₹4,194 కోట్లతో ఫస్ట్ క్రై ఐపీఓ !
ఆ న్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా రూ.4,194 కోట్లు సమీకరించనుంది. ఆగస్టు 6 నుంచి సబ్‌స్క్రిప్షన్ మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించిన ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.440-465గా నిర్ణయించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఆగస్టు 5న సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. ఐపీఓలో భాగంగా 75 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం చొప్పున రిజర్వ్ చేశారు. ఇన్వెస్టర్లు ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 32 షేర్లను (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ రూ.1666 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా జారీ చేస్తోంది. రూ.2,528 కోట్లకు సమానమైన 5.44 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు వదలుకోనున్నారు. సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన ఏవీఎఫ్ ఫ్రాగ్ 2.03 కోట్లు, ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 28.06 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ప్రస్తుతం బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు ...