Posts

Showing posts with the label Chairman Anil Agarwal has confirmed

వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ : ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనున్న వేదాంత

Image
వే దాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత అవి మొత్తం 6 షేర్లు అవుతాయి. వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ & గ్యాస్,వేదాంత స్టీల్ & ఫెర్రస్, వేదాంత బేస్ మెటల్స్, వేదాంత పవర్ గా విడగొడుతున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు. వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను వి...