Posts

Showing posts with the label accusing it of resorting to cheap theatrics

సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ డిమాండ్

Image
తె లంగాణ శాసనసభలో తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శాసనసభ వేదికగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొలేక కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర డ్రామాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలనా వైఫల్యాలు, '420' హామీలు సహా అన్ని ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రతీ అంశంపైనా స్పష్టమైన సమాధానాలు రాబడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా తప్పించుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చిల్లర వేషాలు వేస్తోందని, ఈ పరిణామాలన్నింటినీ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారు బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరుగుతున్న దాడి, అరెస్టుల అంశంపై శాసనమండలిలో ఖచ్చితంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకురాళ్లపై జరిగిన దాడికి, బనాయించిన కేసులకు ప్రభుత్వం సమాధాన...