5,000 గ్రహాల్లో ఏలియన్స్?
5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” ఇటీవల ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (టీఇఎస్ఎస్) ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ టీఇఎస్ఎస్ శాటిలైట్ ను ప్రయోగించింది. ఆనాటి నుంచి 5,000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే 24 00 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ టీఇఎస్ఎస్ గుర్తించిందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు. టీఇఎస్ఎస్ గుర్తించిన 5,000 బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. టీఇఎస్ఎస్ ఉపగ్రహం ఖగోళ వస్తువును కనిపెట్టి దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత స...