నార్జో 70 సిరీస్ ఫోన్లు త్వరలో విడుదల ?
రి యల్‌మి సంస్థ నార్జో 70 సిరీస్ ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. ఈ సిరీస్ ఫోన్లు అందుబాటులోకి ధరలోనే ఉండనున్నాయని తెలుస్తోంది. గత సంవత్సరం నార్జో 60 మరియు నార్జో 60 ప్రో హ్యాండ్‌సెట్లను విడుదల చేసింది. అయితే ఈ రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ నెలలోనే విడుదల! : ఈ రియల్‌మి నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్ ఈనెలలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్ వివరాలు ఇటీవలే కొన్ని అందుబాటులోకి వచ్చాయి. రియల్‌మి ఇండియా ల్యాండింగ్ పేజీలో ఈ కొత్త హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన గ్లింప్స్ విడుదల అయింది. తొలిసారిగా గ్లాస్ డిజైన్ : ఈ గ్లింప్స్ ఆధారంగా ఈ రియల్‌మి నార్జో 70 డీప్ గ్రీన్ కలర్‌లో కనిపించింది. మరియు వెనుకవైపు గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సెగ్మెంట్‌తో గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉన్న తొలిఫోన్ ఇదేనని రియల్‌మి చెబుతోంది. ఈ గ్లింప్స్ ఆధారంగా ఈ ఫోన్ వృత్తాకార కెమెరా గ్లాస్ మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది హ్యాండ్‌సెట్‌కు డ్యూయల్ టోన్ ఎఫెక్ట్‌ను ఇస్తోంది. రియల్‌మి నార్జో 70 ప్రో స్మార్ట్‌ఫోన్ తన పాత తరం మ...