సెప్టెంబర్ 2న వివో టీ5 5జీ విడుదల
దే శీయ మార్కెట్లో సెప్టెంబర్ 2న వివో టీ5 5జీ విడుదలకానుంది. విడుదలకు ముందే దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఇందులో 1.5K రిజల్యూషన్‌తో 144Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7500 Turbo ప్రాసెసర్, 7,050mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్ రాయల్ బ్రాన్జ్, సిల్వర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. 1.5K రిజల్యూషన్‌తో 144Hz 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. స్క్రీన్ మధ్యలో పైభాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, యానిమేషన్లు, గేమింగ్ వంటి పనుల్లో డిస్‌ప్లే మరింత స్మూత్‌గా ఉండే అవకాశం ఉంది. కర్వ్డ్ AMOLED ప్యానెల్ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను అందించనుంది. Skyline Designను అందిస్తున్నారు. ఈ డిజైన్ ఇటీవల Vivo S2లో కూడా కనిపించింది. ఫోన్ వెనుక భాగంలో పైవైపు అడ్డంగా ఉండే కెమెరా బార్ కనిపిస్తుంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లతో పాటు LED లైట్ రింగ్ ఉన్నట్లు టీజర్ చిత్రాలు సూచిస్తున్నాయి. ఫోన్ మందం కేవలం 7.9mmగా ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ స్లిమ్ డిజైన్‌ను అందించడంపై Vivo ...