దేశవ్యాప్తంగా నిలిచిన ఇండిగో విమాన సర్వీసులు
దే శవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పటికే 200 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 28 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్‌కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. బెంగళూరు ఎయిర్‌పోర్టులో 42 విమానాలు రద్దు అయ్యాయి. చాలా చోట్ల ఆలస్యంగా విమానాలు నడుస్తున్నాయి. దేశంలో 35 శాతానికి ఇండిగో సర్వీసులు పడిపోయాయి. సిబ్బంది కొరత కారణంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.