Posts

Showing posts with the label Deputy Chief Minister Bhatti Vikramarka

ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Image
తె లంగాణ ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో 100 రోజుల్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు విడుదల చేసి మాట నిలబెట్టుకుంది. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం మూడు విడతల్లో ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించింది. మొదటి విడతగా మే 29న రూ. 2,000 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా జూన్ 30 న రూ.2,000 కోట్లు విడుదల చేయగా, తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇక ఈ విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్...

తెలంగాణలో జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

Image
తె లంగాణలోని ఖమ్మం జిల్లాలోని బోనకల్ , ఎర్రుపాలెం మండలాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  పర్యటించి విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్ర వనరులు విపరీతంగా దోపిడీకి గురికావడం వల్ల తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందని విమర్శించారు. వనరుల దోపిడీని అరికట్టి, ఆ సంపదను ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం వెచ్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు నూతన పథకాలను ప్రకటించింది. జూన్ 2 నుంచి పాఠశాల విద్యార్థులందరికీ అల్పాహార పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. అలాగే, ఇప్పటివరకు కేవలం పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. “అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడేలా ఎదగాలి” అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డకు ఉచితంగా, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్...

పాలకులం కాదు ప్రజలకు సేవకులం : నాలుగవసారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

Image
తె లంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలో భట్టి విక్రమార్క  ప్రసంగిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యమన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో తాము పాలన సాగిస్తున్నాం. తాము పాలకులం కాదు ప్రజలకు సేవకులం. ప్రజలు తమకు అప్పగించిన ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజాసంక్షేమ, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. రెండేళ్ల పాలనలో ప్రజలకు తామిచ్చిన వాగ్దానాలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వా-కి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం.. అభి...

మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తాం !

Image
మూ సీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్మెంట్లను  నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారన్నారు. అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని, వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామని వివరించారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని తీర్చిదిద్దుతుంటే ప్రతి అడుగులో అడ్డుపడటం సరికాదన్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలి, మురికిలోనే బతకాలి అనే ధోరణి ప్రతిపక్ష పార్టీ నాయకులు వీడాలని ఆయన హితవు పలికారు. ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూసీ నది ప్రక్షాళన దిశగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత పారదర్శకంగా ఉన్నాయని, నదిలో...

తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం

Image
తె లంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సచివాలయంలో “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌పై లోతైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విజన్ డాక్యుమెంట్ పాలసీని డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్‌లోనే ‘తెలంగాణ విజన్ 2047’ పాలసీని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ సమ్మిట్‌లో భాగంగా, మొదటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రెజెంట్ చేయడంతో పాటు, అన్ని వర్గాలకు, రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రెండవ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ర...