యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ మోనిటైజేషన్ నిబంధనలను కఠినతరం చేసిన కంపెనీ
యూ ట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల ఆడియన్స్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్‌లో మోనిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది వ్యవధిలో కనీసం 8,000 గంటల వాచ్ టైమ్‌ను సాధించాలి, లేదా గడిచిన 90 రోజుల్లో కనీసం 2 కోట్ల షార్ట్స్ వ్యూస్‌ను సాధించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 1,000 సబ్‌స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో కోటి షార్ట్స్ వ్యూస్ ఉంటే మోనిటైజేషన్‌కు అర్హత లభించేది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఇప్పటికే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగమై ఆదాయం పొందుతున్న పాత క్రియేటర్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాకుండా, షార్ట్స్ క్రియేటర్ పూల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందాలంటే క్రియేటర్లు 90 రోజుల వ్యవధిలో కోటి షార్ట్స్ వ్యూస్‌ను నిలకడగా కొనసాగించాల్సి ఉంటుందని యూట్యూబ్ స్పష్టం చేసింది. ఒకవేళ ఏ సమయంలోనైనా వ్యూస్ పరిమితి కంటే తగ్గితే.. వారి షార్ట్స్ ఆదాయం మాత్రమే ఆగుతుంది. కానీ వారు పార్ట్‌నర్...