు తగ్గుతుంది. తెనాలి నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని ఇంద్ర బస్ సర్వీసుల్లో ఛార్జీ 960 నుంచి 880 రూపాయలకు తగ్గుతుంది.

ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ పేరిట కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.జనవరి 1 నుంచి ఒక నెలపాటు హత్యాబంద్, పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చల కోసం ముందుకు రావాలని, దీనితో అడవి ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయని వారు పేర్కొన్నారు. తాము ఇంతకుముందు 2022లో కూడా పోరాట విరామం ప్రకటించినప్పటికీ, అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదని ఎంఎంసీ పేర్కొంది. ఆ తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా, ప్రభుత్వాలు నిజమైన చర్చలకు రావాలన్నారు. అడివాసీల భూమి హక్కులు, పోలీసు దాడులు, అభివృద్ధి లోపం వంటి సమస్యలపై ప్రభుత్వాలతో ఓపెన్ డిబేట్లు, చర్చలు జరగాలని కమిటీ డిమాండ్ చేసింది. ఎన్‌కౌంటర్ పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనలు ఆగితేనే శాంతి చర్చలు సార్థకం అవుతాయని మావోయిస్టులు పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 1, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 11.15 మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్‌గా ఒక ఫోన్ నంబర్‌ను విడుదల చేశారు. పోరాట విరామ సమయంలో ఏ దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు.

మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నారని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్ జీని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే నవంబర్ 18న జరిగిన మావో కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. అదే సమయంలో దేవ్ జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీకేఎస్‌జెడ్‌సీ తెలిపింది. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బంద్‌కు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. కాగా నవంబర్ 18న హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత దేవ్‌ జీ ఆచూకీ లభించలేదు. దేవ్‌ జీ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఇటు పోలీసులు కానీ.. అటు మావోయిస్టులు కానీ నిర్ధారించలేదు. ఎట్టకేలకు దేవ్‌ జీకి సంబంధించి మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. పోలీసుల అదుపులో దేవ్‌ జీ ఉన్నారని.. అతడిని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ లేఖలో స్పష్టం చేసింది. నవంబర్ 18న ఏపీ పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్‌ చేశారని.. కానీ పక్కా ప్రణాళికతోనే హిడ్మాను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని.. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని కమిటీ భావిస్తోంది. దేవ్‌ జీతో పాటు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ లేఖలో డిమాండ్ చేసింది. అయితే దేవ్ జీ తమ ఆధీనంలో లేరని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. అలాగే ఏపీ పోలీసులు కూడా దేవ్ జీ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. దేవ్‌ జీ ఆచూకీపై ఆయన బంధువులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా దేవ్‌ జీ తమ ఆధీనంలో లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు. 

భారీ వర్షాలతో శ్రీలంక అతాలకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు ముంచెత్తడంతో సుమారు 31 మంది మరణించినట్లు అధికారులు గురువారం ప్రకటించారు. కొలంబోకు తూర్పున 300 కి.మీ దూరంలో ఉన్న మధ్యప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాలైన బదుల్లా, నువారా ఎలియాలో 18 మంది మరణించినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. ఇవే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరో 14మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు, పొలాలు, రహదారులను వరదలు ముంచెత్తాయి. పర్వతప్రాంతాలను రాళ్లు, బురద మరియు చెట్లు పట్టాలపై పడటంతో రైల్వే వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. పలు ప్రాంతాల్లో ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లను కూడా మూసివేశామని ప్రకటించారు. వర్షాలు, ప్రతికూల వాతావరణంతో సుమారు 4,000 కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. వారికి పూర్తిగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మరో విడత భూ సమీకరణ తప్పదని స్పష్టం చేసారు రైతులు సహకరించాలని కోరారు. దీంతో ప్రభుత్వం రెండో విడత కింద 44,676 ఎకరాల లాండ్ పూలింగ్ కు కసరత్తు పూర్తి చేసింది. గ్రామాల వారీగా ఎంత సమీకరించాలో లక్ష్యాలు నిర్ణయించింది. అమరావతిలో లాండ్ పూలింగ్ కు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు రైతులకు ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు అన్నారు. అదే జరిగితే ఓ మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందని అన్నారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. కాగా, త్వరలో ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మరో 44,676 ఎకరాల భూ సమీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. తూళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని గ్రామాల్లో జరగనుంది. తూళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లోని 9919 ఎకరాలు సమీకరించాలని భావిస్తున్నారు. అమరావతి మండలంలోని వైకుంటపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల గ్రామాలలోని 12 ,838 ఎకరాల్లో భూ సమీకరణ జరిగే అవకాశం ఉంది. తాడికొండలోని తాడికొండ, కంతేరు గ్రామాలలోని 16,463 ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరించేలా సీఆర్డీఏ ప్రణాళికలు సిద్దం చేసింది. మంగళగిరి లోని కాజా గ్రామంలోని 4492 ఎకరాలను భూ సమీకరణ ద్వార సేకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో భూ సమీకరణ కు నోటిఫికేషన్ విడుదల చేయనున్న సీఆర్డీఏ త్వరలో జారీ చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే రాజధాని లోని 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాలు మేర ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించారు. ఇక అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు ఇన్నర్ రింగ్ రోడ్ కు మధ్యలోని భూములను సేకరించనున్నారు. ఈ భూముల్లో అమరావతికి ఎయిర్ పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఎర్రుపాలెం నుండి అమరావతికి వరకు కొత్తగా వేయనున్న రైల్వే లైన్ కోసం వినియోగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎంతో సమావేశం సమయంలోనూ రైతులు ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆంగీకారం తెలిపారు. దీంతో రెండ విడత లాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది.

3