అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లను సైతం జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో అనుమానాలు పెరిగాయి. ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ఎక్కడున్నారు? అసలాయన బతికే ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలపై ఆయన పార్టీకి చెందిన సెనేటర్ ఖుర్రం జీషన్ స్పందించారు. ఇమ్రాన్ బతికే ఉన్నారని ఆయన అన్నారు. ఇమ్రాన్ ను అడియాలా జైల్లో ఉంచారని తెలిపారు. దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెచ్చేందుకే పాక్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇమ్రాన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయన ఫొటోలు, వీడియోలను విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. “ఇమ్రాన్ ఖాన్ జనాదరణ చూసి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఆయన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇమ్రాన్ బతికే ఉన్నారని, జైల్లో క్షేమంగా ఉన్నారని మాకు హామీ లభించింది” అని ఖుర్రం జీషన్ తెలిపారు. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో హత్య చేశారంటూ అఫ్గానిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి వార్తలు వ్యాపించాయి. ”కోర్టు ఆదేశాలున్నా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను కూడా అధికారులు నెల రోజులుగా అనుమతించడం లేదు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నాయకత్వం, న్యాయవాదులకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే. నిబంధనలు బేఖాతరు చేయడమే. దేశం విడిచి వెళ్లి, నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ఆయనతో ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ అలాంటి వాటికి ఎప్పటికీ అంగీకరించరు. జైల్లో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. యువతలో ఆయనకు బలమైన మద్దతు ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఒక్క ఫోటో.. పాకిస్తాన్ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేయగలదు. అందుకే ప్రభుత్వం భయపడుతోంది. ఈ కారణంగానే ఇమ్రాన్ జైల్లో ఉన్నప్పటి నుండి ఆయన ఫోటో బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది” అని జీషన్ తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు : సెనేటర్ ఖుర్రం జీషన్
by Telugu Lo Computer at November 30, 2025
Labels:
can change the political face of Pakistan
,
government is trying to make a deal with him that if he leaves the country
,
Imran Khan is alive
,
international
,
Senator Khurram Zeeshan
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment